BigTV English

Balakrishna: ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడికి బాలయ్య మరో ఛాన్స్.. అంత రిస్క్ అవసరమా.?

Balakrishna: ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడికి బాలయ్య మరో ఛాన్స్.. అంత రిస్క్ అవసరమా.?

Balakrishna: ఈరోజుల్లో దర్శకుడి చివరి సినిమా హిట్ అయ్యిందా లేదా తనకు ఎన్ని ఫ్లాప్స్ ఉన్నాయని పట్టించుకోకుండానే కొందరు హీరోలు అవకాశమిస్తున్నారు. ఇక సీనియర్ హీరో బాలకృష్ణ (Balakrishna) కూడా అదే కేటగిరిలోకి చేరనున్నారు. ఒక దర్శకుడు తనకు అట్టర్ ఫ్లాప్ వచ్చినా కూడా మళ్లీ తనతోనే కలిసి పనిచేయడానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ‘అఖండ 2’ సినిమాలో బిజీగా ఉన్నారు బాలయ్య. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని తన ఫ్యాన్స్ అంతా బలంగా నమ్ముతున్నారు. అలాంటిది తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ తర్వాత ఒక ఫ్లాప్ దర్శకుడితో బాలయ్య మూవీ చేయడానికి ఓకే చేశాడని సమాచారం.


గ్రీన్ సిగ్నల్.?

బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్ అంటే తిరుగులేదని ఫ్యాన్స్ అంటుంటారు. అందుకే ఫ్యాన్స్ కోరిక తీర్చడానికి మరోసారి బోయపాటితో కలిసి సినిమా చేయడానికి సిద్ధమయ్యారు బాలయ్య. రెండేళ్ల క్రితం విడుదలయిన ‘అఖండ’కు సీక్వెల్‌గా ‘అఖండ 2’ను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. దీని తర్వాత తనకు ‘వీర సింహారెడ్డి’ లాంటి హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేనితోనే బాలయ్య మరో మూవీ చేయనున్నారని సమాచారం. ఇలా హిట్స్ ఇచ్చిన దర్శకులకు మాత్రమే కాకుండా తనకు ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితో కూడా మళ్లీ కలిసి పనిచేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట బాలయ్య. ఆ దర్శకుడు మరెవరో కాదు.. పూరీ జగన్నాధ్.


డిశాస్టర్ సినిమాలు

ఒకప్పుడు హీరోల మ్యానరిజంను తనకంటే బాగా ఎవరూ చూపించలేరని తనకంటూ ఒక గుర్తింపు సాధించిన డైరెక్టర్ పూరీ జగన్నాధ్. అప్పట్లో పూరీ సినిమాలంటే యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉండేది. అలాంటి ఇప్పుడు పూర్తిగా ఫ్లాప్ డైరెక్టర్‌గా మారిపోయాడు. గత కొన్నేళ్లలో తను తెరకెక్కించిన సినిమాలు ఏవీ ప్రేక్షకులను కనీసం ఇంప్రెస్ చేయలేకపోతున్నాయి. చివరిగా రామ్ హీరోగా ‘డబుల్ ఇస్మార్ట్’ అనే మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు పూరీ జగన్నాధ్. కానీ ఆ సినిమా డిశాస్టర్‌గా నిలిచింది. అందుకే బాలయ్య లాంటి స్టార్ హీరోతో సినిమా చేస్తే తను మళ్లీ ఫామ్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పూరీ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

Also Read: అందుకే ‘యానిమల్’ కోసం రణబీర్‌ను ఎంపిక చేసుకున్నా.. రివీల్ చేసిన డైరెక్టర్

ఛాన్స్ దొరికేనా.?

బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పడడంతో పూరీ జగన్నాధ్‌ (Puri Jagannadh)కు ఒక్క అవకాశం ఇవ్వడానికి కూడా ఏ హీరో ఇష్టపడడం లేదు. అందుకే ప్రస్తుతం తనకు అవకాశం ఇచ్చే హీరోల కోసం వెతకడం మొదలుపెట్టాడు ఈ డ్యాషింగ్ డైరెక్టర్. హీరో గోపీచంద్‌తో తను ఒక సినిమా చేయనున్నాడని కొన్నాళ్ల క్రితం ఇండస్ట్రీ వార్తలు వైరల్ అయ్యాయి. కానీ అవి నిజమా, కాదా ఇంకా క్లారిటీ లేదు. గోపీచంద్ కూడా ప్రస్తుతం ఫామ్‌లో లేడు కాబట్టి బాలయ్య లాంటి హీరోను లైన్‌లో పెడితే తను కూడా మళ్లీ ఫామ్‌లోకి వస్తాడని నమ్మకంతో ఉన్నాడట పూరీ జగన్నాధ్. కానీ ప్రస్తుతం బాలయ్యకు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ఉండడంతో పూరీకి అవకాశం ఇవ్వడం కష్టమే అని వార్తలు వినిపిస్తున్నాయి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×