Srikanth Addala : శ్రీకాంత్ అడ్డాల ఈ పేరు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొత్త బంగారులోకం సినిమాతో యూత్ ని విపరీతంగా ఆకట్టుకున్నాడు. మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నారు. ఆ సినిమా చాలా ఎమోషనల్ గా ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. అంతేకాకుండా ఆ సినిమాలోని గోదావరి యాస కూడా చాలామందికి విపరీతంగా కనెక్ట్ అయింది. ఆ సినిమా తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలకు మరోసారి దారి తీసింది. అక్కడి నుంచే మల్టీస్టారర్ సినిమాలు రావడం మొదలయ్యాయి. ఆ తర్వాత వచ్చిన ముకుంద సినిమా విలేజ్ డ్రామాగా వచ్చింది. ఈ సినిమాతో వరుణ్ తేజ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు.
శ్రీకాంత్ అడ్డాల కామెడీ టైమింగ్
మామూలుగా శ్రీకాంత్ అడ్డాల చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఇక బిగ్ టీవీ నిర్వహిస్తున్న కిషిక్ టాక్ షోలో రీసెంట్ గా శ్రీకాంత్ అడ్డాల గెస్ట్ గా వచ్చారు. అయితే ఈ షోలో శ్రీకాంత్ అడ్డాల తనలో ఉన్న కామెడీ టైమింగ్ అంతా బయటికి తీశారు. యాంకర్ జబర్దస్త్ వర్ష ఈ షో ను హోస్ట్ చేస్తుంది.
ఈ షోలో వర్ష మీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను అంటూ మల్లెపూలు నివ్వగా…
-ఇదేదో తేడాగా ఉందే
సీతమ్మ వాకిట్లో సినిమా చేసినప్పుడు నన్ను అందరూ జూనియర్ సమంత అంటారు నేను మీకెందుకు కనిపించలేదు.?
– ఓరి దీని ఏసాలో
ఈ ఇయర్ ఖాళీగా ఉన్నాను మీకు డేట్లు కావాలంటే ఇస్తాను.
– మొన్న ఉగాదినాడు పంచాంగం చూపించుకున్నారా ఏంటి
పెద్దోడు చిన్నోడు పేర్లు ఏంటి సార్
– నాకే తెలియదు
ఇలా ఇంటర్వ్యూలో ప్రతి ప్రశ్నకు శ్రీకాంత్ అడ్డాల గోదావరి యాసలో తనదైన సమాధానాన్ని ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ప్రోమో విపరీతంగా ఆకట్టుకుంటుంది అని చెప్పాలి.
Also Read : Nani : నేను జీవితంలో చేసిన పెద్ద మిస్టేక్ ఇదే.. బిగ్ బాస్ పై నాని రియాక్షన్..!
అడ్డాల మొదటిసారి ఇలా
శ్రీకాంత్ అడ్డాల విషయానికొస్తే చాలా ఎమోషనల్ గా మాట్లాడుతుంటారు. ఇప్పటివరకు వచ్చిన ప్రతి ఇంటర్వ్యూలో శ్రీకాంత్ అడ్డాల సీరియస్ గానే కనిపిస్తూ ఉంటారు. కానీ శ్రీకాంత్ అడ్డాల సినిమాలలో కొన్ని పాత్రలు మాత్రం చాలా వెటకారంగా మాట్లాడుతూ నవ్వులు పండిస్తాయి. ఈ ప్రోమోలో శ్రీకాంత్ అడ్డాల మాటలు వింటుంటే ఆ పాత్రలన్నీ ఒకసారి ఇలా వచ్చి అలా వెళ్లాయి అనేటట్టు ఉంది. కేవలం గోదావరి ఎటకారాన్ని మాత్రమే చెప్పకుండా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్య లోతును కూడా ఈ ప్రోమోలో మనం గమనించవచ్చు. ఈ ఇంటర్వ్యూ కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు.