BigTV English

Burripalem Bullodu : తెలుగు సినీ వెండితెరని.. దశాబ్దాలపాటు ఏలిన బుర్రిపాలెం బుల్లోడు..

Burripalem Bullodu : తెలుగు సినీ వెండితెరని.. దశాబ్దాలపాటు ఏలిన బుర్రిపాలెం బుల్లోడు..

Burripalem Bullodu : వెండితెర అల్లూరి సీతారామరాజు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. సిల్వర్ స్క్రీన్ కౌబాయ్ తనువు చాలించారు. తెలుగు చిత్ర సింహాసానాన్ని దశాబ్దాల పాటు ఏలిన బుర్రిపాలెం బుల్లోడు ఇక సెలవు అంటూ వెళ్లిపోయారు. హైదరాబాద్ కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రముఖ నటుడు కృష్ణ తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతితో ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.


కృష్ణనే గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా కృష్ణ తుది తుది శ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాసేపట్లో కృష్ణ భౌతికకాయన్ని ఆస్పత్రి నుంచి నానక్ రామగూడలోని విజయ్ కృష్ణ నివాసానికి తీసుకొస్తారు. ప్రముఖలు, అభిమానుల చివరి చూపు కోసం అక్కడే ఉంచుతారు. కృష్ణ మృతితో టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. కృష్ణ లేరన్న వార్తతో ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కుమిలిపోతున్నారు.

కృష్ణ వయసు 80 ఏళ్లు. 1943, మే 31న గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో కృష్ణ జన్మించారు. కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. చిన్నప్పటి నుంచి ఆయనకు సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండేది. ఏలూరు CR రెడ్డి కాలేజీలో కృష్ణ B.Sc చదివారు. ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత… కేవలం ప్రతిభను నమ్ముకుని, ఆత్మవిశ్వాసంతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. కానీ… తేనెమనసులు సినిమాతో హీరోగా అభిమానులకు పరిచయమయ్యారు.


రెండో సినిమా కన్నె మనసుల్లో నటిస్తుండగానే గూఢచారి 116లో కృష్ణకు అవకాశం వచ్చింది. అది అఖండ విజయం సాధించి… ఆయన కెరీర్ ను కీలక మలుపు తిప్పింది. ఇక.. వరుస విజయాలతో కృష్ణ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తిరుగులేని తారలుగా ఉన్న కాలంలో… ఆ తర్వాతి స్థానంలో కృష్ణ నిలిచారు. వెండితెర ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. 340కిపైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. నటుడిగా మాత్రమే కాదు నిర్మాతగా, దర్శకుడిగా కూడా తనదైన ముద్ర వేశారు.

తెలుగు ప్రేక్షకులు ఆయన్ను ముద్దుగా ఆంధ్రా జేమ్స్ బాండ్ అని పిలుచుకునేవారు. 70-71 దశకంలో కృష్ణ నటన తెలుగు ప్రేక్షకులను మరుపురానిది. ఒకఏడాదిలో పదుల సంఖ్యలో ఆయన సినిమాలు విడుదలయ్యేవి. 1968లో కృష్ణ నటించిన 10 సినిమాలు విడుదల అయ్యాయి. ఆ తర్వాత 1969లో 15, 1970 లో 16, 1971లో 11 , 1972లో 18, 1973లో 15 చిత్రాలు, 1974లో 19 సినిమాలు, 1980లో 17 సినిమాలు విడుదలయ్యాయి. ఒక దశలో కృష్ణ మూడు షిప్టుల్లో పని చేసేవారు.

నాలుగు దశాబ్దాల పాటు సినీ కెరీర్ కొనసాగించిన కృష్ణ… 340కిపైగా సినిమాల్లో నటించారు. సినీ ప్రస్థానంలో ఎన్నో సాహాసాలు చేసిన నటశేఖరుడు… డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. 1970లో పద్మాలయా పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి … విజయవంతమైన చిత్రాలు తీశారు. దర్శకుడిగా 16 సినిమాలు తెరకెక్కించారు. కృష్ణ నటించిన పలు సినిమాలు…. తెలుగులో కొత్త సాంకేతికలు, జానర్ లను పరిచయం చేశాయి.

తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమా గూఢచారి 116, తొలి కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు, తొలి ఫుల్ స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు, తొలి 70 ఎంఎం సినిమా సింహాసనం తీసి….తెలుగు సినీ పరిశ్రమకు కొత్తదనాన్ని పరిచయం చేశారు

Tags

Related News

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Big Stories

×