Big Stories

Revanth Reddy fires on KCR: కేసీఆర్ సభకు ఎందుకు రాలేదు..? సీఎం రేవంత్ నిలదీత!

CM Revanth Reddy fires on KCR

CM Revanth Reddy fires on BRS President KCR: తెలంగాణ బడ్జెట్ సెషన్ వాడీవేడిగా జరుగుతోంది. కృష్ణా జలాలపై చర్చ జరిగింది. ఇలాంటి కీలక సమయంలో సభకు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రాకపోవడాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దక్షిణ తెలంగాణ కృష్ణా జలాలపై ఆధారపడి ఉందని సీఎం పేర్కొన్నారు. హరీశ్‌రావు సభలో పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.

- Advertisement -

ప్రధాన ప్రతిపక్ష నేత చర్చల్లో పాల్గొనకపోవడాన్ని తప్పుపట్టారు. కృష్ణా జలాలపై చర్చ జరుగుతుంటే ఒక వ్యక్తి ఫామ్‌ హౌస్‌కు పరిమితమయ్యారని కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తిని కరీంనగర్‌ నుంచి తరిమికొడితే.. మహబూబ్‌నగర్‌ వాసులు ఎంపీగా గెలిపించారన్నారు. ఇంత ముఖ్యమైన అంశంపై మాట్లాడేందుకు కేసీఆర్‌ ఎందుకు రాలేదని నిలదీశారు.

- Advertisement -

ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో కీలక ఘట్టంగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దక్షిణ తెలంగాణ ప్రాణ ప్రదమైన కృష్ణా జలాలపై అసెంబ్లీలో ప్రజా ప్రభుత్వం చర్చ పెట్టిందన్నారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రజా ప్రభుత్వం పెట్టిందన్నారు.

Read More: ఏపీకి కృష్ణాజలాలను ధారపోసింది కేసీఆరే.. మంత్రి ఉత్తమ్ ఫైర్

ప్రభుత్వం నిర్ణయాన్ని కేసీఆర్ స్వాగతిస్తున్నట్టా..? అసెంబ్లీకి హాజరు కానందున వ్యతిరేకిస్తున్నట్టా..? అని ప్రశ్నించారు. ఒకప్పుడు ఎంపీగా బిక్ష పెట్టిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రయోజనాలే పట్టని కేసీఆర్ కు తెలంగాణ ప్రయోజనాలు పడతాయా? అని నిలదీశారు. నీళ్లపై కీలక చర్చ జరుగుతున్నప్పుడు.. ఆ వ్యక్తి ఫాం హౌస్‌లో పడుకున్నారని కేసీఆర్ ను ఉద్దేశించి విమర్శించారు.

మరోవైపు బీఆర్ఎస్ నేత సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. పద్మారావును నిజమైన తెలంగాణ ఉద్యమకారుడిగా పేర్కొన్నారు. ఆయనకు ప్రతిపక్ష నాయకుడు చేస్తే బాగుంటుందన్నారు. 551 టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలని.. ఉత్తమ్‌కుమార్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారని.. ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ అనుకూలమా కాదా చెప్పాలి? అని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

Read More: కృష్ణా జలాల అంశంపై కేసీఆర్‌ను నిలదీద్దాం.. మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ సూచన..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువదీరిన తర్వాత ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం కోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. ఆ సమయంలో కేసీఆర్ తుంటికి శస్త్ర చికిత్స జరిగి విశ్రాంతి తీసుకున్నారు. అందువల్లే ఎమ్మెల్యేగా కూడా ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఇటీవల అసెంబ్లీకి స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ ఛాంబర్ లో శాసనసభ్యుడిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. ఇక ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో సభకు వస్తారని అందరూ భావించారు. కానీ రాలేదు.

ఆ తర్వాత గవర్నర్ ప్రసంగం రోజు కూడా గులాబీ బాస్ అసెంబ్లీవైపు చూడలేదు. బీఏసీ మీటింగ్ కేసీఆర్, కడియం శ్రీహరి పేర్లను బీఆర్ఎస్ ఇచ్చింది. కానీ బీఆర్ఎస్ అధినేత బీఏసీ సమావేశానికి డుమ్మాకొట్టారు. హరీశ్ రావును పంపించారు. కానీ పేరు లేకపోవడం హారీష్ రావును బీఏసీ మీటింగ్ నుంచి బయటకు పంపారు.

బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజైన కేసీఆర్ శాసన సభకు వస్తారని భావించారు. అప్పుడు కూడా కేసీఆర్ గైర్హాజరయ్యారు. బడ్జెట్ పై జరిగిన చర్చలోనూ గులాబీ బాస్ పాల్గొనలేదు. ఇప్పుడు కృష్ణా జలాలపై కీలమమైన చర్చ జరగుతున్న సమయంలో ఆయన రాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందుకే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్ రాకపోవడాన్ని తప్పుపట్టారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News