BigTV English

Farewell Party Company Funds: కంపెనీ నిధులతో పార్టీ చేసుకున్న ఉద్యోగి.. నిలదీసిన బాస్‌కు షాకింగ్ ఆన్సర్

Farewell Party Company Funds: కంపెనీ నిధులతో పార్టీ చేసుకున్న ఉద్యోగి.. నిలదీసిన బాస్‌కు షాకింగ్ ఆన్సర్

Farewell Party Company Funds| సోషల్ మీడియాలో ఇటీవల చాలామంది ఉద్యోగులు తన ఆఫీసుల్లో పని ఒత్తడి గురించి పోస్ట్ చేస్తున్నారు. ఉద్యోగంలో ఎదుర్కొనే సమస్యలు, ఆఫీసులో బాస్ పెట్టే టార్చర్, ఆరోగ్యం పై పని ఒత్తడి ప్రభావం వీటి గురించి అందరితో షేర్ చేసుకుంటున్నారు. కానీ వీటన్నింటికీ భిన్నంగా ఈ సారి ఒక కంపెనీ ఓనర్ తన ఉద్యోగి ఆఫీసులో ఎంత అల్లకల్లోలం సృష్టించిందో తెలిపారు. కంపెనీ డబ్బుతో భారీగా పార్టీలు చేసుకొని.. ఇదేంటని అడిగితే డొంకతిరుగుడు సమాధానాలు చెబుతోందని.. ఇక ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తే.. తనను అందరూ ఒక క్రూర మనస్తత్వం ఉన్నదానిలా చూస్తారని తెలిపింది. తాను చేసింది తప్పా? లేక ఒప్పా అని కంపెనీ ఓనర్ సోషల్ మీడియా యూజర్లను అడిగింది.


వివరాల్లోకి వెళితే.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ రెడ్డిట్ లో ఒక టెక్ కన్సల్టింగ్ కంపెనీ మహిళా ఓనర్ ఒక పోస్ట్ చేసింది. అందులో తన కంపెనీలో ఇటీవలే ఉద్యోగంలో చేరిన లిలీ అనే యువతి గురించి రాసింది. లిలీ గత కొన్ని నెలలుగా కంపెనీలో పనిచేస్తోందని తెలిపింది. ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలో లిలీ చాలా చురుకుగా పనిచేసేదని.. కానీ కొన్నిసార్లు ఆఫీసులో నియమాలను పాటించడం లేదని వెల్లడించింది.

ఈ క్రమంలో తాను (కంపెనీ ఓనర్) ఆఫీసు పనిమీద వారం రోజులపాటు విదేశాలకు వెళ్లినప్పుడు లిలీ ఆఫీసులో అల్లకల్లోలం స‌‌ృష్టించిందని రాసింది. వారం రోజుల క్రితం లిలీ ఆఫీసు నుంచి అధికారికంగా అందరూ ఉద్యోగులకు మెయిల్ చేసింది. “నేను ఉద్యోగం నుంచి రాజీనామా చేస్తున్నాను. అందుకే అందరికీ ఫేర్ వెల్ పార్టీ ఇస్తున్నాను. అందరూ తప్పకుండా పార్టీలో రావాలి” అని ఈమెయిల్ లో పేర్కొంది.


Also Read: 10 మంది పిల్లల తండ్రితో ప్రేమవివాహం.. ప్రాణహాని ఉందని కోర్టుకెళితే జడ్జి ఫైర్

ఆ తరువాత కంపెనీ క్రెడిట్ కార్డు లిలీకి అందుబాటులో ఉండడంతో ఆ క్రెడిట్ కార్డుతో క్యాటరింగ్, డెకరేషన్, పెద్ద కేకు ఆర్డర్ చేసింది. ఇది చాలదంటూ ఒక కంపెనీ బ్రేక్ రూమ్ లో అందరికీ మందు తాగడానికి బార్టెండర్ ఏర్పాటు చేసింది. అలా తన సహ ఉద్యోగులందరికీ లిలీ ఒక లావిష్ పార్టీ ఇచ్చి పడేసింది. దీనంతటికీ అయిన బిల్లు 2000 డాలర్లు. అయితే పార్టీ ఇచ్చిన తరువాత లిలీ రాజీనామా చేయలేదు. రోజూ లాగే ఆఫీసుకి వస్తూనే ఉంది.

ఈ క్రమంలో కంపెనీ ఓనర్ రెండు రోజుల క్రితం విదేశాల నుంచి తిరిగి వచ్చింది. ఆమెకు 2000 డాలర్ల (దాదాపు రూ.1,70,000) ఆఫీసు ఖర్చు గురించి తెలిసింది. ఆ బిల్లులన్నీ చూసి ఆరా తీయగా ఆఫీసులో లిలీ అందరికీ పార్టీ ఇచ్చిందని తెలిసి షాక్ కు గురైంది. వెంటనే లిలీని పిలిచి ఆఫీసులో పార్టీ ఏంటి? అది కూడా కంపెనీ డబ్బులతో నువ్వు పార్టీ ఇవ్వడం ఏంటి? అని అడిగింది. దానికి లిలీ తాను ఈ ఉద్యోగం వదిలి వెళ్లిపోయే ముందు అందరికీ పార్టీ ఇవ్వాలని అలా చేశానని చెప్పింది. కానీ లిలీ ఇంతవరకు రాజీనామా చేయలేదు. ఒక వేశ చేసినా కంపెనీ డబ్బులతో అందరికీ ఫేర్ వెల్ పార్టీ ఇవ్వడం ఏంటని బాస్ ప్రశ్నించగా.. ఇది ఒక సోషల్ ఎక్స్‌పరిమెంట్ అని సమాధానం చెప్పింది.

ఆఫీసులో సోషల్ ఎక్స్‌పరిమెంట్ ఏంటి? అని బాస్ ప్రశ్నించగా.. తాను ఒకవేళ రాజీనామా చేసి వెళ్లిపోతే.. ఎంత మంది తన ఫేర్ వెల్ పార్టీకి వస్తారో? చూడడానికే ఈ పార్టీ ఇచ్చానే తప్ప తనకు రాజీనామా చేయాలనే ఉద్దేశం లేదని లిలీ చెప్పింది. ఇది విని బాస్ కు పట్టరాని కోపం వచ్చింది. వెంటనే లిలీని ఉద్యోగం నుంచి తొలగించేసింది.

రెడ్డిట్ లో లిలీ చేసిన నిర్వాకాన్ని కంపెనీ ఓనర్ షేర్ చేసింది. తాను లిలీని ఉద్యోగం నుంచి తొలగించడంలో న్యాయ ముందా? లేక తాను ఏమైనా తప్పు చేశానా? అని ఆమె ప్రశ్నించింది.

ఆమె చేసిన పోస్ట్‌కు ఒక్కరోజులోనే 8000 మంది రెడ్డిట్ లో ఓట్ చేశారు. చాలా మంది కామెంట్లు కూడా చేశారు. ఒక రెడ్డిట్ యూజర్ కామెంట్ చేస్తూ.. “ఆఫీసులో నమ్మకం అనేది చాలా అవసరం. ఆమె నమ్మకద్రోహం చేసింది.” అని రాశాడు. మరొక యూజర్ అయితే.. “సోషల్ ఎక్స్‌పరిమెంట్ ఏంటి? దాని బొంద. అంతా నాన్ సెన్స్. కంపెనీ డబ్బులతో ఎంజాయ్ చేసింది. మరొక ఆఫీసులో అయితే ఆమెపై దొంగతనం, చీటింగ్ కేసు పెట్టేవారు. కేవలం ఉద్యోగం నుంచి తీసేయడం ఆమె అదృష్టం.” అని కామెంట్ చేశాడు.

ఇంకొక యూజర్ అయితే.. ” కంపెనీ డబ్బులతో లిలీ పార్టీ చేసుకోవడం అనవసరం. అలా చేయడం మోసం చేయడంతో సమానమే. ఆమె వ్యక్తిగతంగా పార్టీ ఇచ్చుకుంటే దానికి కంపెనీకి సంబంధం లేదు. కానీ అది కంపెనీ సొమ్ము. కంపెనీకి అయిన నష్టానికి ఆమెదే బాధ్యత” అని కామెంట్లో రాశాడు.

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×