Sree Vishnu: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా సింగల్. కామెడీ లవ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఏప్రిల్ 28న సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో శ్రీ విష్ణు శివయ్య అంటూ ఒక డైలాగును చెప్పడం.. ట్రైలర్ లాస్ట్ లో మంచు అనే పదాన్ని ఉపయోగించడంతో.. మంచు విష్ణు సీరియస్ అయ్యారని, కన్నప్ప మూవీ టీం హర్ట్ అయినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై హీరో శ్రీ విష్ణు స్పందిస్తూ వీడియోని రిలీజ్ చేశారు.
వాళ్ళకి సారీ ..హీరో వీడియో ..
శ్రీవిష్ణు మాట్లాడుతూ..’ మా సింగిల్ ట్రైలర్ ఇటీవల రిలీజ్ చేసాము. మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే టైంలో కన్నప్ప టీం మేము వాడి డైలాగ్స్ హర్ట్ అయ్యారని తెలిసింది. తెలిసిన వెంటనే ఈ వీడియోని చేస్తున్నాము. అది మేము ఎవరిని ఉద్దేశించినవి కావు. తప్పుగా అలా అర్థమైంది. మేము ఇమీడియట్ గా స్పందించి.. ఆ డైలాగ్స్ అన్ని ట్రైలర్ లో నుంచి సినిమాలో నుంచి తీసేస్తున్నాము. ఎవరినైనా హర్ట్ చేయాలనే ఉద్దేశం మాకు లేదు. మేమంతా ఒక ఫ్యామిలీ. ఈ సినిమాలో రిఫరెన్సులు, మీమ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఆ ప్రాసెస్ లోనే చిరంజీవి, బాలకృష్ణ, అల్లు అరవింద్ డైలాగ్స్ మూవీలో వాడడం జరిగింది. ఒక పాజిటివ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఇవన్నీ చేశాము కానీ, ఎవరిని ఉద్దేశించి ఇబ్బందిపెట్టాలని చేయలేదు. అలా ఇబ్బంది కలిగిస్తే అందరికీ సారీ. ఇలాంటివి ఎక్కువగా రిపీట్ కాకుండా చూసుకుంటాము’ సారీ అని తెలిపారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విష్ణు టాలీవుడ్ పెద్దలకు ఈ విషయం ఫిర్యాదు చేసినట్లు సమాచారం. శ్రీవిష్ణు కి, సింగిల్ మూవీ టీంకి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఏది ఏమైందో బయటకు తెలియదు కానీ, మొత్తానికి శ్రీ విష్ణు మాత్రం బయటకు వచ్చి ఓ వీడియోని రిలీజ్ చేశారు. మంచు విష్ణు, కన్నప్ప మూవీ టీం హెచ్చరించడంతో శ్రీ విష్ణు ఇలా వీడియో చేశారంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు సినిమాని సినిమాలా చూడాలి. అంతేకానీ ప్రతిదీ సీరియస్ గా తీసుకోకూడదు అంటూ కామెంట్ చేస్తున్నారు.
శ్రీవిష్ణు సినిమాలు ..
ఇక శ్రీవిష్ణు సినిమాల విషయానికి వస్తే.. నా ఇష్టం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అప్పట్లో ఒకడు ఉండేవాడు, ఉన్నది ఒకటే జిందగీ, మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, గాలి సంపత్, రాజరాజ చోర, భళా తందనాన, అల్లూరి, వంటి సినిమాలలో నటించారు. గత సంవత్సరం స్వాగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకువచ్చారు. ఆ సినిమా ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేదు. సింగిల్ మూవీ కి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తమిళ సినిమా లవ్ టుడే తో పాపులారిటీ సంపాదించుకున్న ఇవానా తెలుగులో ఈ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానుంది.
Anshu Reddy: స్వచ్ఛమైన ప్రేమ కావాలంటున్న సీరియల్ నటి.. ఈ కాలంలో అదెక్కడమ్మా..?