BigTV English

Watermelon: పుచ్చకాయ కొనుగోలు చేస్తున్నారా? ఇలా చెక్ చేయకుంటే పెను ప్రమాదమే?

Watermelon: పుచ్చకాయ కొనుగోలు చేస్తున్నారా? ఇలా చెక్ చేయకుంటే పెను ప్రమాదమే?

Watermelon: అసలే సమ్మర్ సీజన్ రాబోతోంది. అప్పుడే ఎండలు కూడా దంచేస్తున్నాయి. ఉదయం 9 తర్వాత భానుడి ప్రతాపం.. తగ్గేదేలే అనే లెవెల్ లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సమ్మర్ సీజన్ వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. కూల్ డ్రింక్స్, కొబ్బరి కాయలు, పుచ్చకాయలు, మజ్జిగ, చెరుకు రసం, ఫ్రూట్ జ్యూస్ లాంటి దుకాణాలు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. అయితే పుచ్చకాయల కొనుగోలులో మాత్రం జాగ్రత్తలు పాటించకపోతే, అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు, ఇలాంటి హెచ్చరికల వెనుక పెద్ద కారణమే ఉంది. పుచ్చకాయలకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, తస్మాత్ జాగ్రత్త అంటూ వైద్యులు సూచిస్తున్నారు.


పుచ్చకాయ తినండి.. వారెవ్వా రుచి అనాల్సిందే అంటుంటారు వ్యాపారులు. చూసేందుకు ఎర్రగా కనిపించే పుచ్చకాయ భాగాలను చూస్తే మనసు ఆగదు సుమా. అలా ఎర్రగా కనిపించే పుచ్చకాయలు తినే ముందు ఒక్క నిమిషం ఆగాలని వైద్యుల సలహా. సమ్మర్ సీజన్ లో పుచ్చకాయల సాగు అధికంగా ఉంటుంది. అందుకే మార్కెట్ లో వీటి కొనుగోళ్ల జోరు ఊపందుకుంటుంది. మనం పుచ్చకాయ కొనుగోలు చేసేందుకు వెళ్లిన సమయంలో, కాయ లోపల ఎలా ఉందో తెలుసుకొనేందుకు కాయకు పొడవాటి రంద్రం వేయిస్తాం. మన కళ్లకు ఎర్రగా కనిపించిందా.. వారెవ్వా జాక్ పాట్ తగిలిందంటూ.. ఆనందంతో పుచ్చకాయ చేతిలో పట్టుకుంటాం.

మేడిపండు చూడు మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడు పురుగులుండు అనే పద్యం గుర్తుండే ఉంటుందిగా.. సేమ్ టు సేమ్ పుచ్చకాయ చూడు ఎర్రగా ఉండు.. ముక్కలు చేసి చూడు నకిలీ రంగులుండు అనేస్తున్నారు కొందరు. కోళ్లకు ఇంజక్షన్స్ వేసి వాటి శరీర పరిమాణం పెంచుతారని పలు కథనాలు అప్పుడప్పుడు హల్చల్ చేస్తుంటాయి. అలాగే పుచ్చకాయ కోసిన వెంటనే కొనుగోలుదారులకు ఎర్రగా కనిపించేందుకు ఎర్రటి రంగులో గల ఇంజక్షన్స్ వేస్తున్నారని ప్రచారం సాగుతోంది.


ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోనే వైరల్ గా మారింది. దీనితో నిజాయితీగా వ్యాపారాలు నిర్వహించే వ్యాపారస్థులకు కూడా తిప్పలు తప్పడం లేదట. పుచ్చకాయలు పండించే రైతులు ఇలాంటి పనులు చేయరని, కొందరు వ్యాపారస్థులు అత్యాశకు వెళ్లి ఇలాంటి పనులు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అందుకే పుచ్చకాయలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి కాయలను చిన్నారులు తింటే పెను ప్రమాదమే పొంచి ఉందట.

Also Read: సమ్మర్‌లో తప్పకుండా.. పాటించాల్సిన టిప్స్ ఇవే!

ఇలా పరిక్షించండి
పుచ్చకాయ కొనుగోలు చేసిన సమయంలో కాయను కోస్తారు. అలా కాకుండా సగానికి కాయను కోయించాలి. అప్పుడు దూదిని చేతిలో పట్టుకొని ఎర్రగా ఉన్న కాయపై రుద్దాలి. అప్పుడు ఇంజక్షన్ వేయని పుచ్చకాయ అయితే, దూదికి ఎర్రటి రంగు రాదు. అదే ఇంజక్షన్ వేసిన పుచ్చకాయ అయితే తప్పక దూదికి ఎర్రటి రంగు వస్తుందని పలువురు వ్యాపారస్థులు తెలుపుతున్నారు. ఇలాంటి మోసాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని వారు కోరుతున్నారు. అలాగే ఇలాంటి ఘటనలు స్వయంగా ఎదుర్కొంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిన యెడల ఇలాంటి చర్యలకు ఎవరూ పాల్పడరని వారు తెలిపారు. మొత్తం మీద ఎర్రటి ఎండల కాలంలో.. ఎర్రటి పుచ్చకాయ తినాలని కోరిక కలిగిందా.. అయితే తస్మాత్ జాగ్రత్త!

Related News

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Big Stories

×