Shrasti Verma: టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ.. పేరు వింటేనే గతంలో జానీ మాస్టర్‌తో నడిచిన వివాదం గుర్తుకొస్తుంది. ఆ కేసు ఇంకా కొనసాగుతుండగానే, ఈమె ఇప్పుడు మరో బాంబ్ పేల్చారు.. ఏకంగా జాతి గర్వించదగ్గ స్వాతంత్య్ర సమరయోధులపై అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేశారు. గాంధీ, నెహ్రూలను దేశాన్ని నాశనం చేసిన “బాస్టర్డ్స్” అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇంతకీ శ్రేష్టి వర్మ ఎందుకలా మాట్లాడారు? ఆమె మాటలకు అర్థమేంటి? ఈ సంచలన వ్యాఖ్యలపై ఎన్‌ఎస్‌యూఐ ఎలా స్పందించింది?
శ్రేష్టి వర్మపై కేసు నమోదు..
కొద్ది రోజుల క్రితం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై సంచలన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన ఈమె, ఇప్పుడు స్వాతంత్య్ర సమరయోధులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం రేపుతున్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ గుంటూరు జిల్లా నాయకులు ఆమెపై కేసు నమోదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
శ్రేష్టి వర్మ తన సోషల్ మీడియా ఖాతాలో స్వాతంత్య్ర సమరయోధులు మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూలను తీవ్రంగా దూషిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఆమె వారిని “బాస్టర్డ్స్” అంటూ సంబోధించడమే కాకుండా, వీరంతా దేశాన్ని నాశనం చేశారని ఆరోపించారు. రాబోయే తరం ఈ “బాస్టర్డ్స్” గురించి కాకుండా నిజమైన స్వాతంత్య్ర సమరయోధుల గురించి నేర్చుకోవాలని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా, పాఠ్యపుస్తకాల నుండి వారి ప్రస్తావనలను తొలగించాలని, వారి జీవిత చరిత్రలను తెలిపే అధ్యాయాలను పూర్తిగా తీసివేయాలని ఆమె డిమాండ్ చేశారు. వారు దేశానికి ద్రోహం చేసి, సర్వనాశనం చేశారంటూ ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
శ్రేష్టి వర్మపై తీవ్రమైన విమర్శలు..
సినీ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ చేసిన ఈ తీవ్రమైన వ్యాఖ్యలను గుంటూరు జిల్లా ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షులు షేక్.కరీం తీవ్రంగా ఖండించారు. జిల్లా ఎస్పీ గారి గ్రీవెన్స్ సమావేశంలో ఆయన శ్రేష్టి వర్మపై అధికారికంగా కేసు పెట్టారు. స్వాతంత్య్ర సమరయోధుల గొప్పతనాన్ని గుర్తించకుండా, వారిని హేళన చేస్తూ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. హద్దులు దాటి మాట్లాడిన శ్రేష్టి వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలని, తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆయన పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనతో శ్రేష్టి వర్మపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలా ఉండగా, టాలీవుడ్‌లో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌తో శ్రేష్టి వర్మకు ఉన్న వివాదం ఇంకా మర్చిపోకముందే ఈ కొత్త వివాదం తెరపైకి రావడం గమనార్హం. జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సమయంలో శ్రేష్టి వర్మను లైంగికంగా వేధించారనే ఆరోపణలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యి, దాదాపు నెల రోజుల పాటు జైలు జీవితం కూడా గడిపారు. కొన్ని నెలల క్రితమే ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. తాను ఏ తప్పు చేయలేదని, నిజం త్వరలోనే అందరికీ తెలుస్తుందని జానీ మాస్టర్ ఇప్పటికే మీడియాకు తెలిపారు. ఆ కేసు ఇంకా కోర్టులో నడుస్తోంది.
Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కి పండగలాంటి న్యూస్.. షూటింగ్ కి దొర వచ్చాడురా