BigTV English

Balakrishna: బాలయ్య ఫ్యాన్స్ ఓవరాక్షన్.. కేసు నమోదు చేసిన పోలీసులు..

Balakrishna: బాలయ్య ఫ్యాన్స్ ఓవరాక్షన్.. కేసు నమోదు చేసిన పోలీసులు..

Balakrishna: చాలావరకు స్టార్ హీరోల ఫ్యాన్స్ అంతా తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ ఉంది అనగానే చేసే రచ్చ అంతా ఇంతా కాదు. బెనిఫిట్ షో సమయం నుండే థియేటర్ల దగ్గర రచ్చ మొదలవుతుంది. ముఖ్యంగా కొన్ని థియేటర్ల వద్ద అయితే సినిమా రిలీజ్‌నే ఒక పండగ లాగా సెలబ్రేట్ చేస్తారు. అలాంటి క్రమంలో కొన్నిసార్లు ఫ్యాన్స్ సైతం ఓవరాక్షన్ చేయడాన్ని నెటిజన్లు చాలాసార్లు చూసే ఉంటారు. అలా ఇటీవల బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ రిలీజ్ సమయంలో కూడా ఫ్యాన్స్ ప్రవర్తన కాస్త శృతిమించింది. అదే వారిని చిక్కుల్లో పడేసింది. ఇప్పుడు కొందరు బాలయ్య ఫ్యాన్స్‌పై పోలీసులు కేసు నమోదు చేసేవరకు వెళ్లింది.


వారికి కోపమొచ్చింది

బాలయ్య హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా విడుదల సమయంలో తిరుపతిలో జరిగిన ఘటన తన ఫ్యాన్స్‌ను చిక్కుల్లో పడేసింది. మూవీ రిలీజ్ సమయంలో బాలయ్య కటౌట్ వద్ద ఒక పొట్టేలును నరికారు అభిమానులు. ఆ విజువల్స్ వెంటనే సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి. కొన్నిరోజుల్లోనే అవి తెగ వైరల్ కూడా అయ్యాయి. దీంతో జంతు ప్రేమికులంతా అలా చేయడం కరెక్ట్ కాదంటూ ఈ ఘటనను ఖండించడం మొదలుపెట్టారు. మామూలుగా పొట్టేలును నరకడం అనేది పండగ సమయాల్లో ఆచారంలో భాగంగా జరిగేదే. కానీ ఒక సినిమా హీరో కటౌట్ ముందు అలా చేసేసరికి జంతు ప్రేమికులకు మరింత కోపం వచ్చింది.


అయిదుగురిపై కేసు

బాలయ్య కటౌట్ ముందు పొట్టేలును నరికిన అభిమానులపై కొందరు జంతు ప్రేమికులు కేసు నమోదు చేశారు. దీంతో మొత్తం అయిదుగురు ఫ్యాన్స్‌పై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. అంతే కాకుండా పొట్టేలును నరికిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఎంతోమంది నెటిజన్లు కూడా దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మమూలుగా ఆచారాల కోసం ఇలా చేయడాన్నే ఆపేస్తే బాగుంటుందని ఫీలవుతుంటే ఇప్పుడు సినిమా రిలీజ్ సమయంలో కూడా ఇలా చేయడం మొదలుపెట్టారని, ఇది కరెక్ట్ కాదని కామెంట్ చేస్తున్నారు. సినిమాను సినిమాలాగా ఎంజాయ్ చేయాలని ఇలాంటివి చేయకూడదని సలహా ఇస్తున్నారు.

Also Read: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడి కన్నుమూత

సినిమా విషయానికొస్తే..

బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ (Balakrishna) హీరోగా నటించిన సినిమానే ‘డాకు మహారాజ్’ (Daaku Maharaj). మొదట్లో ఈ మూవీకి ప్రేక్షకుల్లో అంతగా బజ్ క్రియేట్ అవ్వలేదు. కానీ కాంట్రవర్సీల వల్లే దీనిపై క్రేజ్ పెరిగింది. మొదటి రెండు పాటలు విడుదలయినప్పుడు కూడా ఈ మూవీని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఊర్వశి రౌతెలా చేసిన ‘దబిడి దిబిడి’ అనే స్పెషల్ సాంగ్ విడుదల కాగానే దీనిపై ట్రోల్స్ మొదలయ్యాయి. ఊర్వశితో బాలయ్య చేసిన స్టెప్స్ చాలామందికి నచ్చలేదు. అసలు అలా ఎలా చేశారంటూ ఎన్నో విమర్శలు వచ్చాయి. అలా అప్పటినుండి ‘డాకు మహారాజ్’పై బజ్ క్రియేట్ అయ్యింది. థియేటర్లలో విడుదలయిన తర్వాత యావరేజ్ టాక్‌తో అయినా ఈ మూవీ దూసుకుపోతోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×