BigTV English

Deepthi sunaina: ఆటోలో ఎంజాయ్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా

Deepthi sunaina: ఆటోలో ఎంజాయ్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా

Big Boss beauty Deepthi sunaina enjoy her journey in Auto: ఒకప్పుడు టాలెంట్ నిరూపించుకోవడానికి రంగస్థలం మాత్రమే ఉండేది. రంగస్థలంలో అనుభవం ఉన్నవారికే నటనావకాశాలు ఇచ్చేవారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మనలో టాలెంట్ ఉంటే చాలు ప్రదర్శించేందుకు వేదికలు చాలానే ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ 7 బ్యూటీగా అలరించిన దీప్తి సునైనా తనకు గుర్తింపు రావడానికి డబ్ స్మాష్ వీడియోలు చేసేది. ఆమె ఎక్స్ ప్రెషన్స్ దానికి తగ్గట్లు అందం తోడవడంతో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. మెల్లిగా షార్ట్ ఫిలింస్ కూడా చెయ్యడం ఆరంభించింది. ప్రస్తుతం రియాలిటీ షో లలోనూ అవకవశాలను అందిపుచ్చుకుంటోంది. ఈ మధ్య వచ్చిన ఓ డ్యాన్స్ షో లో యావర్ తో కలిసి చేసిన డ్యాన్సులకు మంచి రెస్పాన్స్ అందుకుంది.


బిగ్ బాస్ లో ఇమడలేక..

బిగ్ బాస్ 7 హౌస్ లో ముందునుంచి ఆమెను సెలక్ట్ చెయ్యలేదు. బిగ్ బాస్ 2.0 అంటూ సగం వారాలు పూర్తయ్యాక అనూహ్యంగా బిగ్ బాస్ నిర్వాహకులు దీప్తి సొనైనా ను తీసుకొచ్చారు. అయితే ఉన్న కొద్ది పాటి వారాలను సద్వినియోగం చేసుకోలేకపోయింది సొనైనా. కేవలం కంటెస్టెంట్ శివాజీతో తప్ప మిగిలినవారితో అంతగా మూవ్ అవ్వలేదు. దీనితో దీప్తికి ఓటింగ్ శాతం కూడా బాగా తక్కువ రావడంతో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వాల్సివచ్చింది. తర్వాత కూడా ఈ బ్యూటీకి అవకాశాలు బాగానే రావడంతో ఆర్థికంగా నిలదొక్కుకుంది. రీసెంట్ గా రూ.40 లక్షలు ఖరీదు చేసే టయోటా హైలక్స్ కారును కొనుగోలు చేసింది.అంతేగాక ఆ కారు గొప్పతనాన్ని కూడా తెలిపింది. చూడటానికి కారు లాగానే ఉన్నా..ఇది టిప్పర్ లాగా ఉంటుందని..దూర ప్రాంతాలకు చేరవేసే ట్రావెలింగ్ టిప్పర్ లా ఉంటుందని తనకు బాగా నచ్చిందని చెప్పింది. అయితే అదంతా కంపెనీ డిస్కౌంట్ కోసమే చెప్పివుంటుందని కొందరు కామెంట్స్ కూడా చేశారు.


షణ్ముఖ్ కు బ్రేకప్

అప్పట్లో యూట్యూబర్ షణ్ముఖ్ తో ప్రేమ వ్యవహారాన్ని నడిపింది సునైనా. అయితే షణ్ముఖ్ బిగ్ బాస్ సిరి హన్మంతుకు క్లోజ్ అయ్యాడు. ఇవన్నీ చూసి తట్టుకోలేక షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పేసింది సునైనా. అయితే రీసెంట్ గా తన ఇన్ స్టా గ్రామ్ లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. సిటీలో ఆటోలో వెళుతూ ఎంజాయ్ చేసే ఫొటోలు అవి. వైట్ స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని చీరకట్టులో దేవకన్యలా ఉన్న సునైనా యూత్ ను టెంప్ట్ చేసేలా ఎద అందాలు కనిపించీ కనిపించకుండా కవ్వించేలా కనిపించింది సునైనా. ఆమె ఫొటోలను చూసి యూత్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కొందరైతే సునైనాను పొగుడుతుంటే మరికొందరు మాత్రం ఈ మద్యే రూ.40 లక్షలు పెట్టి టయోటా కారును కొనుక్కుని మళ్లీ ఆటోలో ప్రయాణించే కోరికలేమిటి తల్లీ? పబ్లిసిటీ కోసం నీకు ఆటోనే దొరికిందా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం దీప్తి సునైనా ఆటో ఫొటోలు, వీడియో వైరల్ గా మారాయి సోషల్ మీడియాలో .

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×