BigTV English

Sreevishnu: మనోభావాలు దెబ్బతిన్నాయి.. శ్రీ విష్ణు మూవీస్ బాయ్ కాట్.

Sreevishnu: మనోభావాలు దెబ్బతిన్నాయి.. శ్రీ విష్ణు మూవీస్ బాయ్ కాట్.

Sree Vishnu: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ గా సింగిల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. సింగిల్ మూవీకి ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. మంచి కలెక్షన్స్ తో, విడుదలైన ప్రతి చోట మంచి టాక్ తో దూసుకుపోతోంది. అయితే ఈ మూవీలో ఓ డైలాగ్ కాంట్రవర్సీకి దారి తీసింది. ఓ మతాన్ని ఉద్దేశించి, శ్రీ విష్ణు కామెంట్ చేశారంటూ ఆయనపై వ్యతిరేకత మొదలైంది. అంతేకాదు ఆయన సినిమాలను కూడా బాయ్ కట్ చేస్తాం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ వివరాలు చూద్దాం..


శ్రీ విష్ణు మూవీస్ బాయ్ కాట్..

వరుస సినిమాలతో టాలీవుడ్ లో దూసుకుపోతున్న హీరో శ్రీ విష్ణు. గత సంవత్సరం స్వాగ్ సినిమాతో పలకరించి, చక్కటి ప్రేక్షకాదరణ పొందాడు. తాజాగా సింగిల్ మూవీతో, ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. అయితే తాజాగా ఈ మూవీ విడుదలైన తర్వాత అందులో, కొన్ని డైలాగ్స్ ఓ సామాజిక మతానికి చెందినవి అంటూ శ్రీ విష్ణు పై ఆరోపణలు మొదలయ్యాయి. ఇంతకీ శ్రీ విష్ణు గురించి ఆరోపణలు చేస్తున్న, వారు ఎవరంటే క్రైస్తవ మతం వారు. ఇటీవల వచ్చిన ఆయన మూవీ సింగిల్ లో, ఆయన యేసు దేవుడు అంటూ డైలాగ్ చెప్పారు. ఈ మూవీలో కొన్ని సీన్స్ క్రైస్తవ మతాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ క్రైస్తవ సంఘం ఆరోపిస్తున్నారు. యాక్టర్ శ్రీ విష్ణు గారికి క్రైస్తవము అంటే మీకు ఎందుకు అంత చులకన? ఒక మతాన్ని టార్గెట్ చేసి సినిమాలు తీయడం ఎంతవరకు కరెక్ట్? మా మీద కామెడీ చేసుకొని సినిమాలు తీయాలా? ఏ నీ మతంలో బొక్కలు లేవా? వాటి మీద ఎందుకు నువ్వు సినిమాలు తీయవు? అసలు ఏంటి నీకు క్రైస్తవంలో నచ్చనిది.. మా మతంతో నీకు వచ్చిన సమస్య ఏంటో చెప్పు అంటూ ఆయనకు ఇలాంటి ప్రశ్నలతో క్రైస్తవులు ఎదురు తిరుగుతున్నారు. బాయ్ కాట్ శ్రీ విష్ణు సినిమాలు అంటూ సోషల్ మీడియాలో, హ్యాష్ టాగ్ ను స్ప్రెడ్ చేస్తున్నారు. దీనిపై ఇంకా పూర్తి వివరణ తెలియాల్సి ఉంది. ఈ విషయంపై ఇప్పటి వరకు శ్రీ విష్ణు స్పందించలేదు. సోషల్ మీడియాలో రెండు మతాల మధ్య శ్రీ విష్ణు సినిమా చిచ్చు పెట్టిందని కామెంట్స్ చేస్తున్నారు. ఆయన ఒక్కో సినిమాలో ఒక్కొక్క మతంపై కామెడీ చేశారు. అప్పుడు తప్పు లేనిది ఇప్పుడు తప్పు ఎలా అవుతుంది అంటూ కొందరు శ్రీవిష్ణుకి సపోర్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా వేరే మతాన్ని తక్కువ చేయడం, ఒక మతంపై కామెంట్ చేయడం కరెక్ట్ కాదు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.


మా మనోభావాలు దెబ్బతిన్నాయి..

ఇక శ్రీ విష్ణు ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే డైలాగ్స్ పై పెద్ద గొడవే జరిగింది. ఆ ట్రైలర్ లో, నందమూరి బాలకృష్ణ డైలాగు, మంచీ విష్ణు కన్నప్ప సినిమాలో శివయ్య అనే డైలాగ్ను సింగిల్ మూవీ ట్రైలర్ లో రిపీట్ చేయడంతో.. అది చూసిన కన్నప్ప మూవీ టీం బాధపడ్డారని, తెలిసి విష్ణు వారికి సారీ చెప్పడం కూడా మనం చూసాము. మేము ఎవరినీ ఉద్దేశించి అలాంటి డైలాగ్స్ పెట్టలేదని, వాటిని మూవీ ట్రైలర్ లో నుంచి అలాగే సినిమాలో నుంచి కూడా తీసేస్తున్నామంటూ విష్ణు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హీరోలపై కాకుండా మతంపై కామెంట్ చేయడంతో సోషల్ మీడియాలో వార్ జరుగుతుంది. విష్ణు స్పందించి అలాంటి డైలాగ్స్ ని తీసేస్తారో, లేదంటే వాటిని మూవీ లో బీప్ సౌండ్ తో కవర్ చేస్తారో చూడాలి.

సినిమాపై ఎలాంటి వివాదాలు వచ్చినా మూవీ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో కేతిక శర్మ ఇవానా హీరోయిన్ గా నటించారు. కార్తిక రాజు దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. విష్ణు సినిమాలలోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా సింగిల్ నిలిచింది.

Adivi Sesh : బ్రదర్ ఫ్రొం అనొథెర్ మదర్.. వామ్మో.. ఏంటి ఇంత పెద్ద డైలాగ్ కొట్టాడు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×