EPAPER

Dhoni : టీమిండియా ఫ్యాన్స్ కు శుభవార్త.. ధోనీ మళ్లీ వచ్చేస్తున్నాడు..

Dhoni : టీమిండియా ఫ్యాన్స్ కు శుభవార్త.. ధోనీ మళ్లీ వచ్చేస్తున్నాడు..

Dhoni : T20 వరల్డ్ కప్ సెమీస్ లో ఓటమితో… భారత క్రికెట్ జట్టు ఆటతీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కెప్టెన్ రోహిత్ శర్మను మార్చడంతో పాటు… స్థాయికి తగ్గట్టు రాణించని ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించి కుర్రాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు కూడా డిమాండ్ చేస్తున్నారు. దాంతో… న్యూజిలాండ్ పర్యటన నుంచి కొందరు సీనియర్లకు విశ్రాంతినిచ్చిన బీసీసీఐ… T20, వన్డే జట్లను కుర్రాళ్లతో నింపేసింది. వాళ్లు కివీస్ పై ఏ మేరకు రాణిస్తారో చూశాక… భారత జట్టు కూర్పుపై మరోసారి ఓ నిర్ణయానికి రానుంది… బీసీసీఐ. మరోవైపు… అనేక సిరీస్‌లలో అదరగొడుతున్న భారత T20, వన్డే జట్లు… ఐసీసీ టోర్నీల దగ్గరికి వచ్చే సరికి… బొక్క బోర్లా పడుతున్నాయి. గత 9 ఏళ్లుగా ఇదే తంతు. దాంతో… భారత క్రికెట్ జట్టు తలరాను మార్చే బాధ్యతను మరోసారి ధోనికి అప్పగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.


టీమిండియా చివరిసారిగా ధోనీ సారథ్యంలో 2013లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. ఆ తర్వాత ఒక్క ఐసీసీ టోర్నీ కూడా భారత్ ఖాతాలో పడలేదు. దాంతో… టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీని భారత క్రికెట్‌ డైరెక్టర్‌గా నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మూడు ఫార్మాట్లలోనూ జట్టు బాధ్యతలను చూడటం ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు కష్టంగా ఉందని… అందుకే ధోనీకి జట్టు బాధ్యతలు అప్పజెప్పాలని బీసీసీఐ అనుకుంటున్నట్లు సమాచారం. ధోని జట్టుతో కలిస్తే… ద్రవిడ్‌కు పని భారం కాస్త తగ్గుతుందని… అతను టెస్టు, వన్డే జట్ల ఆటగాళ్లను తీర్చదిద్దడంపై దృష్టి సారిస్తే… ధోనీ T20 స్పెషలిస్టులను తయరు చేస్తాడనేది బీసీసీఐ ఆలోచనగా చెబుతున్నారు. ఈ నెలాఖరులో జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బీసీసీఐ ఈ అంశంపై చర్చించబోతోందని తెలుస్తోంది. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌ తర్వాత ధోని అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ ప్రకటిస్తే… ఆ తర్వాత అతణ్ని భారత క్రికెట్ డైరెక్టర్‌గా నియమించే ఛాన్స్ ఉంది. అదే జరిగితే భారత క్రికెట్ జట్టు తలరాత మారడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు… ఫ్యాన్స్.


Related News

Brs Harish Rao : తెలంగాణపై ఎందుకంత వివక్ష ? రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో బీజేపీ నేతలు విఫలం

lychee seeds: లిచీ పండ్ల కన్నా వాటిలో ఉన్న విత్తనాలే ఆరోగ్యకరమైనవి, వాటితో ఎన్నో సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు

Tehsildars transfer: తహసీల్దార్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. సీసీఎల్ఏ ఆదేశాలు జారీ

Omar Abdullah: నేషనల్ కాన్ఫరెన్స్‌ వినాశానికి యత్నాలు.. జమ్మూ సీఎంగా ఒమర్‌ అబ్దుల్లానే!

Pithapuram Crime: 16 ఏళ్ల బాలికపై అత్యాచారం.. స్పందించిన పవన్‌ కల్యాణ్‌

KCR: గజ్వేల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన శ్రీకాంత్.. కేసీఆర్ నిజంగానే కనబడుటలేదా?

KTR on Hydra: హైడ్రాకు కేటీఆర్ కౌంటర్.. ఇంత పెద్ద లాజిక్ ఎలా మిస్సయ్యారో..

Big Stories

×