E-Paper
Advertisement

Amazon: అమెజాన్‌లోనూ అవే కోతలు..

Amazon: అమెజాన్‌లోనూ అవే కోతలు..
Advertisement

కంపెనీ చరిత్రలోనే ఇంతకుముందెన్నడూ లేని విధంగా అమెజాన్ సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఏకంగా 10 వేల మంది ఉద్యోగుల్ని సంస్థ నుంచి తీసేయాలనే ఆలోచనలో ఉన్నారు… అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్. అందులో భాగంగా ఇప్పటికే అమెజాన్ నుంచి ఒప్పంద కార్మికులను తొలగించినట్లు చెబుతున్నారు. ఒప్పందం ముగిసిందని తెలిపే సమాచారాన్ని వర్కర్లకు కూడా కంపెనీ తెలిపిందని అంటున్నారు.

కార్పొరేట్‌, టెక్నాలజీ ఉద్యోగులను ఈ వారం నుంచే తొలగించాలని అమెజాన్ భావిస్తున్నట్లు సమాచారం. ఆర్థిక మందగమనం కారణంగా కొత్త నియామకాలు చేపట్టడాన్ని ఆపేసినట్లు, ఓ ఉన్నతాధికారికి అమెజాన్‌ పంపిన ఇంటర్నల్ మెమో ద్వారా బయటపడింది. అమెజాన్‌ రోబోటిక్స్‌ బృందంలో పనిచేస్తున్న వారికి ఇప్పటికే పింక్‌ స్లిప్‌లు కూడా ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అమెజాన్‌ రోబోటిక్స్‌ విభాగంలో 3,766 మంది పనిచేస్తుండగా… వీరిలో ఎంత మందిని తీసేశారనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అంతగా లాభాలు రాని విభాగాల సిబ్బందికి కొత్త ఉద్యోగాలు వెతుక్కోవాల్సిందిగా ఇప్పటికే అమెజాన్ చెప్పినట్లు సమాచారం.

Advertisement

సంస్థలోని ఏయే విభాగాల్లో ఉద్యోగుల్ని తీసేయాలో… ఆయా విభాగాలకు సంబంధించిన ఉన్నతాధికారులే నిర్ణయం తీసుకోవాలని జెఫ్ బెజోస్ ఆదేశించినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఎకో స్మార్ట్ స్పీకర్స్‌, అలెక్సా డిజిటల్ అసిస్టెంట్లకు బాధ్యత వహించే బృందాలు… అమెజాన్ రిటైల్, హెచ్‌ఆర్‌ విభాగాల్లో ఉద్యోగుల తొలగింపు ఉండొచ్చని అంటున్నారు.

ఏడాది కిందటి లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అమెజాన్‌లో ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్ ఉద్యోగులు కలిపి మొత్తం 16 లక్షలకు పైగా పని చేస్తున్నారు. ఫెస్టివల్స్, హాలిడే సీజన్లలో డిమాండ్‌కు అనుగుణంగా, భారీ సంఖ్యలో తాత్కాలిక ఉద్యోగుల్ని నియమించుకుంటూ ఉంటుంది… అమెజాన్. కానీ, ఇటీవలి త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ ఆదాయం పడిపోవడం… ఆర్థికమాంద్యం కారణంగా సమీప భవిష్యత్తులోనూ ఆదాయం పెరిగే సూచనలు కనిపించకపోవడంతో… భారీగా ఉద్యోగుల్ని తీసేయాలని అమెజాన్ నిర్ణయించుకుందని చెబుతున్నారు.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

ఎయిర్‌టెల్ 5G యూజర్లకు అలర్ట్.. హాట్‌స్పాట్ ఆన్ చేస్తే డేటా కట్ అంటూ ప్రచారం..!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×