Udit Narayan : ఇటీవల కాలంలో సీనియర్ సింగర్ ఉదిత్ నారాయణన్ (Udit Narayan) ముద్దు వివాదం కారణంగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనకి మరో చట్టపరమైన సమస్య ఎదురు కాబోతోంది. ఆయన మొదటి భార్య రంజనా ఝా ఇప్పుడు ఆయనపై మెయింటెనెన్స్ కేసు దాఖలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఉదిత్ నారాయణన్ ఫస్ట్ భార్య ఇప్పుడేందుకు కేసు వేసింది? ఈ మెయింటెనెన్స్ కేసుకు గల కారణం ఏంటో తెలుసుకుందాం పదండి.
ఉదిత్ నారాయణన్ కు లీగల్ ట్రబుల్స్
తాజాగా ఉదిత్ నారాయణన్ మొదటి భార్య రంజనా ఝా ఆయనపై కేసు వేసింది. అందులో తన రైట్స్ ని అతను కాల రాశాడని, ఆస్తిని ఆక్రమించాడని షాకింగ్ ఆరోపణలు చేసింది. మరోవైపు రంజనా తన నుంచి డబ్బులు వసూలు చేయడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని ఉదిత్ ఆరోపించాడు. గతంలో అతనిపై బీహార్ మహిళా కమిషనరేట్ లో కేసు నమోదు అయ్యింది. అయితే అప్పట్లోనే ఈ విషయంపై ఒక ఒప్పందం ద్వారా ఇద్దరూ సమస్యను పరిష్కరించుకున్నారు. ఆ ఒప్పందం మేరకు ఉదిత్ నారాయణన్ రంజనాకు నెలకు రూ. 15,000 ఆర్థిక సహాయం అందిస్తూ వస్తున్నాడు. 2021లో ఆ మొత్తాన్ని రూ. 25,000కి పెంచారని తెలుస్తోంది. అంతేకాకుండా అతను తన మొదటి భార్యకి కోటి విలువైన ఇల్లుతో పాటు, వ్యవసాయ భూమి కూడా ఇచ్చాడని అంటున్నారు. అక్కడితో ఆగకుండా ఆమెకు రూ. 25 లక్షల విలువైన ఆభరణాలను కూడా ఇచ్చాడని సమాచారం. అయితే చివరికి ఆమె తనకిచ్చిన ఆస్తిని అమ్మేసుకుంది.
రంజనా కేసు పెట్టడానికి కారణం ఇదేనా ?
అయితే వృద్ధాప్యం వచ్చాక, ఆరోగ్యం క్షీణిస్తున్న కొద్ది తాను నిజంగా ఉదిత్ తో ఉండడాన్నే రంజనా కోరుకుంటోందని ఆమె న్యాయవాది చెప్పుకొచ్చారు. ఆమె తన జీవితాంతం భర్తతో గడపాలని కోరుకుంటుందని న్యాయవాది వెల్లడించారు. అయితే రంజనా వేసిన మెయింటెనెన్స్ కేసు విచారణ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉదిత్తలను పట్టించుకోలేదని షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాకుండా ఆ భూమిని అమ్మాక వచ్చిన 18 లక్షలు అతను తన దగ్గరే ఉంచుకున్నాడని, ముంబైకి వచ్చినప్పుడల్లా తనను బెదిరిస్తున్నాడని, తనకు ప్రాణహాని ఉందని భావిస్తున్నానని ఆమె ఆరోపించింది.
ఉదిత్, రంజనా 1984లో పెళ్లి చేసుకున్నారు. కానీ అతని కెరీర్ ఊపండుకుంటున్న టైంలోనే వీరి రిలేషన్ దెబ్బతింది. నెమ్మదిగా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అలాంటి టైంలో 2006లో రంజనా మహిళా కమిషన్ ను ఆశ్రయించింది. ఆ టైంలోనే ఉదిత్ ఆమెకు ఇల్లు, ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చాడు. కానీ ఆ హామీలను పూర్తిగా నెరవేర్చలేదని ఆమె ఆరోపిస్తోంది. ఉదిత్ నారాయణ్ ఇటీవల ముద్దు వివాదంతో వార్తల్లో నిలిచిన తర్వాతే, ఆయన మొదటి భార్య ఇలా కేసు పెట్టడం గమనార్హం. ఆయన లైవ్ కాన్సర్ట్ లో ఓ లేడి అఅభిమానికి లిప్ టు లిప్ కిస్ ఇవ్వడం దుమారం రేపింది. మరి ఈ కేసు నెక్స్ట్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.