Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను సంధ్య థియేటర్ ఘటన వదిలేలా కనిపించడం లేదు. పుష్ప 2 ప్రీమియర్ షోలో రేవతి అనే మహిళ మృత్యువాత పడిన విషయం విదితమే. ఈ ఘటనలో భాగంగా సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని ఇదివరకే పోలీసులు అరెస్టు చేశారు. ఈ మధ్యనే అల్లు అర్జున్ కూడా అరెస్టు చేశారు. ఇప్పటికే తనపై ఉన్న కేసును కొట్టివేయాలని బన్నీ పిటిషన్ దాఖలు చేయగా .. అది విచారణకు కూడా రాకముందే చిక్కడపల్లి పోలీసులు బన్నీ విచారణ నిమిత్తం అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
అయితే బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించగా.. లాయర్ అడిగిన లాజిక్ ప్రశ్నలకు కోర్టు ఆలోచించి బెయిల్ మంజూరు చేయడంతో బన్నీ బయటకు వచ్చాడు. ఇక ఇప్పటివరకు బన్నీ.. బాధిత కుటుంబాన్ని కలవలేదు. నిన్ననే అల్లు అరవిండ్.. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ నుకలిసి వచ్చాడు. పిల్లాడి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని తెలుస్తోంది. కోర్టు కేసు వలన బాధిత కుటుంబాన్ని బన్నీ కలవకూడదని చెప్పడంతో ఆయన చూడడానికి రాలేదని అల్లు అరవింద్ చెప్పుకొచ్చాడు.
Mohan Babu: చిరంజీవిపై మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు.. ఆ వీడియోను షేర్ చేస్తూ..
ఇక ఈ ఘటనలో ఇండస్ట్రీ మొత్తం బన్నీకి సపోర్ట్ గా నిలబడింది. ఇది ఒక్కరి వలన జరిగింది కాదని, దానికి బన్నీ ఒక్కడినే బాధ్యత వహించమనడం తప్పు అని చెప్పుకొస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ ఇండస్ట్రీని షేక్ చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడిప్పుడే కొద్దిగా ఆ ఘటన నుంచి బయటపడుతున్నాడు అనుకొనేలోపు.. బన్నీకి మరో షాక్ తగిలింది. లోకల్ నుంచి నేషనల్ వైడ్ గా ఈ కేసు పాకింది. బన్నీపై ఢిల్లీలో కేసు నమోదు అయ్యింది.
సంధ్య థియేటర్ తొక్కిసలాటపై యుగేందర్ గౌడ్ అనే వ్యక్తి జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఒక సినిమా వలన ఒకరి ప్రాణం పోయింది.. ఇంకో పసి ప్రాణం కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు రావద్దు అని చెప్పినా.. అల్లు అర్జున్ రావడంవలనే ఆమె ప్రాణం పోయింది. అందుకే వారిని వదిలేది లేదు.
Nandamuri Kalyan Ram: తమ్ముడు కోసం సైఫ్ ఆలీఖాన్.. అన్న కోసం సోహైల్ ఖాన్.. అదిరిందిగా
పుష్ప 2 చిత్ర బృందంతో పాటు అల్లు అర్జున్ పై కూడా చర్యలు తీసుకోవాలని యుగేందర్ ఫిర్యాదులో తెలిపాడు. ప్రచారమోజులో పది ప్రజల ప్రాణాలు తీశారు. వారిని ఊరికే వదలకూడదు. నిర్లక్ష్యం వలన ఒక నిండు ప్రాణం బలి అయ్యిందని యుగేందర్ చెప్పుకొచ్చాడు. మరి ఇప్పటివరకు లోకల్ పంచాయితీని ఎదుర్కున్న బన్నీ ఈ ఢిల్లీ పంచాయితీని ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.