BigTV English

Malaria In Summer: వేసవిలో మలేరియా ప్రమాదం.. నివారణ కోసం ఆయుర్వేదిక్ చిట్కాలు

Malaria In Summer: వేసవిలో మలేరియా ప్రమాదం.. నివారణ కోసం ఆయుర్వేదిక్ చిట్కాలు

Malaria In Summer| ప్రతీ ఏడాది దోమల వల్ల లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వాతావరణంలో జరిగే మార్పులతో దోమల వల్ల వ్యాప్తి చెందే డెంగూ, మలేరియా లాంటి వ్యాధులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే మలేరియా వ్యాధి కేవలం వర్షాకలంలోనే కాదు ఎండా కాలంలోనూ వ్యాపిస్తుంది. మలేరియా అనాఫిలిస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. మలేరియా వస్తే రోగికి జ్వరం అధికంగా ఉంటుంది. ఇవి నాలుగు రకాలు ఉంటాయి. ఇందులో ప్లాస్మోడియం ఫాల్సిపరం, ప్లాస్మోడియం వైవాక్స్ జ్వరాలు మన దేశంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ రెండూ ప్రమాదకరమైనవే. మలేరియా జ్వరం రెండు మూడు రోజులు ఉంటుంది. సరైన సమయంలో చికిత్స చేస్తే, మలేరియా రోగిని 2 వారాల్లో పూర్తిగా నయం చేయవచ్చు. మలేరియాను నిర్లక్ష్యం చేస్తే.. ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. ఇంటి నివారణలతోనూ మలేరియా ప్రమాదాన్ని తగ్గంచవచ్చని నిపుణులు చెబుతున్నారు.


మలేరియా లక్షణాలు
మలేరియా కారణంగా అధిక జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పి, కండరాల నొప్పి, గ్రంథుల వాపు, మలంలో రక్తం, వికారం, కడుపు నొప్పి, గొంతు మంట, వాంతులు, అతిసారం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

వేసవిలో మలేరియా ప్రమాదం ఎక్కువ అయ్యేందుకు కారణాలు..
వేసవిలో వాతావరణం వేడిగా ఉండడం వల్ల దోమలు త్వరగా గుడ్లు పెడతాయి. ఆ తరువాత అవి తమ లైఫ్ సైకిల్ త్వరగా పూర్తి చేసుకొని వేగంగా తమ సంఖ్యను పెంచుకుంటాయి. వీటితో పాటు వేసవిలో అప్పడప్పుడు కురిసే వానల వల్ల నీరు ఒక చోట నిల్వ ఉంటే వాటిలో దోమలు నివసిస్తాయి.


మలేరియా నివారణకు ఈ జాగ్రత్తలు పాటించండి
ఇంట్లో దోమతెరలు ఉపయోగించండి, దోమల స్ప్రే లాంటివి మితంగా వాడండి, మస్కిటో ఆయిల్స్ లాంటివి కూడా మంచి ఫలితాన్నిస్తాయి. వీటితో పాటు ఇల్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోండి. నీరు నిల్వ కాకుండా జాగ్రత్తలు తీసుకోండి. లైట్ కలర్ దుస్తులు ధరించండి. వేసవిలో ధరించే దుస్తులు వదులుగా, పొడువుగా ఉండాలి. దీని వల్ల దోమలు శరీరం నుంచి దూరంగా ఉంటాయి. మీ నివసించే ప్రాంతంలో మలేరియా కేసులు ఎక్కువగా ఉంటే వైద్యుడిని సంప్రదించి మలేరియా నివారణ మందులు వాడండి.

మలేరియా నివారణకు ఆయుర్వేద, ఇంటి చిట్కాలు
మలేరియా సోకినా వేపాకు తాగునీటిలో మరగించి ఆ నీటిని తాగాలి. వేపాకులోని ఔషధ గుణాలు మలేరియా వైరస్ ని బలహీన పరుస్తాయి. అలాగే ఆయుర్వేదిక్ మూలిక అయిన గిలాయి కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నిత్యం గిలాయ్ జ్యూస్ తాగడం వల్ల జ్వరం తగ్గిపోతుంది. నీటిలో ధనియా గింజలు వేసి మరగింజి తాగితే అలసట, జ్వరం నుంచి ఉపశమనం లభిస్తుంది.

Also Read: చెరకు రసం ఆ విధంగా తాగడం హానికరం.. ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి

మలేరియా వల్ల రక్తంలో ప్లేటిలెట్స్ తగ్గిపోయే ప్రమాదం
మలేరియా సోకితే శరీరంలో ప్లేటిలెట్స్ తగ్గిపోతాయి. దీన్నే థ్రోంబోసైటోపీనియా అని అంటారు. ప్లేటిలెట్స్ శరీరంలో తీవ్ర రక్తస్రావం కాకుండా ఆపుతాయి. అలాంటిది ప్లేటిలెట్స్ తగ్గిపోతే శరీరంలోని బ్లడ్ వెజెల్స్ డ్యామేట్ అయిపోతాయి, చిన్న గాయమైనా ఇక రక్తస్రావం ఆగదు. అందుకే మలేరియా ప్రమాదకరం.. తీవ్రమైతే ప్రాణాంతకం. ఈ సమస్యకు కూడా ఆయుర్వేదిక్ పద్దతిలో ఇంట్లోనే చికిత్స్ చేసుకోవచ్చు.

గిలాయ్ మూలికలు, అలోవేరా జ్యూస్ కలిపి తాగితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ప్లేటిలెట్స్ సంఖ్య కూడా పెరుగుతుంది. మేకపాలు తాగడం ద్వారా కూడా ప్లేటిలెట్స్ పెరుగతాయి. అయితే మేక పాలు తాగేముందు వైద్యుడిని సంప్రదించాలి. అలాగే ప్రతిరోజు స్ప్రౌట్స్, ఖర్జూరాలు తింటే అందులోని మినరల్స్, ఫైబర్ శరీరంలోని బలహీనత పోగొడుతుంది.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×