Hit 3 Movie : హిట్ 3 మూవీ ఇండస్ట్రీకి ఊపిరి ఇచ్చింది. ఇది కొన్నాళ్ల నుంచి వినిపిస్తున్న మాట. ఈ సినిమా వల్ల ఆడియన్స్ థియేటర్లకు వచ్చారని, ఫుల్‌గా కలెక్షన్లు వస్తున్నాయని చెప్పుకున్నారు. ఇక ఈ హిట్ 3 మూవీ నిర్మాతలు అయితే.. రూలింగ్ ఇన్ సినిమాస్ ఆల్ ఓవర్, బ్లాక్ బస్టర్ హిట్ అంటూ పోస్టర్లు పెట్టుకున్నారు. అంతే కాదు… 4 రోజుల్లోనే 101 కోట్లు కలెక్ట్ చేసింది అంటూ కూడా ప్రచారం చేసుకున్నారు.
కానీ, ఇవి అన్నీ కూడా సినిమా ప్రమోషన్స్ కోసమే అని ఇప్పుడిప్పుడే తెలిసిపోతుంది. 100 కోట్లు కలెక్ట్ చేయడం కాదు… ఈ మూవీ వల్ల భారీగా లాస్ అయిపోయాం అని చెబుతున్నారు.
కొన్ని సెంటర్స్‌లో హిట్ 3 మూవీకి మిక్సిడ్ టాక్ వచ్చింది. కొన్ని సెంటర్స్ లో హిట్ టాక్ వచ్చింది. హిట్ టాక్ వచ్చిన సెంటర్స్ లో కలెక్షన్లు పర్లేదు. కానీ, కొన్ని సెంటర్స్‌లో మితిమీరిన వయోలైన్స్ అని, గత హిట్ సినిమాల కంటే… డల్ గా ఉంది అంటూ కామెంట్స్ వచ్చాయి. అలాంటి సెంటర్స్ లో మాత్రం నిర్మాతలు చెబుతున్నట్టు రూలింగ్ ఇన్ సినిమాస్ ఆల్ ఓవర్ అనే పరిస్థితి లేదు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్లు బయటికి వచ్చి తమకు వచ్చిన నష్టాలను మీడియాకు చెబుతున్నారు. ఒక ఈస్ట్ గోదావరి ఏరియాలోనే నాని సినిమాకు 50 లక్షలకు పైగా నష్టం వచ్చిందట. ఇది చూసిన తర్వాత… “రూలింగ్ ఇన్ సినిమాస్ ఆల్ ఓవర్” ఎక్కడ ఉంది అంటూ నిర్మాతలను ప్రశ్నిస్తున్నారు. 101 కోట్లు వచ్చినంత మాత్రన సినిమా హిట్ కాదని, ఆ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన డబ్బు రావడంతో పాటు కొంత వరకు అయినా… ప్రాఫిట్స్ రావాలని అంటున్నారు.
ఒక హిట్ 3 కి మాత్రమే కాదు…
ఈస్ట్ గోదావరి ఏరియాలో 50 లక్షలు నష్టం హిట్ 3 మూవీకి వచ్చిందని అంటున్నారు. కానీ, నాని చేసే సినిమాలకు చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వడానికి చాలా కష్టపడాల్సి ఉంటుందట. కొన్ని సినిమాలు ఫుల్ రన్ కంప్లీట్ అయినా… కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి కనిపించదని అంటున్నారు. నాని నటించిన MCA మూవీ తర్వాత వచ్చిన చాలా సినిమాలు కొంత మంది డిస్ట్రిబ్యూటర్లకు లాసే ఇచ్చిందని చెబుతున్నారు.
కాగా, హిట్ 3 నిర్మాతలు… నాలుగు రోజుల్లో 101 కోట్ల కలెక్షన్లు అని పోస్టర్ వేసిన తర్వాత… ఇప్పటి వరకు మరే కలెక్షన్ల పోస్టర్ ను రిలీజ్ చేయలేదు. దీంతో ఆ కొన్ని ఏరియాల్లో లాస్ వస్తుందని నిర్మాతలకు ముందే తెలుసని, అందుకే పోస్టర్లను రిలీజ్ చేయడం లేదు అంటూ ఇండస్ట్రీ లో టాక్ కూడా వస్తుంది.