Big TV Kissik Talks:గంగవ్వ (Gangavva).. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈమెను చూడాల్సిన పనిలేదు.. పేరు చెబితేనే చాలు ఆడియన్ ముఖంలో నవ్వు విరబూస్తుంది. అంతలా తన అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తోంది గంగవ్వ. ఒకవైపు పలు కామెడీ షో లలో పాల్గొంటూనే.. మరొకవైపు బిగ్ బాస్, సిక్స్త్ సెన్స్ వంటి షోలలో కూడా పాల్గొని సందడి చేసింది. అంతేకాదు దాదాపు పదికి పైగా చిత్రాలలో నటించి, తన నటనతో మెప్పించింది. ఇలా నిత్యం అందరినీ ఆకట్టుకుంటూ.. అందరిని నవ్వించే గంగవ్వ జీవితంలో కూడా విషాదం ఉందని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి గంగవ్వ మోస్తున్న ఆ విషాద గాధలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఇద్దరు పిల్లల్ని కోల్పోయిన గంగవ్వ..
ప్రముఖ బిగ్ టీవీ ఛానల్ ఎక్స్క్లూజివ్ గా నిర్వహిస్తున్న ‘కిస్సిక్ టాక్స్’ అనే కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చింది గంగవ్వ. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ వర్ష (Jabardast Varsha) హోస్టుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని నిర్వాహకులు విడుదల చేయగా.. అందులో గంగవ్వ మోయలేని బరువును మోస్తున్నట్టు చెప్పి అభిమానులకి కన్నీళ్లు తెప్పించింది. ఇంటర్వ్యూలో భాగంగా మీకు ఎంతమంది పిల్లలు అని ప్రశ్నించగా.. ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు.. చిన్న వయసులోనే ఒక అబ్బాయి, అమ్మాయి చనిపోయారు. అమ్మాయికి తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడు ఫిట్స్ వచ్చి ఆమె చనిపోయింది.
చిన్నప్పటి నుంచే అనాధగా బ్రతికాను – గంగవ్వ
ఇక నా జీవితం అంటారా.. నేను చిన్నతనంలోనే తల్లిదండ్రులని కోల్పోయాను. ఇక ఒంటరిగానే ఆ నరక జీవితాన్ని కొనసాగించాను. ఇక పెళ్లయ్యాక మళ్ళీ పిల్లల విషయంలో ఇద్దరిని కోల్పోయాను. అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అటు గంగవ్వ ఏడవడం చూసి ఆడియన్స్ కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. అందర్నీ నవ్వించే గంగవ్వ జీవితంలో ఇంత విషాదం వుందా?అంటూ నిట్టూరుస్తున్నారు.
ఒకవేళ దేవుడు కరుణించి చనిపోయిన మీ అమ్మానాన్నను మళ్ళీ పంపిస్తే.. మీరు ఏం మాట్లాడుతారు? అని ప్రశ్నించగా.. “అమ్మా! నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయావు? అని అడుగుతాను” అంటూ అందరినీ ఏడిపించింది గంగవ్వ. ఇక తన చేతితో ముద్ద కలిపి వారికి ప్రేమగా తినిపిస్తాను అని చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం గంగవ్వ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా కష్టాల కడలిని దాటి నేడు ఈ స్థాయికి వచ్చింది అంటే ఆమె ఎంత కష్టపడి ఉందో అర్థం చేసుకోవచ్చంటూ పలువురు ఆమెకు సపోర్టుగా నిలుస్తున్నారు.
అయినవాళ్లే గోతులు తవ్వుతున్నారు -గంగవ్వ
ఇకపోతే గంగవ్వ స్థాయిని చూసి తన తోటి వారు ఈర్ష పడుతున్నారని, తనతో తన ముందు మంచిగా ఉండి, తన వెనుక గోతులు తవ్వుతున్నారు అంటూ చెప్పుకొచ్చింది దీంతోపాటు మళ్లీ బిగ్ బాస్ ఎంట్రీ పై కూడా క్లారిటీ ఇచ్చింది. ఇలా కొన్ని విషయాలపై స్పందించింది. మొత్తానికి అయితే ఈ బిగ్ టివి కిస్సిక్స్ టాక్స్ ప్రోమో ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. దీంతో అటు ఎపిసోడ్ కోసం కూడా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
ALSO READ:Big TV Kissik Talks: త్వరలో గంగవ్వ రాజకీయ ఎంట్రీ.. సీఎం గారి మాటేంటి?