
BRO movie in ott telugu(Latest news in tollywood) :
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. సినిమాల్లో ఆ పేరే ఓ ప్రభంజనం. సినిమా కథతో పనిలేదు. కథనం ఎలా ఉన్న ఫర్వాలేదు. అసలు సినిమా ఎలా ఉందో అవసరం లేదు. పవర్ స్టార్ నటిస్తే చాలు ఫ్యాన్స్ థియేటర్ కు వస్తారు. సినిమాపై టాక్ ఎలా ఉందో పట్టించుకోరు. పదే పదే ఆ సినిమా చూస్తారు. తమ అభిమాన హీరోను దేవుడిగా పూజిస్తారు. కలెక్షన్ల వర్షం కురిపిస్తారు. తాజాగా వచ్చిన బ్రో సినిమా కూడా ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది.
పవర్ స్టార్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించిన మూవీ బ్రో ఇప్పుడు ఓటీటీలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. జూలై 28న విడుదలైన ఈ మూవీ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చింది. ఎంటర్ టైన్ మెంట్ సినిమాగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయినా సరే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు బాగానే వసూలు చేసింది.
తాజాగా బ్రో మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ట్రెండింగ్ లో ఉంది. మనదేశంలోనే కాదు పాకిస్థాన్, బంగ్లాదేశ్ లోనూ బ్రో రికార్డులు షేక్ చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ తర్వాత నుంచి ఇప్పటికీ టాప్‌లోనే ఉంది. ఆగస్టు 21 నుంచి 27 వరకు ఉన్న ట్రెండింగ్ వివరాలను తాజాగా నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. ఈ చిత్రం ఇండియాలో టాప్ లో ఉంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్ లోనూ బ్రో మూవీని బాగా ఆదరిస్తున్నారు. ఆ రెండు దేశాల్లో బ్రో టాప్-8 మూవీస్ లిస్టులో ఉంది. బ్రో మూవీ ఓటీటీ హవాపై నెట్ ఫిక్స్ రిలీజ్ చేసి ఫోటోస్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
తమిళంలో వచ్చిన వినోదాయసిత్తం సినిమాకు రీమేక్‌గా బ్రోను తెరకెక్కించారు. ఈ సినిమాకు సముద్రఖనిగా డైరెక్టర్ గా పనిచేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించారు. బ్రో మూవీలో పవర్ స్టార్ కాలం అనే దేవుడి పాత్రను పోషించారు. కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. ప్రియా ప్రకాశ్ వారియర్ కీలక పాత్ర పోషించింది.