BigTV English

Nandamuri Mokshagna Teja: మోక్షజ్ఞ ఎంట్రీ షురూ.. త్వరలో ఫైనల్ కానున్న బాలయ్యవారసుడి మూవీ..

Nandamuri Mokshagna Teja: మోక్షజ్ఞ ఎంట్రీ షురూ.. త్వరలో ఫైనల్ కానున్న బాలయ్యవారసుడి మూవీ..

మూడు నెలల్లో సినిమా ప్రారంభం
నటుడుగానే కాకుండా రాజకీయ నాయకుడిగా ఎదిగిన బాలకృష్ణ ఇటీవల తన సినీ జీవితానికి 50ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ అర్థ శతాబ్దాన్ని సినీ సెలెబ్రెటీస్ గోల్డెన్ జూబ్లీ పేరిట బాలయ్యను సత్కరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ప్రస్తావన వస్తుందని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగానే బాలకృష్ణ తన 50 సినీ ప్రస్థానం గురించి ఒక ఇంటర్వూలో తన వారసుడి సినిమా గురించి చెప్పుకొచ్చారు. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మోక్షజ్ఞ మీద అంచనాలు చాలా ఉన్నాయి. ఫస్ట్ మూవీ విడుదల కాకుముందే స్టార్ అయిపోయాడు. మోక్షజ్ఞ ఎంట్రీకి అన్ని పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా ఫైనల్ అవుతుంది. మరో మూడు నెలల్లోనే సినిమా ప్రారంభం అవుతుంది. వాడి లాంచింగ్ గురించి ఎలాంటి టెన్షన్ లేదని తెలిపారు.

Also Read: పవన్ కల్యాణ్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ బన్నీ ట్వీట్


మోక్షజ్ఞ యాక్టింగ్
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్స్‌కి నటనలో శిక్షణ ఇచ్చిన సత్యానంద్ దగ్గర మోక్షజ్ఞ శిక్షణ తీసుకోవడం విశేషం. మోక్షజ్ఞ డైలాగ్ డెలివరీ అద్భుతంగా చేస్తాడట. అంతేకాకుండా కనుపాపలతో కూడా యాక్టింగ్ చేయగలడని టాక్ నడుస్తోంది. సత్యానంద్ దాదాపు 400 మందికి పైగా నటులకు శిక్షణ ఇచ్చాడు. అలా శిక్షణ తీసుకున్నవారిలో ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి సూపర్ స్టార్‌లు ఉండటం విశేషం. నిజానికి ‘ఆదిత్య 369’ మూవీ సీక్వెల్‌తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడని గతంలోనే బాలకృష్ణ చెప్పారు. కానీ, ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. మరి ఇప్పుడు మోక్షజ్ఞను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసే ఆ డైరెక్టర్ ఎవరనేది ప్రస్తుతానికి సప్సెన్స్‌గా ఉండిపోయింది. స్టార్‌డమ్‌తోనే ఎంట్రీ ఇవ్వబోతున్న మోక్షజ్ఞ ఎంతమేరా ప్రేక్షకులను మెప్పిస్తాడో చూడాలి.

బాలయ్య కొత్త సినిమా
బాలయ్య సినిమా కెరీర్ తన తండ్రి తారక రామారావు సినిమాలోనే చైల్డ్ ఆర్టిస్టుగా మొదలైంది. తర్వాత హీరోగా మారి ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ, తన వారసుడు మోక్షజ్ఞను మాత్రం హీరోగా ప్రేక్షకులకు పరిచయం విశేషం. ఇక బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఇటీవలె ఆ సినిమాకు సంబంధించిన భారీ షెడ్యూల్‌ను కూడా రాజస్థాన్‌లో పూర్తిచేసుకుంది. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి చిరంజీవి ‘విశ్వంభర’ మూవీకి పోటీగా విడుదల కాబోతుందని సమాచారం.

Related News

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

Big Stories

×