BigTV English

Monalisa : రౌడీలకు చుక్కలు చూపించిన తేనేకళ్ల పాప.. ఇదేం ఫైటింగ్ మామా..

Monalisa : రౌడీలకు చుక్కలు చూపించిన తేనేకళ్ల పాప.. ఇదేం ఫైటింగ్ మామా..

Monalisa : అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టమే.. ఒకసారి తలుపు తడితే ఇక వారి జీవితం పూర్తిగా మారిపోతుందని పెద్దలంటుంటారు. సరిగ్గా అలానే మోనాలిసా జీవితం కూడా పూర్తిగా మారిపోయింది.. మహా కుంభమేళాలో పూసలమ్మకుంటూ కనిపించిన ఈ తేనె కళ్ళ సుందరి మోనాలిసా భోంస్లే బాగా ఫేమస్ అయిపొయింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌కి చెందిన ఆమె పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకోవడానికి ఉత్తరప్రదేశ్‌ లోని ప్రయోగరాజ్‌ వేదికగా జరుగుతున్న మహాకుంభమేళాకు వచ్చింది.. కొందరు యూట్యుబర్ ఇన్‌ఫ్లూయర్స్ ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా ఓ రేంజ్ లో వైరల్ అయిపోయాయి.. దాంతో ఎక్కడ చూసినా ఈమె పేరే వినిపించేది. ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయింది. ఆ తర్వాత ఆమెతో సినిమా చేయాలని దర్శక నిర్మాతలు ఆమె దగ్గరికి క్యూ కట్టారు మొత్తానికైతే పూసల అమ్ముకునే అమ్మాయిని తీసుకొచ్చి పాపులర్ స్టార్ ని చేశారు.. తాజాగా మోనాలిసా చేస్తున్న ఓ సినిమా క్లిప్పు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


మోనాలిసా మొన్నటివరకు షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేస్తూ హడావిడి చేసింది. ఇప్పుడు తన మొదటి సినిమాని చేస్తూ బిజీగా ఉంది.. బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన లో మోనాలిసాకు ఛాన్స్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఆమె స్వగ్రామానికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి అగ్రిమెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. ఆ మూవీ స్టార్ట్ అయ్యింది. ఇందులో మోనాలిసా పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుంది. భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక క్లిప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో మోనాలిసా రౌడీలతో బిగ్ ఫైట్ చేస్తూ కనిపిస్తుంది.. గట్స్ ఉన్న అమ్మాయి లాగా రౌడీలను కొడుతూ కనిపిస్తుంది. మోనాలిసా యాక్షన్స్ సన్నివేశాలకు జనాలు ఫీదా అవుతున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హీట్ అవుతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Also Read : సెన్సార్ ను పూర్తి చేసుకున్న ‘ దిల్ రూబా ‘.. ఆ మూవీని కాపీ కొట్టారా..?


ఇదిలా ఉండగా.. ఈ మోనాలిసా రూపురేఖలను పూర్తిగా మార్చేశారు. ఇక అంతే కాదు అప్పుడే రూమర్స్ కూడా మొదలయ్యాయి. డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసాతో చనువుగా ఉండడంపై పలువురు బాలీవుడ్ దర్శక నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసాను ట్రాప్ చేస్తున్నారని.. డబ్బు కోసం ఆమెను వాడుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేస్తున్నారు.. అంతేకాదు ఈ వ్యాఖ్యల పై స్పందించారు డైరెక్టర్ సనోజ్ మిశ్రా. బాలీవుడ్ దర్శక నిర్మాతలు తనపై చేస్తోన్న ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఆయన వారిపై ముంబైలోని అంబోలీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.. ఇది నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇక మోనాలిసా మొదటి మూవీ మంచి క్రేజ్ని  అందుకునేలా కనిపిస్తుంది.. ఈ మూవీ తర్వాత ఆమె మరో రెండు మూవీలలో నటిస్తుందని టాక్..

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×