JioStar – ICC CT 2025: రిలయన్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ జాయింట్ వెంచర్ అయిన జియో హాట్ స్టార్ ఇప్పుడు అధికారికంగా అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇది నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ నీ వెనక్కి నెట్టి బలమైన ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ గా అవతరించింది. ఇంతకుముందు వేరువేరుగా అందించిన ఈవెంట్లను ఇప్పుడు ఈ సంస్థలు కలిసి అందిస్తున్నాయి. ఈ జియో హాట్ స్టార్ లో ఐపీఎల్ క్రికెట్, ఐసీసీ టోర్నమెంట్లను ఎంజాయ్ చేయవచ్చు.
Also Read: Amir on IPL 2026: ఐపీఎల్ ఆడబోతున్న పాకిస్థాన్ క్రికెటర్..!
ఐపీఎల్ ప్రసార హక్కులను దక్కించుకున్న తర్వాత జియో సినిమా యాప్ కి క్రేజ్ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్లను ప్రసారం చేస్తున్నట్లు సంస్థ చేసిన ప్రకటనతో క్రీడాభిమానులు ఖుషి అయిపోయారు. కానీ ఈ రెండు జాయింట్ వెంచర్ గా ఏర్పడి ఒకే వేదికగా మారడంతో 2025లో క్రికెట్ మ్యాచ్లు చూడాలంటే ప్లాన్ ని కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇక వీటి సబ్స్క్రిప్షన్ ధరలు చూస్తే మూడు నెలల పాటు యాడ్స్ తో కూడిన ప్లాన్ రూ. 149 నుండి ప్రారంభం అవుతుంది.
సంవత్సర ప్రీమియం రూ. 499 కి అందుబాటులో ఉంది. ఇవి విత్ యాడ్స్ తో ఒక మొబైల్ డివైజ్ కి మాత్రమే అనుమతి. ఇక సూపర్ ప్లాన్ డీటెయిల్స్ చూస్తే.. మూడు నెలలకు 299 రూపాయలు. ఏడాది ప్లాన్ 899 రూపాయలు. ఇవి కూడా విత్ యాడ్స్ తో రెండు డివైజ్లకు అనుమతి. ఇక ప్రీమియం ప్లాన్స్ మూడు నెలలకు 499 రూపాయలు. సంవత్సరానికి 1499 రూపాయలు. ఇవి నాలుగు డివైజ్ లకు అనుమతి. అయితే వీటికి లైవ్ ప్రసారాలకు తప్ప మిగతా కంటెంట్లకు నో యాడ్స్.
ఇక ఈ జియో హాట్ స్టార్ లో ప్రసారమయ్యే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లోని మ్యాచ్లకు భారీగా వ్యూస్ వస్తున్నాయి. ఇటీవల స్ట్రీమ్ చేయబడిన భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ కి 60.2 కోట్లు {602 మిలియన్లు} వ్యూస్ నమోదు అయ్యాయి. ఇది ఇప్పటివరకు స్ట్రీమ్ చేయబడిన క్రికెట్ మ్యాచ్లలో అత్యధిక వ్యూవర్లుగా నిలిచింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయిలో జరిగిన ఈ మ్యాచ్ లో ఈ రికార్డు సాధించింది.
Also Read: Jasprit Bumrah: ముంబై ఇండియన్స్ కు బిగ్ షాక్.. ఆ డేంజర్ ప్లేయర్ ఔట్ !
పాకిస్తాన్ ఇన్నింగ్స్ ప్రారంభంలో 6.8 కోట్లు వ్యూవర్లుగా ఉన్న ఈ మ్యాచ్ కి.. విరాట్ కోహ్లీ సెంచరీతో భారత జట్టును గెలిపించినప్పుడు 60.2 కోట్లుగా పెరిగాయి. అయితే మార్చు 9 ఆదివారం రోజున భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య జరగబోయే ఫైనల్ మ్యాచ్ కోసం {JioStar – ICC CT 2025} ఒక్కో 10 సెకండ్ల ఆడ్ కోసం ఈ జియో హాట్ స్టార్ ఏకంగా 35 లక్షలు తీసుకుంటుందట. ఫైనల్ మ్యాచ్ కి వ్యూస్ భారీగా వస్తాయని భావించి.. ఒక్కో 10 సెకండ్ల ఆడ్ కోసం 35 లక్షలు తీసుకుంటుంది జియో హాట్ స్టార్.