BigTV English

Nazriya Nazeem : విడాకుల దిశగా నజ్రియా.. ఆ పోస్టుకు అర్థం అదేనా..?

Nazriya Nazeem : విడాకుల దిశగా నజ్రియా.. ఆ పోస్టుకు అర్థం అదేనా..?

Nazriya Nazeem :మలయాళం లో స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న నజ్రియా నజీమ్ (Nazriya Nazeem). తెలుగులో నాని(Nani ) హీరోగా నటించిన ‘అంటే సుందరానికి’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. రీ ఎంట్రీ లో తెలుగులో హీరోయిన్ గా చేసిన ఈమె.. ఈ సినిమా తర్వాత మళ్లీ తెలుగులో నటించలేదు.కానీ మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. వాస్తవానికి ఈ సినిమా కంటే ముందే తమిళ్లో విడుదలైన ‘రాజా రాణి’ మూవీని తెలుగులో విడుదల చేసి, తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇప్పుడు ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది. ఇకపోతే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుండే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఒక పోస్ట్ పెట్టడంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన నజ్రియా..

ఆ పోస్ట్ ద్వారా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ.. “మీరందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే కొంతకాలంగా మీ అందరికీ ఎందుకు నేను దూరంగా ఉన్నానో పంచుకోవడానికి కొంత సమయం కేటాయించాలనుకుంటున్నాను. మీలో చాలామందికి తెలిసినట్టుగా నేను ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటాను. అయితే కొన్ని నెలలుగా నేను నా వ్యక్తిగత సవాళ్లతో ఇబ్బంది పడుతున్నాను.పైగా నా మనసు కుదురుగా లేదు. అందుకే డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. గత కొన్ని నెలలుగా నేను అనేక ముఖ్యమైన కార్యక్రమాలను కూడా మిస్ అయ్యాను. అందులో నా 30వ పుట్టినరోజు, నూతన సంవత్సర వేడుకలు, నా చిత్రం ‘సూక్ష్మదర్శిని’ విజయంతో పాటు అనేక ఇతర ముఖ్యమైన క్షణాలను మిస్ అయ్యాను. నన్ను క్షమించండి. అలాగే నా స్నేహితులందరికీ నేను క్షమాపణలు చెబుతున్నాను. నేను ఎందుకు మౌనంగా ఉన్నానో చెప్పలేదు. ఫోన్ కాల్స్ తీయలేదు. మెసేజ్లకు రిప్లై ఇవ్వలేదు. నేను కలిగించిన అసౌకర్యానికి నిజంగా చింతిస్తున్నాను. పని కోసం నన్ను సంప్రదించడానికి ప్రయత్నించిన నా కో స్టార్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లు, అందరికీ కూడా క్షమాపణలు కోరుతున్నాను. నావల్ల ఏదైనా అంతరాయం కలిగితే క్షమించండి” అంటూ రాసుకుంది.


నజ్రియా పోస్ట్ కి సమంతా రిప్లై..

ఇకపోతే నజ్రియా చేసిన ఈ పోస్ట్ కి సోషల్ మీడియాలో పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు సమంత (Samantha)ఈ పోస్ట్ కి లవ్ సింబల్ ను కామెంట్ లో షేర్ చేసింది. దీంతో ప్రతి ఒక్కరు కూడా కొంపతీసి నజ్రియా వ్యక్తిగత ప్రాబ్లమ్స్ అంటుంది..తన భర్తకి గానీ విడాకులు ఇవ్వట్లేదు కదా అంటూ పలుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై నజ్రియా ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో చూడాలి. ఏదిఏమైనా నజ్రియా రిలీజ్ చేసిన ఈ ప్రెస్ నోట్ మాత్రం అందరిలో సరికొత్త అనుమానాలు క్రియేట్ చేస్తోందని చెప్పవచ్చు. ఇక ఈమె భర్త ఫహాద్ ఫాజిల్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇటీవల పుష్ప, పుష్ప 2 సినిమాతో భారీ క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం తెలుగులో పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×