BigTV English

MLA SON ATTACK PRIEST: అర్ధరాత్రి హంగామా.. గుడి తలుపులు తీయలేదని పూజారిని కొట్టిన ఎమ్మెల్యే కొడుకు..

MLA SON ATTACK PRIEST: అర్ధరాత్రి హంగామా.. గుడి తలుపులు తీయలేదని పూజారిని కొట్టిన ఎమ్మెల్యే కొడుకు..

MLA SON ATTACK PRIEST| ఒక పెద్ద దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి అర్ధరాత్రి ఒక ఎమ్మెల్యే గారి కుమారుడు నాలుగు కార్ల కాన్వాయ్ తో వెళ్లాడు. అయితే ఆ సమయంలో సాధారణంగా గుడి తలుపులు లాక్ చేసి ఉన్నాయి. వాటిని తెరవాలని పూజారిని చెప్పగా.. అలా చేయడం నిబంధనలకు విరుద్ధం అని పూజారి నిరాకరించాడు. దీంతో సదరు ఎమ్మెల్యే కుమారుడి అనుచరులు పూజారిని అతడి కొడుకుని చితకబాదారు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.


వివరాల్లోకి వెళ్లితే.. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని ఇందోర్ నగరంలో వారం రోజుల క్రితం అర్ధరాత్రి వేళ చాముండా దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాలని స్థానిక బిజేపీ ఎమ్మెల్యే గోలు శుక్లా కుమారుడు రుద్రాక్ష్ శుక్లా భావించాడు. అందుకోసం నాలుగు ఎస్ యువి కార్ల కాన్వాయ్ లో 20 మంది అనుచరులతో కలిసి చాముండా దేవి ఆలయానికి వెళ్లాడు. దేవాలయం వద్దకు ఎమ్మెల్యే గారి కుమారుడు వెళ్లే సరికి రాత్రి 12.45 గంటల సమయం అయింది. అయితే దేవాలయం పరిసరాల్లో నివసించే ఉప్దేశ్ అనే పూజారిని అతని ఇంటి నుంచి తీసుకొచ్చారు. దేవాలయం తెరిచి ప్రత్యేక పూజలు చేయాలని పూజారికి చెప్పారు.

కానీ పూజారి ఉప్దేశ్ అందుకు అంగీకరించలేదు. రాత్రి ఆ సమయంలో గుడి తులపులు తీయకూడదని.. అది నిబంధనలకు వ్యతిరేకమని చెప్పాడు. అయినా పూజారి మాటలను ఎమ్మెల్యే కొడుకు రుద్రాక్ష్ నిర్లక్ష్యం చేశాడు. వెంటనే తాను చెప్పినట్లు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కానీ పూజారి మాత్రం ససేమిరా అంటూ అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఎమ్మెల్యే కుమారుడి అనుచరుడు జీతేంద్ర రెచ్చిపోయాడు. వెంటనే పూజారిపై దాడి చేశాడు. అడ్డు వచ్చిన పూజారి కొడుకుని కూడా మిగతా అనుచరులు కొట్టారు. ఈ ఘటనలో వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.


Also Read: డ్రైనేజీలో మహిళ శవం.. ముక్కు పుడక ఆధారంగా హంతకుడిని పట్టుకున్న పోలీసులు

మరుసటి రోజు పూజారి, అతని కొడుకు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఫిర్యాదులో ఎమ్మెల్యే కొడుకు రుద్రాక్ష పేరును ప్రస్తావించలేదు. కేవలం అతని అనుచరుడు జీతంద్రకు వ్యతిరేకంగా మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరుసటి రోజు పూజారి ఉప్దేశ్‌కు ఎమ్మెల్యే కుమారుడు నుంచి ఫోన్ వచ్చింది. అతను ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ చేసిన ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలని.. బెదరించాడు. కానీ పూజారి ఉప్దేశ్ మాత్రం అందుకు నిరాకరించాడు.

ఎమ్మెల్యే, అతని కొడుకు చేసిన దురాగతాన్ని మీడియా ముందు పెట్టాడు. పోలీసులు ఈ కేసులో విచారణ చేయగా.. సిసిటీవి వీడియోల్లో ఎమ్మెల్యే కుమారుడి కాన్వాయ్ అర్ధరాత్రి చేసిన హంగామా అంతా రికార్డ్ అయింది. అయితే పోలీసులు మాత్రం నిందితుడు జీతేంద్ర అని, అతనిపై మాత్రమే చర్యలు తీసుకోగలమని తెలిపారు. జీతేంద్ర ఇంతకుముందు కూడా క్రిమినల్ కేసుల్లో జైలుకెళ్లినట్లు వెల్లడించారు.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×