BigTV English
Advertisement

Vishwambhara Release : ఇంకెన్నాళ్లీ నిరీక్షణ… అసలేం అడ్డొస్తుంది…?

Vishwambhara Release : ఇంకెన్నాళ్లీ నిరీక్షణ… అసలేం అడ్డొస్తుంది…?

Vishwambhara Release Date : సోషియో ఫాంటాసీ సినిమాలంటే… అందరికీ గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవినే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీ ఇండస్ట్రీలో ఎప్పటికీ ఒక అద్భుతమే.


అలాగే, డెబ్యూ మూవీనే సోషియో ఫాంటాసీ జానర్‌లో చేసి, అది కూడా బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్‌తో ఉన్న హీరోకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ మల్లిడి వశిష్ట్.

వీరి ఇద్దరి కాంబోలో సోషియో ఫాంటాసీ మూవీ అంటే… ఎలాంటి అంచనాలు ఉంటాయి. అందులోనూ… జగదేకవీరుడు అతిలోకసుందరికి మించిన స్క్రిప్ట్, గ్రాఫిక్స్ ఉంటుందని చెప్పారు. అందుకే… వీరి కాంబోలో వస్తున్న విశ్వంభర మూవీపై ఎక్కడలేని అంచనాలు ఉన్నాయి.


అయితే ఈ మూవీ మాత్రం ఇంకా విడుదలవ్వడం లేదు. 2023 చివర్లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇక షూటింగ్ పార్ట్ ముగించికుని కూడా చాలా రోజులు అవుతుంది. అయినా… ఇంకా రిలీజ్ రావడం లేదు. నిజానికి ఈ విశ్వంభర మూవీని 2025 సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ, అప్పుడే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ రావడంతో, తమ మూవీని వాయిదా వేసుకుంటున్నట్టు అప్పడు నిర్మాతలు యూవీ క్రియేషన్స్ చెప్పుకున్నారు.

గేమ్ ఛేంజర్ రావడం వల్ల సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్న ఈ విశ్వంభర మూవీ కనీసం 2025 వేసవికి అయినా… రిలీజ్ అవుతుందని అనుకున్నారు. ఇప్పుడు మే కూడా అయిపోయింది. జూన్ వచ్చేస్తుంది. అయినా… విశ్వంభర రిలీజ్ గురించి మేకర్స్ నోటి నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు.

అడ్డు ఇదేనా..?

విశ్వంభర మూవీ రిలీజ్ డేట్‌ను ఇప్పటి వరకు అనౌన్స్ చేయకపోవడానికి కారణం వీఎఫ్ఎక్స్ పనులే అని తెలుస్తుంది. గతంలో చేసిన వీఎఫ్ఎక్స్ సినిమాకు సరిగ్గా సెట్ అవ్వకపోవడం, చిరంజీవికి నచ్చకపోవడంతో… మరోసారి ఈ గ్రాఫిక్స్ పనులు చేస్తున్నారట.

విశ్వంభర సినిమాలో కథ కంటే గ్రాఫిక్స్ కే ఎక్కువ ప్రీయారిటి ఉంటుంది. కథలో మైనస్‌లు ఉన్నా… గ్రాఫిక్స్‌తో సర్ధిచెప్పొచ్చు. అందుకే వీఎఫ్ఎక్స్ కే ఎక్కువ టైం, డబ్బులు కేటాయిస్తున్నారు నిర్మాతలు. అలాగే, ఈ మూవీ జగదేకవీరుడు అతిలోకసుందరితో కంపేరిజన్ ఉంటుంది. ఈ కంపేరిజన్ అనేది మరో పెద్ద సవాల్ కాబట్టి… గ్రాఫిక్స్ పై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు.

హాలీవుడ్ ప్రభావం..?

ఓటీటీల వల్ల ఆడియన్స్ హాలీవుడ్ సినిమాలకు బాగా అలవాటు పడిపోయారు. అక్కడ వచ్చే హై స్టాండర్డ్ సినిమాలు చూసిన తర్వాత… ఇక్కడ తెలుగులో వచ్చే సినిమాల నుంచి కూడా అలాంటిదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇది మరో సవాల్ విశ్వంభర టీంకి. అందుకే… కాస్త ఆలస్యమైన పర్లేదని… గ్రాఫిక్స్ పై ఫుల్ ఫోకస్ చేస్తున్నట్టు టాక్.

పరిశీలనలో రెండు డేట్స్..?

ఇక.. ఈ సవాళ్లను ఎదుర్కొవడానికి అన్ని విధాలుగా మూవీ టైం రెడీ అయిపోయింది. ఇక సినిమాలను ఆడియన్స్ ముందు పెట్టడానికి టైం వచ్చేసింది. అయితే ఇప్పుడు డేట్స్ అస్సలు ఖాళీ లేవు. చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న పెద్ద సినిమాలన్నీ కూడా ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి.

సమ్మర్‌లో బాక్సాఫీస్ ఎప్పుడూ రద్దీగా ఉండేది. కానీ, ఈ ఏడాది చాలా డల్ గా ఉంది. ఈ సమ్మర్ కి రిలీజ్ కావాల్సిన సినిమాలు ఇప్పుడు క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలో విశ్వంభర మూవీ టీం రెండు డేట్ లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది.

అందులో ఒకటి జూలై చివరి వారం. అలాగే మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే (ఆగష్టు 22). ఈ రెండు డేట్‌లను నిర్మాతలు పరిశీలిస్తున్నారట. దాదాపు చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగష్టు 22నే రిలీజ్ చేయాలనే ప్లాన్ ఉన్నట్టు టాక్.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×