BigTV English
Advertisement

Akhanda 2 : నార్త్ ఆడియన్స్ కోసం బాలయ్య డేరింగ్ స్టెప్… అఖండ2కు అది వర్కౌట్ అవుతుందా.?

Akhanda 2 : నార్త్ ఆడియన్స్ కోసం బాలయ్య డేరింగ్ స్టెప్… అఖండ2కు అది వర్కౌట్ అవుతుందా.?

Akhanda 2 : టాలీవుడ్ సినీ హీరో నందమూరి బాలయ్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమా లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది డాకు మహారాజ్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమా మిక్స్డ్ టాక్ ని అందుకున్న కూడా కలెక్షన్స్ పరంగా బాగానే రాబట్టింది. దాంతో మూవీ హిట్ అయ్యింది. ప్రస్తుతం బోయపాటి కాంబోలో అఖండ 2 మూవీలో నటిస్తున్నాడు. ఎప్పుడో షూటింగ్ మొదలుపెట్టిన ఈ మూవీ త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతుంది. కాగా, ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. బాలయ్య ఈసారి నార్త్ మీద కన్నెసాడని తెలుస్తుంది. అదేంటో కాస్త వివరంగా తెలుసుకుందాం..


నార్త్ లో పాగా వేసేందుకు బాలయ్య.. 

నందమూరి బాలయ్య, బోయపాటి శ్రీనుల కలయిక లో ఇప్పటి వరకు వరుస హిట్‌లున్నాయి. సింహా, లెజెండ్‌, అఖండ వంటి వరుస హిట్‌లతో హ్యాట్రిక్ హిట్‌ని దక్కించుకున్న కాంబినేషన్ వీరిది. వీరిద్దరు కలిసి నాలుగవసారి వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం బ్లాక్‌బస్టర్ మూవీ `అఖండ`కు సీక్వెల్‌గా `అఖండ 2`ని చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బోయపాటి తో బాలయ్య జర్నీ ప్రారంభానికి ముందు వరుస ఫ్లాపులు చూశారు.. ఆ తర్వాత వరుస హిట్ సినిమాలను తన ఖాతా లో వేసుకున్నాడు. ఇప్పుడు మరోసారి ఈ కాంబోలో మూవీ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూద్దామని వెయిట్ చేస్తున్నారు.. అయితే ఈసారి సౌత్ ఆడియన్స్ తో పాటు నార్త్ ఆడియన్స్ ని కూడా అలరించేందుకు బాలయ్య రెడీ అవుతున్నాడని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.


అసలు విషయానికొస్తే..ఈసారి నార్త్ మార్కెట్ పై గురి పెట్టారు నంద‌మూరి బాల‌కృష్ణ‌..’అఖండ 2’ని స్ట్ర‌యిట్ హిందీ సినిమా త‌ర‌హా లో బోయ‌పాటి శ్రీ‌ను తీర్చి దిద్దుతున్నాడని టాక్.. అయితే.. హిందీ డ‌బ్బింగ్ స్వ‌యంగా తానే చెప్ప‌బోతున్నాడట బాల‌య్య‌.. అంతేకాదు.. ముంబైలో ప్రమోషన్స్ని కూడా మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం..శివుడికి సంబంధించిన విష‌యాలు, ఆధ్యాత్మిక అంశాలూ బాలీవుడ్ కి గ‌ట్టిగా క‌నెక్ట్ అవుతాయ‌ని బ‌లంగా న‌మ్ముతున్న చిత్ర‌బృందం.. మొత్తానికి హిందీ లో బాగా వేసేందుకు బాలయ్య గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది..

Also Read : ఓవర్సీస్ లో ‘సింగిల్’ ర్యాంపేజ్.. మరో రికార్డు బ్రేక్..

అఖండ’ ఫస్ట్ పార్ట్లో బాలయ్య అఘోర గెటప్ లోని త్రిశూలం చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు, ఆ మాజికల్ వెపన్ ని మరింత పవర్ఫుల్ వెర్షన్ లోకి మార్చి మరి ‘అఖండ 2’ కోసం ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. ఈ కొత్త ఆయుధం డిజైన్ లో మైథాలజికల్ టచ్ ఉంటుందట, ప్రేక్షకులకి కొత్తదనాన్ని అందించాలని బోయపాటి స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని టాక్.. మొత్తానికి సినిమాపై భారీ అంచనాలే క్రియేట్ అయ్యాయి మరి బోయపాటి ఎలాంటి మ్యాజిక్ తో ప్రేక్షకులను మెప్పిస్తాడో చూడాలి…

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×