HBD Radha:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు తన అందాలతో సినీ పరిశ్రమను ఒక ఊపు ఊపిన హీరోయిన్ రాధా (Radha) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అతిలోకసుందరి శ్రీదేవి (Sridevi) తో సమానంగా సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) బెస్ట్ ఫ్రెండ్ గా మరింత క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె.. తెలుగు, తమిళ్ భాషా చిత్రాలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇకపోతే కెరియర్ పీక్స్ లో ఉండగానే ఇండస్ట్రీకి దూరమైన రాధ.. ఆ తర్వాత వైవాహిక బంధానికి పరిమితమయ్యారు. మధ్యలో ఆమె కూతురు కార్తీక (Karthika Nair) హీరోయిన్ గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ సరైన సక్సెస్ అందుకోలేదు. కొన్ని చిత్రాలలో నటించి , 2023లో పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది.
హీరోయిన్ రాధ ఆస్తుల వివరాలు..
ఇకపోతే రాధా విషయానికి వస్తే.. పెళ్లి తర్వాత తన భర్త వ్యాపారాలు చూసుకుంటూ బిజీగా ఉండగా.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా చాలా బరువు పెరిగిపోయి , బుల్లితెర కార్యక్రమాలలో ప్రసారమవుతున్నటువంటి కొన్ని డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈరోజు హీరోయిన్ రాధ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు చెందిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. అందులో భాగంగానే రాధా ఆస్తులు విలువ ఎంత ఉంటుందని అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. అసలు విషయంలోకి వెళ్తే రాధా భర్త ఎన్నో వ్యాపార రంగాలలో కొనసాగుతున్నారు. వీరికి ఇండియాలోనే కాకుండా దుబాయ్ లో కూడా హోటల్ బిజినెస్ లు ఉన్నాయి. రాధా కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగి ఎన్నో ఆస్తులను కూడబెట్టింది. అలా తన భర్త సంపాదన తో పాటూ తన సంపాదన మొత్తం కలిపి సుమారుగా రూ.400 కోట్లకు పైగా ఆస్తిపాస్తులు ఉన్నాయని సమాచారం. ఏది ఏమైనా అప్పట్లోనే ఆ రేంజ్ లో ఆస్తులు కలిగి ఉన్న హీరోయిన్గా కూడా రాధా రికార్డు సృష్టించింది.
రాధా కెరియర్..
రాధా విషయానికి వస్తే.. 1966 జూన్ 3న తిరువనంతపురం, కేరళలో జన్మించింది. భారతీరాజా దర్శకత్వంలో ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేసిన ఈమె.. 1980లో తన అద్భుతమైన నటనతో సినీ ఇండస్ట్రీని ఉర్రూతలూగించింది. రజనీకాంత్(Rajinikanth ), శివాజీ గణేషన్(Sivaji Ganesan), కమలహాసన్ (Kamal Haasan)వంటి స్టార్ హీరోలతో నటించిన ఈమె.. తెలుగులో ‘గోపాలకృష్ణుడు’ అనే సినిమాతో అరంగేట్రం చేసింది. ఇక తర్వాత అత్తకు తగ్గ అల్లుళ్ళు, జల్సారాయుడు, చండశాసనుడు, ఆయుధం, పందిరి మంచం, అడవి దొంగ, రాక్షసుడు, నాగు, గూండా, వసంతగీతం, ఆదర్శవంతుడు ఇలా పలు చిత్రాలలో నటించిన ఈమె కెరియర్ పీక్స్ లో ఉండగానే ప్రముఖ వ్యాపారవేత్త రాజశేఖర్ నాయర్ (Rajasekhar Nair) అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహం తర్వాత వీరికి కార్తీక నాయర్, విగ్నేష్ , తులసి నాయర్ అనే ముగ్గురు పిల్లలు కూడా జన్మించారు. ఇక కార్తిక నాయర్ పెద్ద కొడుకు నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా నటించిన ‘జోష్’ సినిమాతో అరంగేట్రం చేసిన ఈమె.. ఆ తర్వాత జీవా(Jeeva ) హీరోగా నటించిన ‘రంగం’ సినిమాతో పేరు సొంతం చేసుకుంది. ఈ సినిమా మొదట తమిళ్ లో తీసి తెలుగులో డబ్బింగ్ చేశారు. ఇక 2023 నవంబర్ 19న ప్రముఖ బిజినెస్ మాన్ రోహిత్ మీనన్ తో ఏడడుగులు వేసి ఇండస్ట్రీకి దూరమైంది కార్తీక.