David Lynch: హాలీవుడ్‌లో చాలామంది దర్శకులు ఉన్నా.. అందులో కొందరు మాత్రమే ఆస్కార్ రేసులో నిలబడే రేంజ్‌లో తమ సినిమాలు తెరకెక్కిస్తారు. అలాంటి దర్శకులలో ఒకరు డేవిడ్ లించ్. తన సినిమాలతో ఎంతోకాలంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న డేవిడ్.. ఇక లేరు. డేవిడ్‌కు ఎన్నో ఏళ్లుగా సిగరెట్స్ తాగే అలవాటు ఉంది. ఆ అలవాటు వల్లే తను ఎంఫిసెమా అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఎంతోకాలంగా ఈ వ్యాధితో బాధపడుతున్న డేవిడ్ తాజాగా కన్నుమూశారని తన కుటుంబ సభ్యులు స్వయంగా ప్రకటించారు. దీంతో తన సినిమాలు చూసి, దర్శకుడిగా తనను ఆదరించిన ప్రేక్షకులు.. తన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. హాలీవుడ్.. ఒక మంచి దర్శకుడిని మిస్ అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
దర్శకుడిగా ప్రయాణం
డేవిడ్ లించ్ (David Lynch) దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్లూ వెల్వెట్’, ‘ది ఎలిఫెంట్ మ్యాన్ ముల్హోలాండ్ డ్రైవ్’ లాంటి సినిమాలు ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకున్నాయి. ఆయన సినిమాలు చూసినవారంతా ఆయనను ఒక విజనరీ డైరెక్టర్ అంటుంటారు. 1946లో మిస్సోలాలోని మోంటానాలో జన్మించారు లించ్. 1960ల్లో ఆయన ఆర్ట్ కాలేజ్‌లో చేరారు. ఆర్ట్స్ స్టూడెంట్‌గా ఉన్నప్పుడే ‘సిక్స్ మెన్ గెట్టింగ్ సిక్’ అనే షార్ట్ ఫిల్మ్‌ను తెరకెక్కించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 1971లో లాస్ ఏంజెల్స్‌కు ప్రయాణమయ్యి.. అక్కడ ఫిల్మ్ మేకింగ్ గురించి నేర్చుకోవడం మొదలుపెట్టారు. అలా 1976 వరకు దర్శకుడిగా తన మొదటి సినిమాను సిద్ధం చేయగలిగారు లించ్. ఆ సినిమాకు మొదట్లో ఆదరణ లభించకపోయినా.. ఆ తర్వాత ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్.. తనతో ‘ది ఎలిఫెంట్ మ్యాన్’ తెరకెక్కించడానికి ముందుకొచ్చింది.
Also Read: అమెరికా కోడలు.. బాబు కోసం ఇండియాలో ల్యాండ్ అయ్యిందయ్యా..
ఆస్కార్ నామినేషన్స్
‘ది ఎలిఫెంట్ మ్యాన్’ (The Elephant Man) మూవీ 8 కేటగిరిల్లో ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. అలా డేవిడ్ లించ్‌కు హాలీవుడ్ దర్శకుడిగా మంచి స్టేటస్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత దర్శకుడిగా ఆయన చేసిన పలు ప్రయోగాలు ఫెయిల్ అయ్యాయి. అదే సమయంలో ‘బ్లూ వెల్వెట్’ లాంటి డార్క్ మూవీని తెరకెక్కించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆ సినిమా కూడా ఒక కల్ట్ హిట్‌గా నిలిచింది. 1986లో విడుదలయిన ఈ సినిమాను విమర్శకులు సైతం ప్రశంసించారు. ఈ సినిమా ఏకంగా తనను బెస్ట్ డైరెక్టర్ కేటగిరిలో ఆస్కార్ వరకు తీసుకెళ్లింది. అలా డేవిడ్ లించ్ పాపులారిటీ పెరుగుతూ వచ్చింది. ఇతర హాలీవుడ్ దర్శకులకు గట్టి పోటీగా మారింది.
సిరీస్‌లు కూడా
సినిమాలు మాత్రమే కాదు.. ఆపై టీవీ సిరీస్‌లను కూడా డైరెక్ట్ చేసి తన కథలను ప్రేక్షకుల వరకు తీసుకెళ్లాలని డేవిడ్ లించ్ ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో మొదటి అడుగు అయిన ‘ట్విన్ పీక్స్’ విపరీతంగా సక్సెస్ అయ్యింది. 1990 మొదట్లో ఈ టీవీ సిరీస్ మొదటిసారిగా ప్రసారమయినప్పుడు చాలామంది ఇది పెద్ద డిశాస్టర్ అవుతుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా విపరీతమైన పాజిటిల్ రెస్పాన్స్‌తో ‘ట్విన్ పీక్స్’ సూపర్ సక్సెస్‌ను సాధించింది.