BigTV English
Advertisement

BB Telugu 8 Promo: గెస్ట్ లుగా మరో ఇద్దరు.. టేస్టీ తేజ అసహనం..!

BB Telugu 8 Promo: గెస్ట్ లుగా మరో ఇద్దరు.. టేస్టీ తేజ అసహనం..!

BB Telugu 8 Promo: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss). ప్రస్తుతం తెలుగులో ఎనిమిదవ సీజన్ చివరి దశకు చేరుకుంది. మరో మూడు వారాలు గడిస్తే, ఈ సీజన్ కూడా పూర్తవుతుంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ షో ఆ తర్వాత 8 మంది వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టారు.. ఇక ప్రస్తుతం 9 మంది మాత్రమే హౌస్ లో మిగిలారు. 12వ వారం యష్మీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అనిపించుకొని, టాప్ ఫైవ్ లో ఉంటుందని అందరూ భావించినా, తన ఆట, మాట తీరుతో ఆడియన్స్ హృదయాలను గెలవలేక.. ఎలిమినేట్ అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు వెళ్తూ వెళ్తూ బుద్ధి చూపించిందని నెటిజన్స్ కూడా కామెంట్లు చేశారు. స్నేహితులు, శత్రువులు ఎవరో చూపించాలని హోస్ట్ నాగార్జున (Nagarjuna) అడగగా.. తన స్నేహితులుగా కన్నడ బ్యాచ్ అయిన ప్రేరణ, నిఖిల్, పృథ్వీ లను చూపించింది. ఇక శత్రువులుగా తెలుగు బ్యాచ్ కంటెస్టెంట్స్ ని చూపించింది.


ఇకపోతే ప్రస్తుతం హౌస్ లో టికెట్ టు ఫినాలే కి సంబంధించిన ఛాలెంజ్ లలో అటు కంటెస్టెంట్స్ తో పాటు ఇటు ఆడియన్స్ లో కూడా ఉత్కంఠ రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే.గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న ఈ టాస్క్ లలో.. నిన్న జరిగిన ఎపిసోడ్లో విష్ణుప్రియకి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి, ఆమెను రేస్ నుంచి తప్పించారు. ఇదిలా ఉండగా తాజాగా ఈరోజు ప్రోమో విడుదల చేయగా.. ఈరోజు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ అయినా పునర్నవి, వితికా షేర్ హౌస్ లోకి అడుగుపెట్టారు. వీరిద్దరూ కంటెస్టెంట్స్ తో “స్పిన్ ది బాటిల్” అంటూ గేమ్ ఆడారు. ట్రూత్ ఆర్ డేర్ అంటూ సాగిన ఈ గేమ్ లో నబీల్ ట్రూత్ చెబుతానని అన్నారు. దీంతో వితికా నీకు ఇక్కడ ట్రూ లవ్ ఎవరూ అనిపించలేదా? అని ప్రశ్నించగా.. ఇక్కడ ఎవరూ లేరు అంటూ నబీల్ తెలిపాడు. దాంతో మిగతా కంటెస్టెంట్స్ అంటే బయట ఉన్నారా? అని కామెంట్ చేయగా.. అక్కడినుంచి సిగ్గు పడుతూ వెళ్లిపోయారు నబీల్.

ఆ తర్వాత టికెట్ టు ఫినాలే మూడవ, ఆఖరి కంటెండర్ గా నిలిచే ఒకరు ఎవరో తెలుసుకోవడానికి ఇద్దరు సభ్యులను ఎంచుకొని బిగ్ బాస్ కి చెప్పండి అని బిగ్ బాస్ చెప్పగా.. వితికా నిఖిల్ పేరు చెప్పగా.. పునర్నవి గౌతమ్ పేరు తెలిపింది. ఇక తర్వాత గౌతమ్ మాట్లాడుతూ.. నాకు ప్రేరణ, తర్వాత నీ ఇష్టం అంటూ నిఖిల్ తో తెలిపాడు. ఇకపోతే నిఖిల్, గౌతమ్, ప్రేరణ, పృథ్వీ, టేస్టీ తేజ మొత్తం ఐదు మంది ఫైనల్ రేస్ కి పోటీ పడుతూ ఉండగా.. అందులో.. వితిక, పునర్నవి నిఖిల్, గౌతమ్ లను సెలెక్ట్ చేశారు. వీరిద్దరూ ఒక్కొక్కరిని సెలెక్ట్ చేయాల్సి ఉండగా.. గౌతమ్ ప్రేరణ, నిఖిల్ పృథ్విలను సెలెక్ట్ చేశారు. ఇక నేనేమైపోవాలి అంటూ అసహనం వ్యక్తం చేశారు టేస్టీ తేజ. వస్తుంది కదా అవకాశం.. గెలిచినా ఓడిన ఆడాలి అని ఊపు వస్తుంది. కానీ ఇలా చేయడం వల్ల అసలుకే మోసం వస్తుంది. ఇక మీరు టీవీలో చూసేది వేరు ఇక్కడ లైవ్ లో చూశారు కదా జరుగుతున్న పరిస్థితి ఏంటో అంటూ టేస్టీ తేజ అసహనం వ్యక్తం చేశారు.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×