BigTV English

Nani : నేను జీవితంలో చేసిన పెద్ద మిస్టేక్ ఇదే.. బిగ్ బాస్ పై నాని రియాక్షన్..!

Nani : నేను జీవితంలో చేసిన పెద్ద మిస్టేక్ ఇదే.. బిగ్ బాస్ పై నాని రియాక్షన్..!

Nani : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ ఇమేజ్ ని అందుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. స్వయంకృషితో పైకొచ్చిన స్టార్స్ లలో మొదట మెగాస్టార్ పేరు వినిపిస్తే.. ఆ తర్వాత హీరో నాని పేరే వినిపిస్తుంది. ఈయన కూడా ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండానే హీరోగా సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. నాని హీరోగా మాత్రమే కాదు.. పలు కార్యక్రమాలకు హోస్టు గా కూడా వ్యవహరించారు. అందులో టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ ఒకటి. బిగ్ బాస్ గురించి తాజాగా నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..


తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్..

ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటగా ఈ షో హిందీలో ప్రారంభం అయ్యింది. ఇప్పటికే 18 సీజన్లు పూర్తి చేసుకుంది. తెలుగులో ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం తెలుగులో తొమ్మిదో సీజన్ కు రంగం సిద్ధం చేస్తున్నారు బిగ్ బాస్ యాజమాన్యం. బిగ్‌బాస్ తెలుగు 8 గురించి ప్రేక్షకులల్లో చర్చ మొదలైంది. ఈసారి కంటెస్టెంట్స్ ఎవరు? ఈసారి సీజన్ ఎప్పుడు ప్రారంభం కానుంది? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఎప్పుడు బిగ్‌బాస్ సీజన్ ప్రారంభమవుతున్నా ఖచ్చితంగా హోస్ట్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుందన్న విషయం తెలిసిందే.. ఇప్పుడు కూడా అదే చర్చ జరుగుతుంది.


Also Read : ‘పుష్పరాజ్’ కు బిగ్ షాక్.. అక్కడ డిజాస్టర్..?

బిగ్ బాస్ పై నాని షాకింగ్ రియాక్షన్.. 

తెలుగులో బిగ్ బాస్ షో ప్రారంభం అయిన మొదటి సీజన్ కు హోస్ట్ గా ఎన్టీఆర్ వ్యవహారించారు. రెండో సీజన్ కు నాని హోస్ట్ గా చేశారు. ఆ తర్వాత సీజన్ నుంచి ఇప్పటివరకు అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. తాజాగా సీజన్ 9 కు పోస్ట్ మారే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొందరు నాని హోస్ట్ గా ఉంటే బాగుంటుందని సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా నాని బిగ్ బాస్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. నాని ప్రస్తుతం హిట్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ ప్రమోషన్ లో నానిని బిగ్ బాస్ గురించి అడిగారు. బిగ్‌బాస్ చాప్టర్ ముగిసిపోయిందని, మళ్లీ జీవితంలో దాని జోలికి వెళ్లనని నాని స్పష్టం చేశారు. బయటి ప్రపంచం ఎలా ఉంటుందో బిగ్‌బాస్ షో తనకు చూపించి, మరింత కఠినంగా మార్చేసిందని తెలిపారు.. షో టైంలో ఒకలాగా షో ముగిసిన తర్వాత మరోలాగా ఉంటుంది అభిప్రాయాలు పూర్తిగా మారిపోతాయి లైఫ్ లో నేను ఇంకా బిగ్ బాస్ జోలికి వెళ్ళను అని నాని క్లారిటీ ఇచ్చారు.. ఇక నాని నటిస్తున్న హిట్ 3 మూవీ మే 1 న రిలీజ్ కాబోతుంది.. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల తో ఓ మూవీ చేస్తున్నాడు..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×