Burripalem : సూపర్ స్టార్ కృష్ణ మృతి తెలుగు రాష్ట్రాల్లో తీర విషాదాన్ని నింపింది. వెండితెర మంచి నటుడిని, మంచి మనసున్న మారాజును కోల్పోయిందని కన్నీరు మున్నీరు అవుతున్నారు. అటు కృష్ణ స్వస్థలం బుర్రిపాలెంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. కృష్ణ మృతికి సంతాపంగా బుర్రిపాలం జిల్లా పరిషత్ పాఠశాలలో ఆయన ఆత్మకు శాంతి చేేకూరాలని ప్రార్థిస్తూ..విద్యార్థులు కాసేపు మౌనం పాటించారు.