Chiranjeevi: సినీ పరిశ్రమ నుండి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేసి లీడర్‌గా వెలిగిపోవాలని అనుకునేవారు చాలామంది ఉన్నారు. కానీ అందులో కొందరు మాత్రమే పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యి అటు రాజకీయాల్లో, ఇటు సినీ రంగంలో తమ పేరును ఒక బ్రాండ్‌గా మార్చుకున్నారు. ఇక చిరంజీవి కూడా సినీ రంగంలో మెగాస్టార్‌గా వెలిగిపోతున్న సమయంలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సినిమాలను పూర్తిగా దూరం పెట్టేశారు. కానీ కొన్నాళ్లు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న తర్వాత వెనుదిరిగారు. కానీ చిరంజీవి తమ్ముళ్లైన పవన్ కళ్యాణ్, నాగబాబు మాత్రం రాజకీయాల్లో దూసుకుపోతుండడంతో ట్విటర్ ద్వారా తన సంతోషాన్ని బయటపెట్టారు చిరు.
మొదటిసారి ఎదురుదెబ్బ
చిరంజీవి తర్వాత తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నాడు. అందుకే జనసేన అని ఒక పార్టీని స్థాపించాడు. పవన్‌కు అప్పటికే సినిమాల్లో మంచి ఫాలోయింగ్ ఉండడంతో రాజకీయాల్లో కూడా అదే సక్సెస్ కంటిన్యూ అవుతుంది అనుకున్నారు. కానీ మొదటి అడుగులో పవన్‌కు ఎదురుదెబ్బే తగిలింది. పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీ చేసిన మొదటిసారి తనకు విజయం లభించలేదు. కానీ రెండోసారి.. అంటే 2024 ఎన్నికల్లో మాత్రం పవన్ కళ్యాణ్ సాధించిన విజయం అందరికీ గుర్తుండిపోయేలా నిలిచింది. అలా పవన్ బాటలోనే నాగబాబు (Nagababu) కూడా రాజకీయాల్లోకి సక్సెస్‌ఫుల్‌గా ఎంటర్ అయ్యారు.
అన్న ఆశీస్సులు
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబు విజయం సాధించాడు. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించి మొదటిసారి శాసనమండలిలో అడుగుపెట్టనున్నాడు. ఈ సందర్భంగా తనకు విషెస్ తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. ‘శాసనమండలిలో తొలిసారి అడుగుపెట్టబోతున్న నా తమ్ముడు నాగేంద్ర బాబుకు నా అభినందనలు, ఆశీస్సులు. ప్రజా సమస్యల మీద గళం విప్పుతూ, వారి అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడేలా నువ్వు చేసే కృషిలో ఎప్పుడూ విజయం సాధించాలని, వారి అభిమానాన్ని మరింతగా చూరగొనాలని ఆశిస్తూ నీకు నా శుభాకాంక్షలు’ అంటూ తన ట్విటర్ పోస్ట్ చేశారు చిరంజీవి (Chiranjeevi). దీంతో తమ్ముళ్ల విజయం చూసి మెగాస్టార్ ఎంత సంతోషిస్తున్నారో అర్థమవుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
Also Read: అందుకే పవన్ సనాతన ధర్మ పరిరక్షకుడిగా మారాడా.? ఈ స్పెషల్ ఏవీ చూస్తే గూస్‌బంప్సే!
సక్సెస్ సెలబ్రేషన్స్
2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్నే పెద్ద పండగలాగా జరుపుకున్నారు ఫ్యాన్స్. అందుకే అప్పటినుండి ప్రతీ ఏడాది మార్చి 14ను పండగలాగానే సెలబ్రేట్ చేస్తారు అభిమానులు. ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన గెలిచిన తర్వాత వచ్చిన మొదటి ఆవిర్భావ దినోత్సవం కావడంతో ఈసారి వేడుకలు మరింత ఘనంగా జరుగుతున్నాయి. దీనికోసం పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదు.. ఫ్యాన్స్ కూడా ఎన్నో ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలకు పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు ఎంతోమంది అభిమానులు కూడా హాజరయ్యారు. పవన్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ స్పీచ్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ స్పీచ్ మరొక హైలెట్ కానుందని వారు నమ్ముతున్నారు.
ఎమ్మెల్సీ గా ఎన్నికయి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి లో తొలి సారి అడుగు పెట్టబోతున్న నా తమ్ముడు నాగేంద్రబాబు @NagaBabuOffl కి నా అభినందనలు,ఆశీస్సులు!💐
ప్రజా సమస్యల మీద గళం విప్పుతూ, వారి అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడేలా నువ్వు చేసే కృషిలో ఎప్పుడూ విజయం సాధించాలని, వారి అభిమానాన్ని…
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 14, 2025