Daaku Maharaj: ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli) దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తాజాగా నటించిన చిత్రం డాకు మహారాజ్ (Daaku Maharaj). శ్రీకర స్టూడియోస్ బ్యానర్ పై సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇకపోతే ఆంధ్ర , తెలంగాణలో ఈ సినిమా బెనిఫిట్ షోలకు , ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వలేదు.. దీంతో ఈరోజు 8 గంటలకు ఈ సినిమా ప్రారంభం కాబోతోంది. ఇకపోతే యూఎస్ లో సినిమా చూసిన తెలుగు ఆడియన్స్ ఈ సినిమాపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మరి బాలయ్య ఈ సంక్రాంతి విన్నర్ గా నిలిచారా? అసలు ఈ సినిమా ఎలా ఉంది ? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
డాకు మహారాజ్ పబ్లిక్ టాక్..
యూఎస్ లో సినిమా ప్రీమియర్లు మొదలైన విషయం తెలిసిందే. ఈ మూవీలో బాలకృష్ణ నటన, డైలాగ్స్ అదిరిపోయాయని, ముఖ్యంగా తమన్(Thaman ) మ్యూజిక్ ఇరగదీసారని కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా చివరి 30 నిమిషాలు ఊహించేలా ఉంటుందని కూడా అంటున్నారు. మొత్తానికి అయితే ఈ సినిమా బాలయ్య అభిమానులకు పసందైన విందు లాంటిది అని కూడా చెబుతూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా బిజిఎం పరంగా ఈ సినిమా మరింత విజయం సాధిస్తుందని, ప్రీమియర్ షో చూసినవారు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే సంక్రాంతి బరిలోకి దిగిన బాలయ్య మళ్ళీ సక్సెస్ అయ్యారని కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే యూఎస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో తెలియాలి అంటే ఇక్కడ షో పడే వరకు ఎదురు చూడాల్సిందే.
బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ..
తాజాగా సంక్రాంతి బరిలో నిలిచిన డాకు మహారాజ్ యూఎస్ ఫలితాలు చూస్తే మాత్రం ఖచ్చితంగా బాలయ్య ఈసారి కూడా హిట్ అందుకోబోతున్నారు అని చెప్పవచ్చు. ఇప్పటికే అఖండ, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న బాలయ్య ఇప్పుడు డాకు మహారాజ్ తో కూడా మరో విజయాన్ని అందుకోవడం గ్యారెంటీ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో ప్రగ్యా జైష్వాల్ (Pragya Jaiswal), శ్రద్ధ శ్రీనాథ్ (Shraddha shrinath), చాందిని చౌదరి (Chandini Chowdary), బాబీ డియోల్ (Bobby Deol) తదితరులు కీలకపాత్రలు పోషించారు. ముఖ్యంగా ఈ సినిమాలో విలన్ గా నటించిన బాబీ డియోల్ కి తెలుగులో వరుస అవకాశాలు వస్తాయనడంలో సందేహం లేదు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఇందులో నటించిన ప్రగ్యా జైస్వాల్ బాలయ్యకు లక్కీ హీరోయిన్ గా మారిపోయిందని కూడా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ‘అఖండ’ సినిమాలో ఈమె నటించింది. సూపర్ హిట్ అయింది. ఇప్పుడు డాకు మహారాజ్ లో నటించింది. ఇది కూడా సూపర్ హిట్ అంటూ ఆడియోను తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా బాలయ్య సంక్రాంతి బరిలోకి దిగి హిట్ అందుకున్నారని చెప్పవచ్చు.