Suryakumar Yadav Will New Captain For Mumbai Indians IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ఉన్నక్రేజ్ అంతా ఇంతా కాదు. గత 17 ఏళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం 10 జట్లతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ జరుగుతోంది. అయితే… ప్రతి మూడేళ్లకు ఒకసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మెగా వేలం నిర్వహించాలని నియమం ముందు నుంచే ఉంది. చివరిసారి ఐపీఎల్ 2022 కోసం మెగా వేళాన్ని నిర్వహించారు. ఈసారి ఐపీఎల్ 2025కి ముందుగానే మెగా వేలం జరగనుంది. ఈ విషయం తెలుసి అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. చాలా మంది స్టార్ ఆటగాళ్లు మెగా వేలంలో విక్రయానికి రాబోతున్నారు. దీని కారణంగా ఈవెంట్ మరింత ఆసక్తికరంగా మారబోతుంది.
అయితే మెగా వేలానికి ముందు రూల్స్, రిటెన్షన్ పాలసీకి సంబంధించి బీసీసీఐ ఇప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అదే సమయంలో మెగా వేలానికి ముందు మీడియా నివేదికలలో చాలా భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. మెగా వేలానికి సంబంధించి అభిమానులకు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలంకు సమయం దగ్గర పడుతున్న తరుణంలోనే.. ముంబై ఇండియన్స్ జట్టులో పెను ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. ఆ జట్టులో కీలక మార్పులు చేస్తున్నారట.
ముంబై ఇండియన్స్ కు కొత్త కెప్టెన్ రాబోతున్నారట. హార్దిక్ పాండ్య స్థానంలో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా నియమించాలని ముంబై ఇండియన్స్ యాజమాన్యం అనుకుంటుందట. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఒకవేళ సూర్య టీమ్ ను వీడి మెగా ఆక్షన్ లో పాల్గొనాలని డిసైడ్ అయితే మరో సీనియర్ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రాకు సారధ్య పగ్గాలు అప్పగించాలని ముంబై ఇండియన్స్ ఓనర్స్ అనుకుంటున్నారట. కెప్టెన్సీ విషయంపై ఇప్పటికే హార్దిక్ కు క్లారిటీగా చెప్పేశారని టాక్ వినిపిస్తోంది.
ఇక మీదట అతడు ఆటగా ఆటగాడిగా మాత్రమే జట్టులో కొనసాగుతాడని సమాచారం అందుతోంది. హార్దిక్ ను కెప్టెన్సీ నుంచి తొలగించడానికి అనేక రకాల కారణాలు ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా సక్సెస్ అయిన హార్దిక్ పాండ్యాను గత ఏడాది మినీ ఆక్షన్ టీం లోకి తీసుకొచ్చింది. ముంబై ఎక్కువ డబ్బులను పెట్టి అతడిని సొంతం చేసుకుంది. జిటి లాగే ఎంఐని కూడా సక్సెస్ఫుల్ గా నడిపిస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే హార్దిక్ పాండ్యా ఫెయిల్ అయ్యారు. అటు బ్యాటర్ గా, ఇటు బౌలర్ గా ఫెయిల్ అవ్వడమే కాక చెత్త కెప్టెన్సీతోను అనేక రకాల విమర్శల పాలయ్యాడు. దీంతో అతడిని ఆ పోస్టులో నుంచి తీసేయాలని ఎంఐ ఓనర్స్ ఫిక్స్ అయ్యారట. గుజరాత్ నుంచి ముంబై ఇండియన్స్ కు వచ్చిన హార్దిక్ కాంట్రాక్ట్ కూడా ఒక సంవత్సరమేనని అంటున్నారు. కాగా రోహిత్ ఈ సారి ముంబైని వీడే ఛాన్స్ ఉందని అంటున్నారు.