Sree Leela.. కన్నడ బ్యూటీ శ్రీ లీల (Sreeleela) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో మొదటి సినిమాతోనే తన స్ట్రాటజీ ఏంటో నిరూపించుకుంది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రీ లీల, ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు ఆ క్రేజ్ తో ఒకే ఏడాది తొమ్మిది సినిమాలకు సైన్ చేసిన హీరోయిన్ గా కూడా రికార్డు సృష్టించింది.
శ్రీ లీల పెళ్లి బాధ్యత తీసుకున్న బాలయ్య..
ఇకపోతే అన్ని సినిమాలలో నటించింది కానీ ఏ సినిమా కూడా ఈమెకు విజయాన్ని అందించలేదు. ముఖ్యంగా మహేష్ బాబు(Mahesh Babu) ‘గుంటూరు కారం’ సినిమా కూడా ఈమెకు పెద్దగా విజయాన్ని అందించలేదు. అలాగే బాలకృష్ణ(Balakrishna) నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమాలో బాలయ్య కి కూతురు పాత్రలో నటించింది. సినిమా విజయం అయింది కానీ ఆ సినిమా క్రెడిట్ మొత్తం బాలయ్య ఖాతాలో పడిపోయింది. ఇక క్రెడిట్ సంగతి పక్కన పెడితే ఈ సినిమా నుంచి శ్రీ లీలాకి బాలకృష్ణ బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయారు. ఆమెను తన కుటుంబంలో సభ్యురాలిగా చూసుకుంటూ వస్తున్నారు బాలయ్య. అంతే కాదు ఆమెపై తనకున్న ప్రేమను ఇప్పటికే ఎన్నోసార్లు బయటపెట్టారు కూడా.. అయితే ఇప్పుడు ఏకంగా శ్రీ లీల పెళ్లి బాధ్యతలు కూడా తీసుకుంటానని ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీ లీల కాబోయే భర్తను వెతికే పనిలో పడ్డ బాలయ్య..
తాజాగా శ్రీ లీల.. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 4’ ఎపిసోడ్6కి హీరో నవీన్ పోలిశెట్టి (Naveen polishetty)తో కలసి హాజరయ్యింది. ఈ క్రమంలోనే ఎన్నో విషయాలు పంచుకుంది. ఇకపోతే మహేష్ బాబు(Mahesh Babu)కళ్ళు అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన ఈమె, కళ్ళు మాత్రమే కాదు ఆ కటౌట్ అంటేనే ఇష్టమని తెలిపింది. అలాగే హీరో యష్(Yash), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)లాంటి హీరోలలో ఉన్న మంచి క్వాలిటీస్ కూడా బయటపెట్టింది. ఈ క్రమంలోనే మహేష్ బాబు లాంటి కటౌట్ తో పాటు యష్, బన్నీ లాంటి హీరోలలో ఉన్న మంచి క్వాలిటీస్ కలిగిన అబ్బాయిని నీకోసం నేను వెతికి పెడతాను అంటూ శ్రీ లీలాకు హామీ ఇచ్చారు బాలయ్య. మొత్తానికైతే శ్రీలీల కు పెళ్లి చేసే బాధ్యతను తీసుకున్నట్లు తెలుస్తోంది.
శ్రీ లీల స్టేట్మెంట్ కి బలం చేకూర్చిన బాలయ్య..
ఇకపోతే బాలయ్య, శ్రీ లీలపై తన ప్రేమను వ్యక్తం చేయడం ఇదేమి తొలిసారి కాదు. గతంలో కూడా పలు సందర్భాలలో శ్రీ లీలను మెచ్చుకున్నారు. అంతేకాదు ఒకానొక సమయంలో తన కొడుకు మోక్షజ్ఞ , శ్రీ లీల పై కూడా ఆసక్తికర కామెంట్లు చేశారు. ఇకపోతే తాను సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టానని, పెద్దలు కుదిర్చిన సంబంధమే చేసుకుంటానని రీసెంట్గా శ్రీ లీల ప్రకటించడంతో.. ఆమె స్టేట్మెంట్ కి ఇప్పుడు మరింత బలం చేకూరుస్తూ బాలయ్య ఈ ప్రకటన చేయడం జరిగింది. మొత్తానికి అయితే శ్రీ లీలా కాబోయే వరుడుని బాలయ్య స్వయంగా వెతికి తెచ్చి పెడతారేమో చూడాలి.