Khushi Kapoor: వారసులుగా సినీ పరిశ్రమలోకి ఎంటర్ అయిన వారిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉంటాయి. కానీ చాలాసార్లు ఆ అంచనాలు నిలబెట్టుకోలేక వారసులు ఇబ్బంది పడుతుంటారు. ఇక సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా వందల సినిమాల్లో నటించి అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న నటి శ్రీదేవి (Sridevi). తన అనూహ్య మరణం తర్వాతే తన ఇద్దరు కూతుళ్లు హీరోయిన్లుగా మారారు. ఇప్పటికే పెద్ద కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పుడు చిన్న కూతురు ఖుషి కపూర్ వంతు వచ్చేసింది. ఖుష్ ప్రస్తుతం తన డెబ్యూ మూవీ ‘లవ్‌యాపా’ ప్రమోషన్స్‌లో బిజీగా గడిపేస్తోంది. అందులో భాగంగానే తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
ప్రమోషన్స్‌లో బిజీ
‘లవ్‌యాపా’ (Loveyapa) కంటే ముందే ‘ది ఆర్చీస్’ అనే వెబ్ ఫిల్మ్‌లో నటించింది ఖుషి కపూర్. కాకపోతే ఇందులో ఖుషి మాత్రమే కాకుండా చాలామంది స్టార్ కిడ్స్ నటించారు. కానీ అందులో ఒక్కరి నటన కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అందరూ విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కున్నారు. ఖుషి కపూర్‌పై కూడా ట్రోల్స్ వచ్చాయి. అందుకే కొంచెం టైమ్ తీసుకొని ‘లవ్‌యాపా’తో నేరుగా వెండితెరపై ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యింది ఖుషి. జనవరి 31న ‘లవ్‌యాపా’ విడుదల కానుండగా ఈ సినిమాను ప్రమోట్ చేయడం కోసం బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తెగ కష్టపడిపోతోంది ఖుషి కపూర్. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తన తల్లి నటించిన సినిమాల్లో తన ఫేవరెట్ ఏంటో బయటపెట్టింది.
భయం ఉండేది
ముందుగా ఖుషి కపూర్ తన వ్యక్తిత్వం గురించి మాట్లాడింది. ‘‘నేను స్ట్రెయిట్‌గా మాట్లాడేసే మనిషిని. నాకు విషయాలు అన్నీ స్పష్టంగా ఉండాలి. ఈరోజుల్లో చాలామంది మనుషుల్లో చెడే ఎక్కువగా ఉందని ఫీలవుతుంటాను. కానీ నాకు మాత్రం స్ట్రెయిట్‌గా ఉంటేనే ఇష్టం. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయి. నా మొదటి సినిమా సమయంలో నేను విషయాలను కాస్త డిఫరెంట్‌గా చూసేదాన్ని. నాకు కొంచెం స్టేజ్ ఫియర్ ఉండేది. ప్రేక్షకులు నా యాక్టింగ్‌ను చూస్తున్నారంటే నాకు కాస్త భయంగా ఉండేది. ఇది నేను షూట్ చేసిన మూడో సినిమా కాబట్టి అంతగా భయం అనిపించలేదు. అన్ని ఎలా ఉంటాయో తెలిసిపోతుంది’’ అని చెప్పుకొచ్చింది ఖుషి కపూర్ (Khushi Kapoor).
Also Read: అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్.. భారీ రిస్క్ తీసుకుంటున్నారా.?
అదే ఫెవరెట్
‘‘నేను కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు చాలా భయపడ్డాను. నన్ను ప్రేక్షకులు ఎలా తీసుకుంటారా అనే భయం ఉండేది. ఎవరికైనా ప్రేక్షకుల నుండి ఇష్టం వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంటుంది కదా. రిజెక్ట్ చేస్తారేమో అని భయం ఉండేది కానీ అది నేచురల్ అని అర్థమయ్యింది. ఎక్స్‌పీరియన్స్‌తో యాక్టర్లకు కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. చుట్టూ ఉన్న మనుషుల దగ్గర నుండి నేర్చుకోవడం ద్వారా అంతా ఈజీ అయిపోయింది అనే ఫీలింగ్ వస్తుంది’’ అని తెలిపింది ఖుషి కపూర్. ఇక తన తల్లి శ్రీదేవి నటించిన సినిమాల్లో తన ఫేవరెట్ ఏంటి అని అడగగా.. ‘సద్మా’ అని బయటపెట్టింది ఖుషి. శ్రీదేవి నటించిన ఎన్నో సినిమాల నుండి ఖుషి.. ‘సద్మా’ సెలక్ట్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు.