BigTV English

Bhagavanth Kesari Collection : బాక్సాఫీస్ షేక్.. వసూళ్లలో కొత్త రికార్డులు..

Bhagavanth Kesari Collection : బాక్సాఫీస్ షేక్.. వసూళ్లలో కొత్త రికార్డులు..
Bhagavanth Kesari Collection

Bhagavanth Kesari Collection : ప్రస్తుతం టాలీవుడ్ లో అందరు హీరోల కంటే కూడా వరుస విజయాలతో హిట్ మీద హిట్ కొడుతూ దూసుకుపోతున్న హీరో నందమూరి బాలకృష్ణ. అఖండ ఇచ్చిన అఖండమైన జోష్ తో.. వీర సింహారెడ్డి వేగంతో.. 


భగవంత్ కేసరి బాక్స్ ఆఫీస్ వద్ద బీభత్సం సృష్టిస్తున్నాడు. విడుదలకు ముందు నుంచే మంచి పాజిటివ్ బజ్ తో రంగంలోకి దిగిన ఈ చిత్రం రికార్డుల మీద రికార్డులు సృష్టించి వసూళ్ల వర్షం కురిపిస్తుంది. దసరా పండక్కి బరిలోకి దిగిన భగవంత్ కేసరి నాలుగు రోజులు పూర్తికాకముందే కోట్లల్లో వసూలు రాబట్టింది. ఇదే జోరు ఈ వీక్ అంతా కంటిన్యూ అయితే దసరా బరిలో విన్నర్ బాలయ్య అవుతాడు అనడంలో ఎటువంటి డౌటు లేదు.

ఒకపక్క విజయ్ లియో, మరోపక్క రవితేజ టైగర్ నాగేశ్వరరావు పోటికి దిగినా తగ్గేదే లేదంటూ కదం తొక్కుతున్నాడు బాలయ్య. ఎమోషనల్ కంటెంట్ తో, వినూత్నమైన కాన్సెప్ట్ తో.. తన వయసుకు తగిన పాత్రలో నటసింహం తన నట విశ్వరూపాన్ని చూపించింది. భగవంత్ కేసరి స్టోరీకి తగిన విధంగానే పాత్రలు ,సన్నివేశాలు, డైలాగులు అన్ని అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి .ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు.


ప్రస్తుతం సమాజంలో పురిటి బిడ్డ దగ్గర నుంచి ముసలి అవ్వ వరకు.. ఆడబిడ్డ ఆయన కారణానికి తెలిసో తెలియకో అనుభవిస్తున్నటువంటి భాద ను మంచి కాన్సెప్ట్ గా మలిచి ఈ మూవీలో చూపించారు. గుడ్ టచ్ ..బాడ్ టచ్.. మధ్య ఆడపిల్లలకు వ్యత్యాసాన్ని తెలియపరుస్తూ బాలయ్య చెప్పిన డైలాగ్స్ .. చెప్పాలి అన్నా,సినిమాలో పెట్టాలి అంటే కూడా ఎంతో ధైర్యం ఉండాలి. సెన్సిటివ్ టాపిక్ ని కూడా ఎంతో అమోఘంగా స్క్రీన్ పై ఆవిష్కరించడంలో డైరెక్టర్ అద్భుతమైన సక్సెస్ సాధించాడు. ముఖ్యంగా ఇందులో బాలకృష్ణ ,శ్రీ లీల ఫైట్ సీన్స్ గూస్ బంప్స్ క్రియేట్ చేసే విధంగా ఉన్నాయి.

ఈ సినిమా విడుదలకు ముందు నుంచే వసూళ్లు మొదలయ్యాయి.. ఒక్క ప్రీ రిలీజ్ బిజినెస్ లోనే 64.5 కోట్లు ఖాతాలో వేసుకున్న భగవంత్ కేసరిl.. ఇక నైజాంలో 14.50, సీడెడ్‌ 13 ,ఉత్తరాంధ్ర 8, ఉభయ గోదావరిలో 9, గుంటూరు 6, కృష్ణ 4, నెల్లూరు 2.6 కోట్ల వసూలు రాబట్టింది . ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా అంతా కలిపి రూ. 4.25 కోట్లు వసూలు కాగా ఓవర్సీస్ లో 6 కోట్లు వసూలు అయ్యాయి. అంటే వరల్డ్ వైడ్ ఇప్పటికే రూ. 67.35 కోట్లు బిజినెస్ జరిగింద. ఇక నాలుగో రోజు కూడా అన్ని ఏరియాల్లో ఈ చిత్రానికి అదిరిపోయే స్పందన వస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో 5.50 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేసి దూసుకుపోతున్న బాలయ్య చిత్రం ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్ క్లబ్ క్లబ్లో చేరిపోయింది. ఈ లెక్కలన్నీ చూస్తుంటే బాలయ్య ‘భగవంత్ కేసరి’ మూవీ తో బంపర్ హాట్రిక్ సక్సెస్ రికార్డు సాధించేసినట్లే అనిపిస్తుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×