BigTV English
Advertisement

Viral Video: బెంగళూరులో రాత్రి వేళ.. సన్‌ రూఫ్‌పై రెచ్చిపోయిన జంట

Viral Video: బెంగళూరులో రాత్రి వేళ.. సన్‌ రూఫ్‌పై రెచ్చిపోయిన జంట

Viral Video: దేనికైనా హద్దు లేదంటే వేళ పాలా అంటుంది. అది కాస్త శృతి మించితే ఇబ్బందులు సైతం తప్పవు. ఆ జంటకు అదే జరిగింది. ఛాన్స్ దొరికిందని సిటీలోని నడిరోడ్డుపై లిప్‌లాక్‌లతో రెచ్చిపోయింది.  వీరు వేగానికి పోలీసులు కళ్లెం వేశారు. ఇంతకీ అసలు కథేంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్దాం


బెంగళూరులో ఓ జంట వెళ్తున్న కారు సన్‌ రూఫ్ నుంచి బయటకు వచ్చింది. సిటీని ఎంజాయ్ చేస్తున్నారేమోనని వెనుక నుంచి వస్తున్న వాహనదారులు భావించారు. కాసేపు మాట్లాడినంత సేపు మాట్లాడారు. ఆపై లిప్‌లాక్‌లతో రెచ్చిపోయింది. కారు సైతం అదే స్పీడ్‌లో పోతోంది.  ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.

కొంతమంది ఆ సన్నివేశాన్ని వాహనదారులు ఫాలో అవుతూ ఎంజాయ్ చేసినవాళ్లు కొందరైతే, మండిపడినవాళ్లు ఇంకొందరు. కొద్ది నిమిషాల సేపు కారుపై ఈ సన్నివేశం చోటు చేసుకుంది.  అదే క్రమంలో వెనుక నుంచి వాహనదారులు కారుకి సమానంలో వేగాన్ని పెంచారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.


మే 27న బెంగళూరులోని ట్రినిటీ రోడ్డులో రాత్రి 10 గంటలు దాటిన తర్వాత లిప్‌లాక్ వ్యవహారం జరిగింది. కోరమంగళంలో రాత్రి భోజనం తర్వాత ఇంటికి తిరిగి వెళ్తోంది ఓ జంట. ఆ సమయంలో కారు సన్‌రూఫ్ నుంచి బయటకు వచ్చి అసభ్యకరంగా వ్యవహరించారు. వెనుక వస్తున్న కొందరు ఈ దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు.

ALSO READ: బాలీవుడ్ నటి డీప్‌ స్కానింగ్.. దొరికిపోయిన పాక్ పీఎం, వీడియో వైరల్

జంట వీడియో క్లిప్‌ను కర్ణాటక పోర్ట్‌ ఫోలియో ఎక్స్ ఖాతా షేర్ చేసింది. ఆ తర్వాత సిటీ పోలీసులను ట్యాగ్ చేసింది. రహదారి భద్రతకు ఇలాంటివి ప్రమాదకరమని రాసుకొచ్చింది. ఇలాంటివి ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని దుయ్యబట్టింది. ఈ వీడియో ఆధారంగా రియాక్ట్ అయ్యారు బెంగుళూరు సిటీ ట్రాఫిక్ పోలీసులు.

కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా వాహన యజమానిని గుర్తించారు. ఆపై 1,500 రూపాయల జరిమానా విధించారు. ప్రమాదకరమైన డ్రైవింగ్ నిమిత్తం 1,000 రూపాయలు జరిమానా వేసింది. అలాగే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల కింద మరో 500 రూపాయలు ఫైన్ వేసింది.

నెల కిందట అంటే ఏప్రిల్ 12న ఈ తరహా ఘటన జరిగింది. మాదవార మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట అనుచితంగా వ్యవహరించింది. ఆపై కెమెరాకు చిక్కింది. ఇతర ప్రయాణికుల సమక్షంలో ఆ జంట వ్యవహారించిన తీరుపై సామాన్యులు మండిపడిన విషయం తెల్సిందే.

 

Related News

Longest Name: ప్రపంచంలోనే పొడవైన పేరున్న వ్యక్తి ఇతడే.. ఏకంగా గిన్నిస్ రికార్డు కొట్టేశాడు!

Shocking Video: లక్నోలో రెచ్చిపోయిన యువతి.. కారులో నగ్నంగా ప్రయాణం.. వీడియో వైరల్

Viral Video: ఆఫీసులో తింగరి వేషాలేంటి? హీటెక్కిపోయిన బ్యాంక్ మేనేజర్, ఆ తర్వాత ఏం జరిగిందంటే

Man Wins Rs 240 Cr Lottery: తెలంగాణ బిడ్డకు రూ.240 కోట్ల లాటరీ.. ఇదిగో ఇలా చేస్తే మీరూ కోటీశ్వరులే!

Hanumakonda: కోయ్.. కోయ్.. కొక్కొరొక్కో.. కోళ్ల కోసం జనం పరుగుల వేట

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

Big Stories

×