BigTV English

CM Revanth Reddy: తెలంగాణ జాతిపిత కేసీఆర్ కాదు.. ఆ మహోన్నత వ్యక్తి: సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: తెలంగాణ జాతిపిత కేసీఆర్ కాదు.. ఆ మహోన్నత వ్యక్తి: సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రూ.800 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంఖుస్థాపన చేశారు. ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ ను సీఎం పరిశీలించారు. స్వయం సహాయక సంఘాలకు ఏడు ఆర్టీసీ బస్సులను అందజేశారు. అనంతరం నియోజకవర్గంలోనే శివునిపల్లెలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.


‘కేసీఆర్ జాతిపిత అని హరీష్ రావు అంటున్నారు. ఈ జాతిపిత మందు వాసన లేనిదే నిద్ర లేవడు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు కేసీఆర్ తీరు ఉంది. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలు చెప్పి, తెలంగాణను దోచుకున్న వ్యక్తి జాతిపిత ఎలా అవుతాడు. త్యాగం చేసినోళ్ళకి, తాగుబోతులకి తేడా లేదా..? చెట్టు లాగా పెరిగిన హరీష్ రావు కు ఎవరు జాతిపిత అనేది తెలియాలి. తెలంగాణ రాష్ట్రానికి అసలైన జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సర్, కొండా లక్ష్మణ్ బాపూజీ అవుతారు’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

‘స్టేషన్ ఘన్‌పూర్ అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలి. వరంగల్ ఎయిర్ పోర్టు సాధించి మీ ముందు నిలబడ్డాను. రేపో, ఎల్లుండో జరిగే ఎన్నికల కోసం ఈ సభ నిర్వహించడం లేదు. మన ఆర్థిక పరిస్థితి ప్రజలందరకీ తెలియజేయాలి. కేసీఆర్ రూ.7లక్షల కోట్ల అప్పులు చేశారు. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీ చెల్లిస్తున్నాం. రైతు రుణమాఫీ చేసి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారు. అంచనాల మేరకు రాష్ట్రానికి ఆదాయం రావడం లేదు. వరంగల్ కు రైల్వే డివిజన్ తెచ్చే బాధ్యత ఎంపీ కావ్య తీసుకుంటారు. కడియం కావ్య ఎయిర్ పోర్ట్, రైల్వే కోచ్ తీసుకొచ్చారు’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.


‘కేసీఆర్ రూ.లక్ష కోట్టు ఖర్చుపెట్టి కాళేశ్వరం నిర్మించారు. నిర్మించిన మూడేళ్లకే కాళేశ్వరం కూలిపోయింది. అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం. ప్రాజెక్టులపై దమ్ముంటే హరీష్ రావు చర్చకు రావాలి. కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు రండి తేల్చుకుందాం. ఏ టైం అయినా.. ఏ ప్రాజెక్ట్ దగ్గరైనా చర్చకు రెడీ. కేసీఆర్ రూ.8.29 లక్షల కోట్ల అప్పులు చేసి ఏం చేశారు..?మా ప్రాజెక్టులే తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నాయి. పిల్ల కాకులకు ఏం తెలుసు ఉండేలు దెబ్బ. కాంగ్రెస్ వచ్చాకే వరంగల్ కు అన్ని సౌకర్యాలు వచ్చాయి’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

‘ఉద్యోగానికి రాకుండా జీతభత్యాలు తీసుకునే వెసులుబాటు ఎక్కడైనా ఉందా..? కేసీఆర్ కు 58 లక్షల జీతం.. వందలాది పోలీసులు పహారా ఎందుకు..? నిత్యం జీతం తీసుకునేది ఫాంహౌజ్ లో పడుకోవడానికేనా కేసీఆర్..? మీ అనుభవం తెలంగాణ ప్రజలకు ఉపయోగించరా కేసీఆర్..? మీరు, మీ కొడుకు, మీ అల్లుడు అంతా ఫాంహౌజ్ లు కట్టుకున్నారు. కేసీఆర్ కుటుంబమంతా లక్ష కోట్లు సంపాదించుకున్నారు. ఆ సంపాదన సీక్రెట్ ఏంటో తెలంగాణ ప్రజలకు కూడా చెప్పండి. కనీసం నెలకు లక్ష సంపాదించే నైపుణ్యం యువతకు నేర్పించండి. కేసీఆర్ రాష్ట్రంలో 1,81,000 కోట్లు సాగునీటికి ఖర్చు పెట్టారు’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ALSO READ: BOI Recruitment: డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. లక్షకు పైగా ఉద్యోగాలు..

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Big Stories

×