BigTV English

Butcher Kills Live-in Partner: మనిషి చేయిని తీసుకువచ్చిన కుక్క.. మహిళను 40 ముక్కులుగా నరికివేసిన కసాయి

Butcher Kills Live-in Partner: మనిషి చేయిని తీసుకువచ్చిన కుక్క.. మహిళను 40 ముక్కులుగా నరికివేసిన కసాయి

Butcher Kills Live-in Partner| కొన్ని రోజుల క్రితం అడవికి సమీపంలో ఉన్న గ్రామంలో ఒక కుక్క తన నోట్లో మనిషి చేయిని పట్టుకొని వచ్చింది. దీంతో గ్రామస్తులు భయపడిపోయారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అడవిలోకి వెళ్లి ఆరా తీయగా.. కొన్ని మనిషి శరీర భాగాలు లభించాయి. కొంత దూరంలో ఒక బ్యాగు కూడా లభించింది. ఆ బ్యాగులో ఒక మహిళ ఆధార్ కార్డు, బట్టలు ఉన్నాయి. ఆ ఆధారాలతో తీగ లాగితే డొంక కదిలిందన్నట్లుగా ఒక కసాయి వాడే ఈ హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటన ఝార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది.


వివరాల్లోకి వెళఇతే.. నరేష్ భేంగ్రా అనే 25 ఏళ్ల యువకుడు ఝార్ఖండ్ రాష్ట్రం ఖుంటి జిల్లాలో ఒక చిన్న ఉద్యోగం చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. అయితే ఏడాది క్రితం అతనికి బిమల (24, పేరు మార్చబడినది) అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆమె కూడా అక్కడే ఒక చిన్న ఉద్యోగం చేసేది. దీంతో ఇద్దరూ తరుచూ కలుసుకునే వారు. అలా పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ తరువాత ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేశారు.

ఈ క్రమంలో నెల రోజుల క్రితం నరేష్ భేంగ్రా తన తల్లిదండ్రులను కలిసేందుకు బోగ్రా జిల్లాకు వెళ్లాడు. అక్కడ అతనికి వివాహం జరిగిపోయింది. ఒకవైపు బిమలతో సహజీవనం చేస్తూనే నరేష్ తల్లిదండ్రుల ఇష్టానుసారంగా పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజుల తరువాత నరేష్ తిరిగి ఖంటికి వచ్చాడు. అయితే అక్కడ విమల అతడిని వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసింది. నరేష్ తల్లిదండ్రుల వద్దకు తనను తీసుకెళ్లాలని చెప్పేది. మరో వైపు నరేష్ బిమలను నిర్లక్ష్యం చేస్తూ.. ఎక్కువ సమయం ఫోన్ లో తన భార్యతో మాట్లాడే వాడు. దీంతో బిమలకు అనుమానం వచ్చింది. ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.


Also Read: ముగ్గురు స్నేహితులను హత్య చేసిన తాంత్రికుడు.. నరమాంసం భక్షించి క్షుద్రపూజ!

నరేష్ ఇక బిమలతో గొడవ పడలేక ఆమెకు తన తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్తానని చెప్పాడు. అలా నవంబర్ 8, 2024న బిమలను తీసుకొని బొకారోలో తన తల్లిదండ్రులకు వద్దకు వెళుతున్నట్లు నాటకం ఆడాడు. అది నమ్మిన బిమల తన తల్లికి ఫోన్ చేసి.. ఈ విషయమంతా చెప్పింది. తాను ఇక నరేష్ ని త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు తల్లికి తెలిపింది. కానీ బిమలను.. నరేష్ మార్గమధ్యంలో మోసం చేశాడు. ముందుగా ఆమెను రైలులో తీసుకెళ్లి.. కొంతదూరం ప్రయాణించాక.. జోర్దాగ్ గ్రామం వద్ద రైల్వే స్టేషన్ లో దిగి అక్కడి నుంచ కొంత దూరం నడిచి వెళ్లాలన్నాడు.

జోర్దాగ్ గ్రామానికి సమీపంలో ఉన్న అడివిలోకి తీసుకెళ్లి.. బిమలపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత ఆమెను చున్నీతో ఉరి వేసి చంపేశాడు. నరేష్ తన బ్యాగులో నుంచి కసాయి వాళ్లు ఉపయోగించే కత్తులు తీసి ప్రశాంతంగా బిమల శరీరాన్ని 40-50 ముక్కలుగా నరికాడు. ఆమె శరీరాన్ని అడవిలో జంతువులు తినేస్తాయని భావించి.. అక్కడే ఆమె బ్యాగుని కూడా పారేశాడు.

అయితే నవంబర్ 23, 2024న ఒక కుక్క అడవిలోకి వెళ్లి అక్కడ పడి ఉన్న బిమల శరీర భాగాలలో చేయిని నోట్లో బెట్టుకొని జోర్దాగ్ గ్రామంలోకి వచ్చింది. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమచారం అందించారు. పోలీసులు అడవిలో లభించిన బ్యాగులో బిమల ఆధార్ కార్డుని చూసి ఆమె తల్లిని సంప్రదించారు. బిమల తల్లి వెంటనే అక్కడికి చేరుకొని ఆ శవం తన కూతురిదేనని గుర్తించింది. తన కూతురు నరేష్ భేంగ్రా అనే వ్యక్తితో సహజీవనం చేసేదని.. అతడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు నవంబర్ 8న ఫోన్ చేసిందని వివరాలు తెలిపింది. ఈ ఆధారాలతో పోలీసులు నరేష్ భేంగ్రాని అరెస్టు చేశారు.

నరేష్ రెండేళ్ల క్రితం వరకు తమిళనాడుతో ఒక చికెన్, మటన్ షాపులో కసాయి పనిచేశాడని. అందువల్ల అతనికి మాంసం ముక్కలుగా చేయడం తెలుసనని నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు బిమల శరీరాన్ని నరేష్ స్వయంగా ముక్కలుగా నరికేశాడని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం బిమల హత్య కేసులో నరేష్ భేంగ్రాని హంతుకుడిగా అనుమానిస్తూ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

Related News

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Big Stories

×