Uttar Pradesh Crime: ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పొరుగింటి వారిపై ఉన్న కోపాన్ని కూతురిపై ప్రదర్శించాడు కసాయి తండ్రి. అభం శుభం తెలియని చిన్నారిని హత్య చేశాడు. ఆపై శరీరాన్ని నాలుగు ముక్కలుగా చేసి పారేశాడు. సంచలనం రేపిన ఈ ఘటన సీతాపూర్‌లో జరిగింది. చివరకు పోలీసులను బురిడీ కొట్టించేందుకు డ్రామా క్రియేట్ చేశాడు. ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయాడు.. కటకటాల పాలయ్యారు.
కనిపిస్తున్న వ్యక్తి పేరు మోహిత్ మిశ్రా. వయస్సు 40 ఏళ్లు. ఈయనకు ఐదేళ్లు కూతురు సైతం ఉంది. గత నెల 25న ఐదేళ్ల బాలిక తప్పిపోయినట్టు సీతాపూర్ పరిధిలోని పోలీసులకు ఫిర్యాదు చేశాడు కన్న తండ్రి. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి చిన్నారి కోసం నాలుగు టీమ్‌లు గాలింపు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో ఓ రోజున చిన్నారి చేయి ఆయా బృందానికి లభించింది. ఆ మరుసటి రోజు మిగతా శరీర భాగాలు కనిపించాయి. అయితే బాలికను ఎవరో దారుణంగా హత్య చేశారని ఓ అంచనాకు వచ్చేశారు.
చిన్నారి మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు అసలు విచారణ మొదలుపెట్టారు. తొలుత బాలిక బంధువులు, తల్లిదండ్రులు, ఇరుగు పొరుగు వారికి ప్రశ్నించడం మొదలుపెట్టారు. కన్నతండ్రి కంగారు పడ్డాడు. ఈ నేపథ్యంలో తన మొబైల్ ఫోన్ ను భార్యకు అప్పగించి పరారయ్యాడు. రెండురోజుల కిందట ఇంటికి తిరిగొచ్చాడు.
కూతుర్ని ఎందుకు చంపాల్సి వచ్చింది?
అప్పటికే అతడిపై పోలీసులు ఓ కన్నేశారు. చివరకు అతడ్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టారు. కన్న కూతురిని తానే చంపానని నిజాన్ని అంగీకరించాడు. మోహిత్- ఎదురింట్లో ఉండే రాము కుటుంబాలు చాలా కాలం స్నేహంగా ఉండేవారు. ఏం జరిగిందో తెలీదుగానీ వారి మధ్య విభేదాలు తలెత్తాయి.
ALSO READ: పెళ్లికి పెద్దలు నో అన్నారు
ఇరుకుటుంబాలు ఎడముఖం.. పెడముఖం అన్నట్లు వ్యవహరించాయి. ఇవేమీ తెలియని చిన్నారి ఆట ఆడుకునేందుకు ఓ రోజు రాము ఇంటికి వెళ్లి వస్తోంది. రాము ఇంటి నుంచి తన కూతురు రావడాన్ని గమనించాడు కన్నతండ్రి. వాళ్లింటికి వెళ్లొద్దని బాలికను హెచ్చరించాడు. అయినా వినకపోవడంతో తీవ్ర ఆగ్రహావేశానికి గురయ్యాడు.
వెంటనే చిన్నారిని తన వెంట నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఊరిరాడ కుండా చేసి చంపి చంపేశాడు. శరీరాన్ని నాలుగు ముక్కలు చేసి సమీపంలోని పంట పొలాల్లోకి విసిరేశాడు. ఆ తర్వాత తన కూతురు కనిపించలేదంటూ కొత్త నాటకానికి తెరతీశాడు. చివరకు అడ్డంగా బుక్కయ్యాడు.