BigTV English

Ayesha Khan : షూటింగ్ లో స్పృహ కోల్పోయిన ‘ఓం భీమ్ బుష్’ బ్యూటీ … ఆమె హెల్త్ ఇప్పుడెలా ఉందంటే..?

Ayesha Khan : షూటింగ్ లో స్పృహ కోల్పోయిన ‘ఓం భీమ్ బుష్’ బ్యూటీ … ఆమె హెల్త్ ఇప్పుడెలా ఉందంటే..?

Ayesha Khan : ‘బిగ్ బాస్ సీజన్ 17’ (Bigg Boss 17) తో పాపులర్ అయిన కంటెస్టెంట్ ఆయేషా ఖాన్ (Ayesha Khan) తాజాగా షూటింగ్ లో కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుండగా, దాన్ని చూసిన అభిమానులు ఆయేషా స్పృహ తప్పి పడిపోవడం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ బ్యూటీకి ఏం జరిగింది? ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


స్పృహ తప్పి పడిపోయిన బిగ్ బాస్ బ్యూటీ

తాజాగా ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం ఆయేషా ‘కిస్ కిస్కో ప్యార్ కరూన్ 2’ అనే సినిమా షూటింగ్ మధ్యలో అకస్మాత్తుగా ఆయేషా స్పృహ కోల్పోయింది. వెంటనే చిత్ర బృందం ఇది గమనించి ఆమెకు సహాయం చేశారు. ఆయేషాను తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి, ట్రీట్మెంట్ అందించారు. ఈ సంఘటన భోపాల్ లోని డిబి మాల్ లో జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అక్కడే జరుగుతుంది. అయితే ఈ సినిమాలో ఆయేషా పాత్ర గురించి ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. కపిల్ శర్మతో కలిసి ఆమె ఈ సినిమాలో నటించబోతున్నట్టు సమాచారం. ఇక ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుట పడిందని తెలుస్తోంది.


షూటింగ్ దశలో ‘కిస్ కిస్కో ప్యార్ కరూన్ 2’

మోస్ట్ అవెయిటింగ్ సీక్వెల్ ‘కిస్ కిస్కో ప్యార్ కరూన్ 2’ షూటింగ్ దశలో ఉంది. కపిల్ శర్మ ఈ సినిమాలో తన సిగ్నేచర్ కామెడీతో గందరగోళాన్ని క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు. 2025 జనవరిలో ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టారు. కపిల్ శర్మ హీరోగా 2015లో ఈ మూవీ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యింది. అబ్బాస్ మస్తాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అందులో సిమ్రాన్ కౌర్ ముండి, మంజరీ ఫడ్నిస్, సుప్రియా పాఠక్, మనోజ్ జోషి, శరత్ సక్సేనా, అర్బాజ్ ఖాన్, వరుణ్ శర్మ, ఎల్లీ అవ్రామ్, జామీ లివర్, సాయి లోకూర్ తదితరులు నటించారు.

‘ఓం భీమ్ బుష్’ లో ఆయేషా 

ఇక సీక్వెల్ ‘కిస్ కిస్కో ప్యార్ కరూన్ 2’కి అనుకల్స్ గోస్వామి దర్శకత్వం వహిస్తుండగా, వీనస్ వరల్డ్ వైడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్, అబ్బాస్ ముస్తాన్ ఫిలిం ప్రొడక్షన్ పై రతన్ జైన్, గణేష్ జైన్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆయేషా ప్రస్తుతం ‘దిల్ కో రఫు కర్ లీ’ అనే యూట్యూబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ షోలో కరణ్ వి గ్రోవర్, కీర్తి చౌదరి, నిర్మల్ రిషి, చిరాగ్ ఖత్రి వంటి టాలెంట్ ఆర్టిస్టులు నటిస్తున్నారు. డ్రీమియాతా డ్రామా బ్యానర్ పై రవి దూబే, సర్గుల్ మెహతా దీన్ని నిర్మిస్తున్నారు. ఇక తాజాగా ఆమె ‘కిస్ కిస్కో ప్యార్ కరూన్ 2’ షూటింగ్ లో కళ్ళు తిరిగి పడిపోవడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. తెలుగులో ఆయేషా ‘ఓం భీమ్ బుష్’, ‘ముఖచిత్రం’ వంటి సినిమాలలో నటించింది.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Bhopali Points (@bhopali_points)

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×