BigTV English

O Yeong Su: లైంగిక వేధింపుల కేసు.. 80 ఏళ్ల నటుడికి జైలుశిక్ష

O Yeong Su: లైంగిక వేధింపుల కేసు.. 80 ఏళ్ల నటుడికి జైలుశిక్ష

O Yeong Su: సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు అనేవి కామన్ అని ప్రేక్షకులు ఫీలవుతుంటారు. అందులో కొన్ని బయటికి వస్తుంటాయి. కొన్ని రావు. కొన్నిసార్లు క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణల వల్ల పెద్ద పెద్ద నటులు సైతం చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా ఒక కొరియన్ నటుడి విషయంలో కూడా అదే జరిగింది. కొరియన్ సినిమాలకు, వెబ్ సిరీస్‌లకు ఇండియాలో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అలా ‘స్క్విడ్ గేమ్’ అనే వెబ్ సిరీస్ నాలుగేళ్ల క్రితం విడుదలయ్యి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. ఇందులో కీలక పాత్రలో నటించిన ఒక నటుడు లైంగిక వేధింపుల ఆరోపణల వల్ల ఏకంగా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ నటుడి వయసు 80 ఏళ్లు అవ్వడం గమనార్హం.


కోర్టు తీర్పు

నెట్‌ఫ్లిక్స్‌లో ఎన్నో ఒరిజినల్ కొరియన్ వెబ్ సిరీస్‌లు విడుదల అవుతుంటాయి. కానీ వాటన్నింటికి మించి ‘స్క్విడ్ గేమ్’ సిరీస్ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ వెబ్ సిరీస్‌ను ఇండియన్ ప్రేక్షకులు సైతం ఆదరించారు. ఒకరు, ఇద్దరు అని కాకుండా దాదాపుగా ఈ సిరీస్‌లో నటించిన ప్రతీ ఒక్కరికి సమానంగా ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నించాడు దర్శకుడు. అలాంటి నటీనటుల్లో 80 ఏళ్ల యాక్టర్ అయిన ఓ యోంగ్ సు కూడా ఉంటారు. అలాంటి ఓ యోంగ్ సుపై ఇప్పటికే ఒకసారి లైంగిక వేధింపుల ఆరోపణలు రాగా తాజాగా కోర్టు ఈ కేసులో ఒక తీర్పునిచ్చింది. ఈ నటుడికి జైలుశిక్ష విధించింది.


తప్పు తేలిపోయింది

‘స్క్విడ్ గేమ్’ (Squid Game) వెబ్ సిరీస్‌లో ప్లేయర్ 001గా కనిపించాడు ఓ యోంగ్ సు. తాజాగా ఒక అమ్మాయిని రెండు వేర్వేరు సందర్భాల్లో లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై కోర్టు తనకు శిక్ష విధించింది. తనపై ఈ కేసు నమోదయ్యి చాలాకాలమే అయినా ఇప్పటివరకు తను నిందితుడు అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కోర్టు.. ఈ కేసును వాయిదా వేస్తూ వచ్చింది. ఇక ఏప్రిల్ 3న ఈ కేసుకు సంబంధించిన చివరి హియరింగ్ జరిగింది. దాదాపు అయిదు దశాబ్దాలుగా థియేటర్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఓ యోంగ్ సు.. అదే థియేటర్ గ్రూప్‌లో పనిచేస్తున్న ఒక జూనియర్ ఆర్టిస్ట్‌ను లైంగికంగా వేధించాడని కోర్టు నిర్ధారించింది.

Also Read: రీ రిలీజ్‌లతో ఇంత లాభమా.? కొత్త సినిమాల కంటే రీ రిలీజ్‌లే ఎక్కువ..

తండ్రి లాంటివాడిని

ఓ యోంగ్ సు (O Yeong Su) చేసిన లైంగిక వేధింపుల వల్ల బాధితురాలు పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటుందని, మానసికంగా కృంగిపోయిందని తన తరపున లాయర్ వాధించారు. ఒకసారి లైంగికంగా తనను వేధించిన తర్వాత క్షమాపణలు చెప్పకుండా ఒక తండ్రిలాగా భావించి అలా చేశానని వ్యాఖ్యలు చేశాడట ఓ యోంగ్ సు. అందుకే బాధితురాలు ఎదుర్కున్న మానసిక క్షోభను దృష్టిలో పెట్టుకొని కోర్టు తనకు శిక్ష విధించాలని నిర్ణయించుకుంది. ‘స్క్విడ్ గేమ్’ వల్లే ఓ యోంగ్ సుకు పాపులారిటీ లభించింది కాబట్టి తన వల్ల ఈ షోకు ఎలాంటి డ్యామేజ్ జరగకూడదని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి తను చేసిన తప్పును ఒప్పుకున్న ఈ నటుడు ఒక ఏడాది పాటు జైలుశిక్షకు సిద్ధమయ్యాడు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×