BigTV English

Venkatesh: ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత వెంకీ మామ ప్రయాణం ఎటువైపు.? లిస్ట్‌లో యంగ్ డైరెక్టర్స్..

Venkatesh: ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత వెంకీ మామ ప్రయాణం ఎటువైపు.? లిస్ట్‌లో యంగ్ డైరెక్టర్స్..

Venkatesh: ఈరోజుల్లో యంగ్ హీరోల కంటే సీనియర్ హీరోల ప్లానింగే చాలా ఫాస్ట్‌గా ఉంటోంది. యంగ్ హీరోలంతా పాన్ ఇండియా అనే ట్యాగ్‌తో ఒక్కొక్క సినిమాను రెండు లేదా మూడేళ్లు తెరకెక్కిస్తున్నారు. కానీ సీనియర్ హీరోలు మాత్రం అలా కాదు.. రూటు మార్చారు. యంగ్ డైరెక్టర్లను నమ్ముకుంటూ ఏడాదికి కనీసం ఒక్క సినిమాతో అయినా ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ లిస్ట్‌లో వెంకీ మామ కూడా ఉంటారు. ఇప్పటికే అనిల్ రావిపూడితో కలిసి ‘సంక్రాంతికి వస్తున్నాం’తో మూడో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు వెంకటేశ్. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా దీని తర్వాత వెంకీ మామ ప్రయాణం ఎటువైపు అనే చర్చలు మొదలయ్యాయి.


హీరో సమాధానం

మామూలుగా ఒకేసారి రెండు, మూడు సినిమాలను అనౌన్స్ చేసి మెల్లగా వాటి షూటింగ్‌ను పూర్తి చేస్తూ రిలీజ్ చేసే టైప్ కాదు వెంకీ మామ. ఒకసారి ఒకే సినిమాపై దృష్టిపెడతాడు. అలా కొన్నాళ్ల క్రితం అనిల్ రావిపూడితో కలిసి ‘సంక్రాంతికి వస్తున్నాం’ను అనౌన్స్ చేశారు. వీలైనంత త్వరగా ఈ మూవీని పూర్తి చేసి, అనుకున్నట్టుగానే సంక్రాంతి బరిలో దించారు. మరి దీని తర్వాత వెంకటేశ్ (Venkatesh).. ఏ డైరెక్టర్‌ను ఓకే చేశారు అనే చర్చ ఫ్యాన్స్‌లో మొదలయ్యింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రమోషన్స్ సమయంలో కూడా వెంకటేశ్‌కు ఇదే ప్రశ్న ఎదురయ్యింది. దీనికి ఈ సీనియర్ హీరో ఆసక్తికర సమాధానం అందించారు.


Also Read: గొప్ప మనసు చాటుకున్న మంచు హీరో.. 120 మంది పిల్లలు దత్తత..!

నిర్మాతలు సిద్ధం

ప్రస్తుతం తన అన్న సురేశ్ బాబుతో పాటు మరో ముగ్గురు నిర్మాతలు తనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు వెంకీ మామ. సురేశ్ ప్రొడక్షన్స్, మైత్రీ మూవీ మేకర్స్, సితార ఎంటర్‌టైన్మెంట్స్, వైజయంతీ మూవీస్.. వెంకటేశ్‌తో సినిమాలు ప్లాన్ చేయడానికి రెడీగా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆయనతో మూవీ చేయడానికి తరుణ్ భాస్కర్, విమల్ కృష్ణ, అనుదీప్ కేవీ వంటి యంగ్ దర్శకులు క్యూలో ఉన్నారని తెలుస్తోంది. కానీ వెంకటేశ్ మాత్రం ప్రస్తుతం అన్నీ స్క్రిప్ట్స్ వింటూ ‘సంక్రాంతికి వస్తున్నాం’ రిలీజ్ హడావిడి పూర్తయిన తర్వాతే మరొక మూవీని సైన్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

హ్యాట్రిక్ హిట్

ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) విషయానికొస్తే.. ఇదొక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అంటూ, దీనిని ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయడం కోసం మేకర్స్ చాలానే కష్టపడ్డారు. ఇప్పటికే వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ లాంటి సినిమాలు రాగా ఆ రెండూ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అందుకే వీరి కాంబోలో వచ్చే హ్యాట్రిక్ మూవీపై ముందు నుండి ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. అలాగే ఇప్పటికే ఈ మూవీ చూసిన ప్రేక్షకులు ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని ఫిక్స్ అయిపోతున్నారు. అనిల్ రావిపూడి మూవీస్ యూత్‌కు ఎలా అనిపించినా.. వాటికి ఫ్యామిలీస్‌లో మాత్రం విపరీతమైన పాపులారిటీ ఉంటుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×