Big Stories

100 Times Blood Donation: మెగాస్టార్ కోసం ‘మహర్షి’ హీరో ఏం చేశాడో తెలుసా..? 100సార్లు రక్తదానం!

Chiranjeevi Honors ‘Maharshi Raghava’ for Donating Blood for 100 Times: మెగాస్టార్ చిరంజీవి.. స్టార్ గా ఎదిగినా ఒదిగివుండే వ్యక్తిత్వం ఆయనది. సమాజం కోసం ఏదైనా చేయాలి అనే తపనతో ఉంటూ ఉంటారు. ఆ తపన నుంచి పుట్టిందే చిరంజీవి బ్లడ్ బ్యాంక్. ఉచిత రక్తదానం. అప్పట్లో ఈ బ్లడ్ బ్యాంకు ఎన్నో ప్రాణాలను కాపాడింది.. ఇప్పటికీ కాపాడుతూనే ఉంది. ఒకప్పుడు రక్తదానం చేయడానికి ముందుకు రానివారందరిని చిరంజీవి బ్లడ్ బ్యాంకు మార్చేసింది. తమ అభిమాన హీరో చెప్పిన పనిచేయడానికి ఫ్యాన్స్ కదిలివచ్చారు. మెగా హీరోల పుట్టినరోజు వచ్చిన ప్రతిసారి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కళకళలాడుతూ ఉంటుంది.

- Advertisement -

ఇక ఇప్పటివరకు అభిమానులుతో పాటు సెలబ్రిటీలు సైతం బ్లడ్ ను డొనేట్ చేశారు. తాజాగా ఒక నటుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో 100 వ సారి రక్తదానం చేసి రికార్డ్ సృష్టించాడు. అతనే మహర్షి రాఘవ. మహర్షి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రాఘవ.. ఆ సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నాడు. ఇక ఆ తరువాత ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు. గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరు స్నేహితుల్లో ఒకడిగా కనిపించాడు.చిరు తో మంచి స్నేహం ఉన్న ఆయన.. చిరు బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేసిన దగ్గరనుంచి ఇప్పటివరకు 100 సార్లు రక్తదానం చేసి చరిత్ర సృష్టించాడు.

- Advertisement -

Also Read: Chiranjeevi: మెగాస్టార్‌ను కలిసిన రష్యన్ ప్రతినిధులు.. వైరల్ అవుతున్న ఫోటోలు

ఇక దీంతో చిరు.. ఆయనను స్వయంగా ఇంటికి పిలిచి సన్మానించారు. ” నేను బ్లడ్ బ్యాంకు స్టార్ట్ చేసినప్పుడు మొదటగా రక్తం ఇచ్చింది మురళీ మోహన్.. రెండో వ్యక్తి మహర్షి రాఘవ. ఇప్పటివరకు అందరూ 60, 70 సార్లు ఇచ్చారు కానీ 100 సార్లు ఇచ్చిన ఏకైక వ్యక్తి మహర్షి రాఘవ.ఆయనను సత్కరించడం ఎంతో ఆనందంగా ఉంది” అంటూ చిరు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News