BigTV English

Chiranjeevi: కథ నచ్చినా వర్కవుట్ అవ్వలేదు.. చిరంజీవి వదిలేసిన కథతో యంగ్ హీరో సినిమా..

Chiranjeevi: కథ నచ్చినా వర్కవుట్ అవ్వలేదు.. చిరంజీవి వదిలేసిన కథతో యంగ్ హీరో సినిమా..

Chiranjeevi: ఒక దర్శకుడు ఒక హీరోను దృష్టిలో పెట్టుకొని కథ రాసుకున్నా కూడా ఆ మూవీ అదే హీరోతో వర్కవుట్ అవుతుందనే నమ్మకం లేదు. చాలాసార్లు దర్శకులు.. తాము అనుకున్న హీరోలకు కథ వినిపించే ఛాన్స్ కూడా ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా అది ఆ హీరోకు నచ్చుతుందనే నమ్మకం లేదు. అందుకే ఒక హీరో కోసం కథ రాసుకున్నా కూడా మరొక హీరోతో ఆ సినిమా తెరకెక్కించి హిట్ కొట్టిన దర్శకులు ఎంతోమంది ఉన్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇష్టపడిన కథ ఒక యంగ్ హీరో చేతికి వెళ్లిందని ఆ హీరోనే స్వయంగా బయటపెట్టాడు. అతడు మరెవరో కాదు.. సందీప్ కిషన్ (Sundeep Kishan). త్వరలోనే విడుదల కానున్న ‘మజాకా’ సినిమా గురించే సందీప్ చెప్పుకొచ్చింది.


అండర్ రేటెడ్ హీరో

టాలీవుడ్‌లో చాలవరకు యంగ్ హీరోలు ఒక్క హిట్ కోసం ఎదురుచూస్తూ కాలాన్ని గడిపేస్తున్నారు. మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా పలు కారణాల వల్ల తాము నటించిన సినిమాలు హిట్ అవ్వడం లేదు. ప్రస్తుతం మరో యంగ్ హీరో అయిన సందీప్ కిషన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. తను నటించిన చాలావరకు సినిమాలు అండర్ రేటెడ్‌గా మిగిలిపోతున్నాయి. తను ఏ సినిమా చేసినా కూడా దాని ప్రమోషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు సందీప్. ప్రస్తుతం తన అప్‌‌కమింగ్ మూవీ ‘మజాకా’ విషయంలో కూడా అదే పని చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం బయటపెట్టాడు సందీప్.


సినిమా చేయలేనని బాధ

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సందీప్ కిషన్ నటించిన సినిమానే ‘మజాకా’ (Mazaka). అయితే ‘మజాకా’ షూటింగ్ సమయంలో ఒకసారి చిరంజీవి (Chiranjeevi)ని కలిశానని గుర్తుచేసుకున్నాడు సందీప్. తనకు, మెగాస్టార్‌కు మొదటి నుండి మంచి అనుబంధం ఉందని గర్వంగా చెప్పుకొచ్చాడు. అలా ఒకసారి కలిసినప్పుడు తనకు ‘మజాకా’ కథ బాగా నచ్చిందని, ఆ కథ తాను చేయలేకపోతున్నందుకు చాలా బాధపడ్డానని చిరంజీవి తనతో చెప్పినట్టుగా బయటపెట్టాడు సందీప్ కిషన్. అంతే కాకుండా ఇలాంటి కథను ఎంచుకున్నందుకు ఆయన అభినందనలు కూడా చెప్పారట. దీంతో చిరంజీవి ఇష్టపడి చేయలేకపోయిన కథతో సందీప్ కిషన్ వస్తున్నాడని సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది.

Also Read: రెమ్యునరేషన్ లేకుండానే సినిమా.. కానీ అదొక్కటే కండీషన్.!

రీల్స్‌తో ప్రమోషన్స్

‘మజాకా’ మూవీలో సందీప్ కిషన్‌కు జోడీగా తెలుగమ్మాయి రీతూ వర్మ నటించింది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో సందీప్‌తో పాటు రీతూ వర్మ కూడా యాక్టివ్‌గా పాల్గొంటోంది. ముఖ్యంగా ప్రమోషన్స్‌లో భాగంగా వీరిద్దరూ కలిసి చేస్తున్న రీల్స్ చాలా బాగున్నాయని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. వీరి పెయిర్ చాలా క్యూట్‌గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో ‘మన్మథుడు’ ఫేమ్ అన్షు కూడా చాలాకాలం తర్వాత వెండితెరపైకి రీఎంట్రీ ఇస్తోంది. రావు రమేశ్ మరో ముఖ్య పాత్రలో నటిస్తుండగా ఫిబ్రవరి 26న ‘మజాకా’ థియేటర్లో సందడి చేయనుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×