Samanth Health : తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోన్న సమంత .. మరోసారి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల ముందు నుంచి సమంత చర్మ వ్యాధితో బాధపడుతుందంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే శనివారం అనుకోని విధంగా తాను మియోసిటిస్ అనే కండరాల వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇది ఆమె అభిమానులకే కాదు.. ప్రేక్షకులకు, చిత్ర పరిశ్రమలకు షాకింగ్ న్యూస్ అయ్యింది. సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలు, నెటిజన్స్ సమంత త్వరగా కోలుకోవాలని చెబుతూ ఆమెకు మనో ధైర్యాన్నిచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదే విషయంపై సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అయ్యారు. ‘‘ప్రియమైన సమంత… మనకు జీవితంలో అనుక్షణం సవాళ్లు ఎదురువుతుంటాయి. వీటి కారణంగా మనలోని మానసిక స్థైర్యం బయటపడుతూ ఉంటుంది. నువ్వు గొప్ప సంకల్పం ఉన్న అమ్మాయివి. ఈ సవాలుని కూడా అధిగమిస్తావని నాకు తెలుసు. నువ్వు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. అలాంటి శక్తిని ఆ దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. చిరంజీవితో పాటు మెగాభిమానులు సైతం సమంత త్వరగా కోలుకోవాలని భావిస్తున్నారు. మరో వైపు సమంత నుంచి విడిపోయిన అక్కినేని నాగ చైతన్య సోదరుడు, హీరో అఖిల్ అక్కినేని సైతం రియాక్ట్ అయ్యారు. ‘అందరి ప్రేమాభిమానాలు నీకు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అంటూ స్పందించారు.
సమంత ఇంత అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, తాను నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం యశోద డబ్బింగ్‌ను హాస్పిటల్ బెడ్‌పై నుంచే పూర్తి చేసింది. ఈ చిత్రం నవంబర్ 11న రిలీజ్ అవుతుంది.