Minister Sitakka: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క్ గుడ్ న్యూస్ చెప్పారు. 14 వేల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామక ప్రకటనను ఇంటర్నేషనల్ ఉమెన్ డే రోజున(ఈ 8న) విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు.
ALSO READ: Warangal Airport: మనకు స్వాతంత్ర్యం రాకముందే వరంగల్ ఎయిర్‌పోర్ట్ ఫేమస్: మంత్రి రామ్మోహన్ నాయుడు
ఈ నెల 8న ఇంటర్నేషనల్ ఉమెన్ డే రోజున సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో లక్ష మందితో సభ నిర్వహించనున్నట్టు మంత్రి సీతక్క తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ నిర్వహణపై మంత్రి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మార్చి 8న నిర్వహించే కార్యక్రమాల వివరాలను ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. దేశంలోనే అత్యుత్తమ సాధికారిత విధానాన్ని రూపొందిస్తామని, కొన్ని రాష్ట్రాల్లో చేపట్టిన మహిళా సంక్షేమ కార్యక్రమాలు, స్కీంలపై అధ్యయనం చేయడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పుకొచ్చారు.
ALSO READ: CM Revanth Reddy: SLBC టన్నెల్ సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
అదే రోజున సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు సంబంధించి పలు పథకాలను శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను సీఎం ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. మొదటి విడతలో 50 బస్సులకు సీఎం పచ్చజెండా ఊపనున్నారని మంత్రి సీతక్క చెప్పారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల మంజూరు, అలాగే 31 జిల్లాల్లో మహిళా సంఘాలతో పెట్రోల్ బంకుల నిర్వహణకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. సోలార్ విద్యుత్ ప్లాంట్లకు వర్చువల్‌గా శంకుస్థాపన, 14 వేల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు ఇందిరా మహిళా శక్తి- 2025 రిలీజ్ చేస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
ALSO READ: PNB Recruitment: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాలు.. జీతమైతే అక్షరాల రూ.1,05,280
ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా కమిషన్, మహిళా సహకార అభివృద్ధి సంస్థ, తెలంగాణ సాంస్కృతిక సారథి, సంగీత నాటక అకాడమీల ఛైర్‌పర్సన్‌లు శారద, అలేఖ్య, శోభారాణి, వెన్నెల స్త్రీశిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్ మెంట్ శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్, సంచాలకురాలు సృజన, సెర్ప్ సీఈఓ దివ్య, స్పెషల్ కమిషనర్ షఫీయుల్లాలు ఉన్నారు.