Devi Sri Prasad..ఈ మధ్యకాలంలో సంగీత దర్శకులు ఎక్కువగా అభిమానులకు చేరువ అవ్వడానికి మ్యూజికల్ లైవ్ కాన్సర్ట్ నిర్వహిస్తూ.. అభిమానులకు మరింత దగ్గరవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎం ఎం కీరవాణి (MM Keeravani) మొదలుకొని ఏఆర్ రెహమాన్(AR Rahman) వరకు చాలామంది దిగ్గజ మ్యూజిక్ దర్శకులు ఇలా లైవ్ కాన్సర్ట్ నిర్వహించి అభిమానులకు చేరువయ్యారు.. ముఖ్యంగా తమ కెరియర్లో బెస్ట్ గా నిలిచిన పాటలను లైవ్లో పాడి.. ఆ మ్యూజిక్ తో అభిమానులను అలరించారు.. ఈ క్రమంలోనే ఇప్పుడు దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) కూడా విశాఖపట్నంలో మ్యూజికల్ కాన్సెర్ట్ నిర్వహించనున్నారు. ఈ నెల 19వ తేదీన విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్లో ఈ మ్యూజికల్ కాన్సెర్ట్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇప్పటికే ఆన్లైన్లో భారీగా టికెట్ల విక్రయం కూడా జరిగిపోయింది. కానీ ఆఖరి క్షణం లో రంగంలోకి దిగిన విశాఖ పోలీసులు లైవ్ కాన్సర్ట్ కి అనుమతి నిరాకరించారు. ముఖ్యంగా భద్రతా కారణాలతోనే అనుమతి ఇవ్వమని సిపి శంఖబ్రత బాగ్చీ తెలిపారు. అయితే అనుమతి ఇవ్వకపోవడానికి అసలు కారణం ఏమిటంటే.. విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ లో వాటర్ వరల్డ్ లో బాలుడు చనిపోయిన ఘటన నేపథ్యంలోనే దేవిశ్రీప్రసాద్ మ్యూజికల్ కాన్సర్ట్ కి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇకపోతే అంతా పూర్తయింది. టికెట్లు కూడా అమ్ముడుపోయిన చివరి క్షణంలో ఇలా పోలీసులు నిరాకరించడంతో లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహిస్తున్న నిర్వాహకులలో ఆందోళన మొదలయ్యింది. మరి దీనిపై నిర్వాహకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
మ్యూజిక్ కాన్సెర్ట్ పై దేవిశ్రీప్రసాద్ కామెంట్స్.
దేవిశ్రీప్రసాద్ విషయానికి వస్తే.. సౌత్ లో ఉండే స్టార్ మ్యూజిక్ కంపోజర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఈయన.. గత కొన్నేళ్లుగా తన సంగీతంతో మ్యూజిక్ లవర్స్ ని అలరిస్తున్నారు. జోనర్ ఎలాంటిదైనా సరే దానికి తగ్గట్టుగా పాటలు అందిస్తూ.. ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్పెషాలిటీ క్రియేట్ చేసుకున్నారు. ముఖ్యంగా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా నేషనల్ ఫిలిం అవార్డు కూడా లభించింది. అలా ఒకవైపు సినిమాలకు సంగీతం సమకూరుస్తూనే.. మరొకవైపు అభిమానులను అలరించడానికి అప్పుడప్పుడు మ్యూజిక్ కాన్సర్ట్ చేస్తూ ఉంటాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన ఇలా లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్లకు సంబంధించి కొన్ని విషయాలను పంచుకున్నారు.
నా షోలన్నీ లిక్కర్ ఫ్రీ – దేవిశ్రీప్రసాద్..
అసలు విషయంలోకి వెళ్తే.. చివరిగా ‘తండేల్’ సినిమాతో మ్యూజిక్ బ్లాక్ బాస్టర్ అందుకున్న రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్.. ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా సంగతులు, వ్యక్తిగత విషయాలపై మాట్లాడారు ఈయన మాట్లాడుతూ.. “:నా ఈవెంట్స్ లో లిక్కర్ ఉండదనే విషయాన్ని వెల్లడిస్తున్నా.. నా షో లన్నీ కూడా లిక్కర్ ఫ్రీ గా చేయాలనుకుంటాను. నేను డ్రింక్ చేయను. స్మోక్ చేయను. మద్యపానానికి దూరంగా ఉండాలనుకుంటాను. అందుకే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. నేను ఎవరిని జడ్జి చేయడం లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ పొగ , మందు తాగేటప్పుడు కాస్త ఆలోచిస్తే మంచిదని నేను భావిస్తాను”అంటూ తెలిపారు. ముఖ్యంగా “ఈ మధ్యకాలంలో పెద్ద షో అయినా సరే ఆల్కహాల్ కచ్చితంగా ఉంటుంది. అందుకే అందరూ డ్రింక్ చేసి ఇక్కడ స్టేజ్పై ఎంజాయ్ చేయడానికి వస్తారనుకుంటారు. కానీ నా షోలో మాత్రం మ్యూజిక్ ను ఎంజాయ్ చేయాలని మాత్రమే నేను అనుకుంటాను అంటూ దేవిశ్రీప్రసాద్ తెలిపారు.