BigTV English

Bigboss 8: బిగ్‌బాస్‌ 8 సీజన్‌కి ఇండియన్ క్రికెటర్‌ ఎంట్రీ ఇవ్వనున్నాడా..?

Bigboss 8: బిగ్‌బాస్‌ 8 సీజన్‌కి ఇండియన్ క్రికెటర్‌ ఎంట్రీ ఇవ్వనున్నాడా..?

Bigg Boss Season 8 That Team India Cricketer Entry: టీవీ ఛానల్‌లో టెలీకాస్ట్‌ అయ్యే రియాల్టీ షో బిగ్‌బాస్.ఈ పేరు వింటే చాలు తెలుగు రాష్ట్రాల ఆడియెన్స్‌ ఎప్పుడెప్పుడా అంటూ వెయిట్ చేస్తుంటారు.అంతేకాదు ప్రతి బిగ్‌బాస్ సీజన్‌ని ఎంతో ఆదరించారు.ఎందుకంటే పిల్లల నుండి పెద్ధల వరకు ఫ్యామిలీని అంతా ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పటివరకు 7 సీజన్లు విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న ఈ సీజన్లు అదే ఊపుతో 8వ సీజన్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. మరి త్వరలో స్టార్ట్ అవనున్న ఈ సీజన్‌కి కంటెస్టెంట్‌లు ఎవరనే దానిపై ఆడియెన్స్‌లో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.


వాస్తవానికి ఏంటంటే…సీజన్‌కి మంచి కిక్ రావాలంటే కంటెస్టెంట్‌ సెలక్షన్ చాలా ఇంపర్టెంట్‌ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ షోలో అన్నిరకాల ఎమోషన్స్ పండితేనే ఆడియెన్స్ లైక్ చేస్తారు. లేదంటే కూరలో కరివేపాకు తీసినట్టు తీసేస్తారు.కాబట్టి ఆడియెన్స్ టేస్ట్‌కి తగ్గట్టుగా నిర్వాహకులు జాగ్రత్త పడుతున్నారు.ఇక గతంలోలాగా కంటెస్టెంట్ పేర్లను బయటపెట్టకుండా ఉండేందుకు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటుంది బిగ్‌బాస్ టీమ్‌.అయితే ఎన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నా సరే కొందరు ఆకతాయిలు కావాలనే కొందరి పేర్లను రివీల్ చేస్తూ ఉంటారు. అలా ఇప్పుడు కొంతమంది పేర్లు లీక్ అవడంతో నెట్టింట వారి పేర్లు తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read: ఇండియన్‌ 2 మూవీపై ట్విట్టర్‌ రివ్యూలు..


ఈ క్రమంలోనే తాజాగా ఓ క్రికెటర్ పేరు తెరమీదకు వచ్చింది. ఇంతకీ ఆయన ఎవరో కాదు భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడని బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ సీజన్ 8కి తీసుకొచ్చేందుకు టీమ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. క్రికెట్‌కు స్వస్తి పలికిన అంబటి, ఏపీలో వైసీపీ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చాడు.చేరిన పది దినాలకే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పాడు. ఆ తరువాత జనసేనలో తాజా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సమక్షంలో చేరాడు. గత ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేశాడు.అయితే ఇదిలా ఉంటే.. రాయుడు ఆటలోనే కాదు, బయట సైతం అదే దూకుడిని ప్రదర్శిస్తాడు. పలుసార్లు ప్లేయర్లతో పాటు, అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. అంతేకాదు మేనేజ్‌మెంట్‌పై సైతం తన ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు మనోడు.

దీంతో అంబటి అంటేనే అక్కడొక సెన్సేషనల్‌ క్రియేట్ అవుతుందని భావించిన బిగ్‌బాస్ నిర్వాహకులు తనని బిగ్‌బాస్‌లోకి తీసుకొచ్చేందుకు చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు రాయుడు మన తెలుగోడే కావడం, టీమిండియా టీమ్‌లో ఆడిన వ్యక్తి. అంతేకాదు ఈ సీజన్ బిగ్‌బాస్ షోలో ఉంటే ఈ షోకి యూనివర్సల్‌లో మంచి క్రేజ్ నెలకొంటుందని అందరూ భావిస్తున్నారు. అందుకే తనకిచ్చే రెమ్యూనరేషన్ ఎంతైనా సరే ఇచ్చేందుకు బిగ్‌బాస్ టీమ్‌ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు అంబటిని బిగ్‌బాస్‌కి తీసుకొచ్చేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ షోకి పోతే తన ఇమేజ్ డ్యామేజ్ అవుతందనుకుంటున్నాడా.మరీ బిగ్‌బాస్ షోకి అంబటి రాయుడు వస్తాడా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

Tags

Related News

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Kissik Talks Promo : మహేష్ విట్టా లవ్ స్టోరిలో ఇన్ని ట్విస్టులా..ఆ ఒక్క కోరిక తీరలేదు..

Ritu Chaudhary : చెప్పు రీతు నువ్వు నన్ను మోసం చేయలేదా? రీతుకి కళ్యాణ్ తో బంధం తెగిపోయిందా?

Big Stories

×